Shobita Dhulipala movie OTT Release Date: హీరోయిన్ శోభిత ధూళిపాళ ప్రధాన పాత్ర పోషిస్తున్న లవ్ సితార అనే బోల్డ్ మూవీ డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కు రెడీ అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఈ ట్రైలర్ విశేషాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
లవ్ సితార ట్రైలర్ విశేషాలు
శోభిత ధూళిపాళ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో ప్రతిరోజూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో లవ్, ఎంగేజ్మెంట్ తర్వాత ఈ బ్యూటీ గురించి ఎలాంటి వార్త వచ్చినా అక్కినేని అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు అడవి శేష్ గూఢచారి సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది శోభిత. మారోవైపు పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే శోభిత బాలీవుడ్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో హాట్ అండ్ బోల్డ్ గా నటించి అదరగొట్టిన శోభిత ఇప్పుడు లవ్ సితార అంటూ డైరెక్ట్ గా ఓటీటిలో ఎంటర్టైన్ చేయబోతోంది.
తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రెండు నిమిషాల నలభై మూడు సెకండ్ల నిడివి ఉండగా, అందులో లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ రొమాంటిక్ అంశాలన్నీ కలగలిసి ఉన్నట్టుగా చూపించారు. ఇందులో శోభిత ధూళిపాళ ఇంటీరియర్ డిజైనర్ గా, ఇండివిజువల్ భావాలు ఉన్న అమ్మాయిగా నటిస్తోందనే విషయం ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది. కుటుంబంలో సాధారణంగా ఉండే సమస్యలను, వారి ఎమోషన్స్ బాగా ఎలివేట్ చేశారు మేకర్స్. ఇందులో ఆమె పాత్ర పేరు తార. ఇంటర్నేషనల్ చెఫ్ అయిన అర్జున్ తో తార ప్రేమలో పడుతుంది. అయితే పెళ్లి కంటే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ఇద్దరూ కలిసి తారా ఇంటికి వెళ్తారు. అక్కడ పెళ్లి జరగకముందే తార కుటుంబంలో ఉన్న విభేదాలు, కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి. మరి వాటి వల్ల తార, అర్జున్ రిలేషన్ షిప్ లో ఎలాంటి మార్పు వచ్చింది? చివరికి వీరిద్దరి లవ్ స్టోరీ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది తెరపై చూడాలి.
Also Read: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తున్న తంగలాన్ – స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే!
ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందంటే?
లవ్ సితార సినిమాలో శోభిత ధూళిపాళతో పాటు రాజీవ్ సిద్ధార్థ, జయశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి వందన కటారియ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆర్ఎస్విపి మూవీస్ బ్యానర్ పై రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. జీ5 ఒరిజినల్ ఫిలింగా రూపొందిన లవ్ సితార మూవీ సెప్టెంబర్ 27న జీ5 ఓటిటిలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా గురించి ఇటు అక్కినేని అభిమానులతో పాటు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తరువాత శోభిత నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.
Also Read: ‘ది గోట్’ రివ్యూ: తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే… విజయ్ సినిమా హిట్టా? ఫట్టా?
మరిన్ని చూడండి