రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ కి ఇంకా పట్టుమని 13 రోజులు కూడా లేదు. అయినప్పటికీ మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచలేదు. దీంతో అభిమానులు ఈ మూవీ అప్డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ రామ్ చరణ్ అభిమాని సోషల్ మీడియా వేదికగా ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ను రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాను అంటూ ‘గేమ్ ఛేంజర్’ టీంకు సూసైడ్ లెటర్ రాశారు.
అప్డేట్ కోసం ఎదురు చూపులు
రామ్ చరణ్ సోలో హీరోగా తెరపైకి వచ్చి దాదాపు ఐదేళ్లు అయిపోతుంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాల్లో కనిపించినప్పటికీ, అవి రెండూ మల్టీస్టారర్ సినిమాలు. దీంతో సోలో హీరోగా రామ్ చరణ్ నుంచి వచ్చే మూవీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథని అందించగా, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. టీజర్ విడుదలతో సినిమాపై ఒక్కసారిగా హైప్ గ్రాఫ్ పెరిగింది. దీంతో ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
నిజానికి యూఎస్ఏలో జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ అక్కడ ట్రైలర్ రాకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు అభిమానులు. ఇక ఈ క్రమంలోనే డిసెంబర్ 30న ట్రైలర్ రిలీజ్ కాబోతోందని, కొత్త ఏడాది సందర్భంగా రాబోతున్న ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతుందని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ అండ్ టీం దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉందని… ట్రైలర్ ఫైనల్ కట్, మ్యూజిక్ మిక్సింగ్లో తలమునకలై ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ ని మూవీ రిలీజ్ కు ఐదు రోజుల ముందు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారని అంటున్నారు. దీంతో అయోమయంలో పడ్డారు అభిమానులు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: చిన్నప్పుడే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా… ఇండస్ట్రీపై మరోసారి ‘రేసుగుర్రం’ విలన్ షాకింగ్ కామెంట్స్
బ్రతికుంటే అందరితో చూస్తా…
చస్తే ఆత్మ లా చూస్తా…ఇదంతా నీ చేతుల్లోనే ఉంది @GameChangerOffl 😭🙏
జై చరణ్ జై చరణ్ #RamCharan #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/ePfifI2g8g
— EshwaRC15 Raj(Dhfc) 🚁🚁 (@EshwarDhfc) December 27, 2024
ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్
తాజాగా రామ్ చరణ్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే చచ్చిపోతాను అంటూ రాశారు. “సినిమా రిలీజ్ కు ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అభిమానుల ఎమోషన్స్ ను మేకర్స్ పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరి కల్లా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ ను రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను. చరణ్ అన్న భక్తుడు” అంటూ అతను ‘గేమ్ ఛేంజర్’ మూవీ యూనిట్ కు డెడ్ లైన్ విధించిన లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: లైంగిక వేధింపులకు పాల్పడిన టీవీ నటుడు – అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసిన కేసులో అరెస్ట్
మరిన్ని చూడండి