ధాన్యలక్ష్మి భోజనానికి రాకపోవడంతో ఆస్తి పంపకాలు జరిగేవరకూ అలాగే ఉంటుంది అంటారు. నీ బుద్ది ఏమైందని ప్రకాశంని రుద్రాణి క్వశ్చన్ చేస్తుంది. ఏడ్చిన ప్రతిసారీ కొండమీద కోతిని కూడా తీసుకురమ్మంటుంది అందుకే బతిమలాడడం ఉండదంటాడు. ఆకలికి ఆగలేదు ఏ అర్థరాత్రో దొంగతనంగా వచ్చి తింటుందిలే అంటాడు
డిజైన్లు కలెక్ట్ చేస్తుంది కావ్య..ఇంతలో రాజ్ వచ్చి సెటైర్స్ వేస్తాడు. మా టింగ్ ఉండగా మీ టింగ్ పెట్టారేంటంటూ కామెడీ చేస్తాడు. CEO గా చెబుతున్నా మీరు కూర్చోండంటుంది కావ్య..నేను దుగ్గిరాల అనబోతుంటే ఏంటి మేనేజర్ అని రివర్స్ పంచ్ వేస్తుంది కావ్య. ఇద్దరూ వాదించుకుంటుండగా జగదీశ్ చంద్రప్రసాద్ వస్తాడు
నేను విన్నది నిజమే..మీ ఇద్దరి మధ్యా గొడవలతో కాంట్రాక్ట్ సంగతి పట్టించుకోవడం లేదని మార్కెట్లో అంతా అనుకుంటున్నారంటాడు. అప్పుడు రాజ్ లో కంగారు మొదలవుతుంది.. ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటే మళ్లీ కళావతి CEO సీట్లో కూర్చుంటుందని భయపడతాడు. అందుకే కావ్యపై ప్రేమ ఉన్నట్టు , ఇద్దరూ కలసే ఉన్నట్టు నటిస్తాడు
విడిపోయిన భార్యాభర్తలు ఓ చోటే ఎందుకు పనిచేస్తారు? ఓ ప్రాజెక్ట్ కోసమే ఎందుకు పనిచేస్తారని కవర్ చేసే ప్రయత్నాలు చేస్తాడు. మరి మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారని అడిగితే..మేం మాట్లాడుకుంటున్నాం, డిజైన్లు గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటాడు. రెండు టీమ్స్ గా విడిపోయి పోటా పోటీగా పనిచేస్తేనే కదా మంచి రిజల్ట్ వచ్చేది అని కవర్ చేస్తాడు
నువ్ కూడా ఏమైనా చెప్పు అని కావ్య నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు.. మీరు నడుం పట్టుకునే మాటలురావండి అంటుంది కావ్య. ఏం చేసినా CEO సీటు కోసమే అంటుంది కావ్య..జగదీష్ షాక్ అవుతాడు. ఠక్కున వదిలేస్తాడు..కావ్య తూలి పడపోతుంటే పట్టుకుంటాడు. మీరు ఏదోటి చేసి మంచి డిజైన్స్ ఇవ్వండి అనేసి వెళ్లిపోతాడు
కాంట్రాక్ట్ కోసం అందరిముందు అలా బిహేవ్ చేస్తారా అని గొడవపడుతుంది కావ్య. నమ్మించడం కోసం నటిస్తారా తప్పుకాదా అని కావ్య అంటే ఏం కాదు అంటాడు. మీది తప్పు కానప్పుడు మా అమ్మ ఆడిన క్యాన్సర్ నాటకం కూడా తప్పుకాదంటుంది. నువ్వు ఈ డీల్ క్యాన్సిల్ అయితే CEO సీట్లో కూర్చుని ఏడిపిద్దాం అనుకుంటున్నావా అని పంచ్ వేస్తాడు. నా కంఠంలో మంగళసూత్రం ఉన్నంతవరకూ మిమ్మల్ని గెలవనివ్వను అని సవాల్ చేస్తుంది.
సీతారామయ్యను కలిసిన జగదీష్…నీ మనవడికి అన్నీ నీ పోలికలే. నన్ను నమ్మించడానికి కావ్యపై చేతులు వేయడాలు, పట్టుకోవడాలు తెగ నటించేశాడు అంటాడు. అంత మంచి భార్యను రాజ్ ఎందుకు దూరం పెడుతున్నాడు అని అడిగితే..రాజ్ బిహేవియర్ వారి జీవితానికి శాపంగా మారిందంటాడు.నీ కాంట్రాక్ట్ పుణ్యమా అని వాళ్లు కలిస్తే చాలంటాడు సీతారామయ్య.. తన దగ్గరకు అనామిక వచ్చిన సంగతి చెబుతాడు జగదీష్.
పొట్టి నీకు గుడ్ న్యూస్ అని ఎంట్రీ ఇస్తాడు కళ్యాణ్.. నువ్వు తండ్రివి కాబోతున్నావా అంటుంది. నీ ప్రమేయం లేకుండా ఎలా అంటాడు కళ్యాణ్ మీ పెదనాన్నలా చిన్నిల్లు ఉందేమో అంటుంది. అనామికను గుర్తుచేస్తుంది అప్పు. కవి హర్ట్ అవుతాడు..కూల్ చేస్తుంది అప్పు. అప్పుడు లక్ష్మీకాంత్ దగ్గర అసిస్టెంట్ గా చేరానని చెబుతాడు కానీ అగ్రిమెంట్ సంగతి దాచిపెడతాడు
బ్రహ్మముడి నవంబరు 18 సోమవారం ఎపిసోడ్ లో…తస్కరించుట అంటూ కావ్య చాంబర్లోకి ఎంట్రీ ఇస్తాడు రాజ్.. కావ్య గిసిన డిజైన్లు దొంగతనం చేయబోతాడు..ఇంతలో హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానంటూ కావ్య వస్తుంది..రాజ్ బెంచ్ కింద దాక్కుంటాడు…
Published at : 16 Nov 2024 08:34 AM (IST)
టీవీ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి