గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఫ్యాన్స్, ఆడియన్స్‌లో ఉన్న సందేహాలకు చెక్ పెడుతూ… కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా ఈ రోజు ఎన్‌బికే 109 (NBK 109) టైటిల్, టీజర్ విడుదల చేశారు. టైటిల్ ఎలా ఉంది? టీజర్ విజువల్స్ ఎలా ఉన్నాయి? అనేది చూడండి.
‘డాకు మహారాజ్’గా బాలకృష్ణ…
గుర్రం మీద వచ్చిన నట సింహం
NBK 109 Titled Daaku Maharaj, Watch Teaser: బాలకృష్ణ 109వ సినిమాకు ‘డాకు మహారాజ్’ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌కు తగ్గట్టు విజువల్స్‌లో డాకు ఉండేలా చూసుకున్నారు. బహుశా… ఆ విజువల్స్ యాక్షన్ సీక్వెన్సులోవి కావచ్చు. అలాగే, గుర్రం మీద వచ్చిన బాలకృష్ణ విజువల్స్ సైతం అభిమానులను అలరించేలా ఉన్నాయి. ఇందులో బాలకృష్ణ లుక్ కూడా కొత్తగా ఉంది. పొడవాటి జుట్టు, ఆ మీస కట్టు కొత్తగా ఉన్నాయి.
Witness the 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 like never before!! 🔥🔥🔥
Presenting the one and only #NandamuriBalakrishna Garu as #DaakuMaharaaj 🪓💥💥
Here’s the much-awaited title teaser 💥
Brace yourselves for the ultimate power-packed experience on Jan… pic.twitter.com/wyhTI3of62
— Sithara Entertainments (@SitharaEnts) November 15, 2024
జనవరి 12న ‘డాకు మహారాజ్’ రిలీజ్
Daaku Maharaj Release Date: సంక్రాంతి సందర్భంగా సినిమాను థియేటర్లలోకి తీసుకు రానున్నట్లు గతంలో నాగ వంశీ తెలిపారు. ‘డాకు మహారాజ్’ టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు రిలీజ్ కూడా కూడా చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
Also Read: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్… టార్గెట్ రీచ్ అయ్యిందా? సూర్యకు పాన్ ఇండియా సక్సెస్ వచ్చిందా?
‘డాకు మహారాజ్’కు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. ‘వీర సింహా రెడ్డి’తో బాలకృష్ణ, ‘వాల్తేరు వీరయ్య’తో బాబీ… గత ఏడాది సంక్రాంతికి వచ్చి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో ‘డాకు మహారాజ్’ సినిమా తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Also Read: వరుణ్ తేజ్‌కు మరో షాక్… ‘మట్కా’ ఫస్ట్ డే కలెక్షన్స్ అంతేనా?
Daaku Maharaj Cast And Crew: ‘డాకు మహారాజ్’లో ‘జెర్సీ’, ‘సైంధవ్’ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ఇందులో ప్రగ్యా జైస్వాల్ మరొక హీరోయిన్. తెలుగు అమ్మాయి, యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి కీలక పాత్ర చేస్తున్నారు. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఊర్వశి రౌతేలా మరో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. ‘యానిమల్’, ‘కంగువ’ సినిమాల ఫేమ్ – ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వరిస్తున్నారు.
మరిన్ని చూడండి