Homeవినోదం‘జగధాత్రి’ సీరియల్‌:   వైజయంతి మీద ధాత్రికి అనుమానం – ఎలాగైనా హీరోయిన్‌ను కలవాలన్న కేదార్‌

‘జగధాత్రి’ సీరియల్‌:   వైజయంతి మీద ధాత్రికి అనుమానం – ఎలాగైనా హీరోయిన్‌ను కలవాలన్న కేదార్‌


Jagadhatri  Serial Today Episode:     కేదార్‌, ధాత్రిలతో కావాలని సపర్యలు చేయించుకోవాలని నాటకం ఆడుతుంది వైజయంతి. పిన్ని కాళ్లకు ఆయిల్‌ నేను రాస్తాను నువ్వు వెళ్లి వంట చేయ్‌ అని చెప్పగానే ధాత్రి వెళ్తుంది. కేదార్‌ ఆయిల్‌ తీసుకొచ్చి వైజయంతికి మర్దన చేస్తుంటాడు. ఇంతలో సుధాకర్‌ వచ్చి డోర్‌ దగ్గర నిలబడి కేదార్‌ను చూస్తుంటే వాళ్ల అమ్మే గుర్తుకు వస్తుంది అనుకుంటాడు. వైజయంతికి కొడుకులా సేవ చేస్తున్నాడు అనుకుంటాడు. ఒక నాన్నగా నేను నిన్ను పట్టించుకోకపోయినా మీ అమ్మ నిన్ను చాలా బాగా పెంచింది కేదార్‌ అనుకుంటూ వెళ్లిపోతాడు సుధాకర్‌. ఇంతలో యువరాజ్‌, నిషిక వస్తారు. కేదార్‌ను చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతారు. తర్వాత కేదార్‌, ధాత్రి వెళ్లి భోజనం చేస్తుంటే.. కాచి, బూచి, యువరాజ్‌, నిషిక వస్తారు.

నిషిక: ఏంటి జగధాత్రి నువ్వు చేస్తున్న పని..

ధాత్రి: నేనేం చేశాను నిషి

నిషిక: అత్తయ్యను హాస్పిటల్‌లో చేర్పిద్దామని అనుకుంటే నువ్వే కదా దగ్గరుండి చూసుకుంటాను అన్నాను.

ధాత్రి: అయ్యో నేను చూసుకుంటూనే ఉన్నాను కదా..?

కాచి: పక్షవాతం వచ్చిన పెద్దమ్మను అలా ఒంటరిగా వదిలేసి ఇద్దరూ వచ్చి బోజనం చేస్తున్నారు. అక్కడ పెద్దమ్మకు అవసరం వస్తే ఎవరు చూస్తారు.

కేదార్‌: అలా ఏం ఉండదు కాచి. ఇప్పటి వరకు మేము అక్కడే ఉన్నాము.  

ధాత్రి: అవును నిషి అత్తయ్యగారికి ఓట్స్‌ తినిపించి.. టాబ్లెట్స్‌ ఇచ్చి వచ్చాము.

నిషిక: అయినా సరే అలా అత్తయ్యను వదిలేసి రాకూడదు. తినాలి అనుకుంటే అత్తయ్య దగ్గరకే వెళ్లి తినండి.

ధాత్రి: అవును నిజమే.. ఇప్పుడే అక్కడకు వెళ్లి తింటాను

అంటూ ధాత్రి లేచి వెళ్లబోతుంటే.. కౌషికి వచ్చి ఆపుతుంది. పిన్నిని చూసుకోవాల్సిన అవసరం ధాత్రికి లేదు. నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా నువ్వు చూసుకోవచ్చు కదా..? అంటుంది. లోపల మామూలుగా కూర్చున్న వైజయంతి ఈ నాటకం ఎన్ని రోజులు ఆడాలో ఏంటో అని బాధపడుతుంది. ఇంతలో కౌషికి రావడం చూసి మళ్లీ నాటకం మొదలుపెడుతుంది. ఇంతలో ధాత్రి వస్తుంది. తను అక్కడే పడుకుంటుంది. కేదార్‌, కౌషికి వెళ్లిపోతారు.  ధాత్రి పుల్లుగా నిద్రపోయాక కావాలనే నీళ్ల చెంబు కిందకు తోసేస్తుంది వైజయంతి. నిద్ర లేచిన ధాత్రి మొత్తం క్లీన్‌ చేసుకుని పడుకుంటుంది. మూడు గంటల తర్వాత మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట చేస్తుంది వైజయంతి. నాకు సేవలు చేయలేక చావాలి నువ్వు అనుకుంటుంది వైజయంతి. ఈసారి ధాత్ఇరి కింద పడుకుంటుంది.

నిషి: ఇలాగే వారం రోజులు కంటిన్యూ చేస్తే.. ధాత్రి స్కూల్‌కు పోలేక.. ఇక్కడ సేవలు చేయలేక చచ్చిపోతుంది.

యువరాజ్: అమ్మకు కూడా కష్టమే కదా నిషిక. మూతి ఒంకరగా పెట్టుకోవాలి. కాలు, చెయ్యి వంకరగా పెట్టుకోవాలి. దరిద్రం ఏంటంటే రాత్రి పూట పడుకున్నప్పుడు కూడా అలాగే పెట్టుకోవాలి

అని యువరాజ్‌ చెప్తాడు. ఇంతలో తెల్లారిపోతుంది. రూమ్‌లో వైజయంతి సగం తిని పడేసిన యాపిల్ చూసి అనుమానిస్తుంది. తర్వాత వైజయంతిని నిద్రలేపి అన్ని సేవలు చేస్తుంది. కేదార్‌ వచ్చి ధాత్రిని పక్కకు తీసుకెళ్లి హీరోయిన్‌ గురించి చెప్తాడు. ఈరోజు ఎలాగైనా ఆ హీరోయిన్‌ ను ఇవాళ కలవాలి అనుకుంటారు. ఇంతలో సుధాకర్‌, కౌషికి రావడంతో అందరూ కలిసి వైజయంతి దగ్గరకు వెళ్తారు. లోపల గ్లాస్ లో పాలు సగం ఉంటాయి. దీంతో వైజయంతికి పక్షవాతం నిజంగా వచ్చిందా..? లేదా యాక్టింగ్‌ చేస్తుందా..? అని ధాత్రి అనుమానిస్తుంది. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments