Homeవినోదంచిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్నుకి తనకి సంబంధం ఏంటన్న మిత్ర.. మనీషా కంట పడిన...

చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్నుకి తనకి సంబంధం ఏంటన్న మిత్ర.. మనీషా కంట పడిన లక్ష్మీ


chiranjeevi lakshmi sowbhagyavathi serial today episode: దేవయాని అన్న మాటలు పట్టించుకోవద్దని అరవింద జానుకి చెప్తుంది. దానికి జాను ఏడూస్తూ ఆమెకి అనడానికి కారణం ఉంది నేను పడాలి అంటుంది. అక్క లేదు అన్న బాధలోనే సగం చచ్చిపోయాను అని ఆత్మాభిమానం చంపుకొని బతకాలా అని ఏడుస్తుంది. దానికి అరవింద లక్ష్మీ చనిపోయిందని బాధ కూడా వద్దు అని లక్ష్మీ బతికే ఉందని అంటుంది. దానికి జాను షాక్ అయిపోతుంది.

జాను: ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు. అక్క బతికే ఉండటం ఏంటి.
అరవింద: ప్రపంచం దృష్టిలో చనిపోయిన లక్ష్మీ దీక్షితులు గారి దృష్టిలో బతికే ఉంది. అన్ని విషయాల్లో ఆయన్ను ఈ విషయంలో కూడా నమ్ముతున్నాను. 
జాను: మీరు చెప్పేది నిజం అయితే ఈ ప్రపంచంలో అందరి కంటే సంతోషంగా ఉండేది నేను. ఎందుకు కంటే అక్క లేదు అన్న మాట నన్ను రోజు రోజుకు కలచివేస్తుంది. అక్క బతికుందనే మాట నాకు మళ్లీ ఊపిరి పోస్తుంది. 
అరవింద: నీకే కాదు జాను మాకు అలాగే ఉంది. దీక్షితుల గారి మాట మీద నాకు నమ్మకం ఉంది. 
జాను: మీరు అలా అంటుంటే నాకు ఓ విషయం గుర్తొస్తుంది అత్తయ్యగారు. అర్జున్‌గారి బిజినెస్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు నాకు అక్కడ అక్క కనిపించినట్లు అయ్యింది. నేను వెళ్లి చూసే సరికి మిస్ అయ్యింది. అది నిజమే అయింటుందని నా నమ్మకం.
అరవింద: మిత్రను ప్రతి గండం నుంచి కాపాడేది లక్ష్మీనే. మొన్న కూడా కాపాడిన ఆ అమ్మాయి లక్ష్మీనే అని నాకు అనిపిస్తుంది.
జాను: మీరు ఇవన్నీ చెప్తుంటే అక్క తిరిగి వచ్చినంత సంతోషం కలుగుతుంది అత్తయ్య గారు. దేవుడి దయవల్ల దీక్షితుల గారి చలవవల్ల అక్క బతిగే ఉండాలి.

లక్ష్మీ, అర్జున్, జున్నులు స్కూల్‌కి వస్తారు. ఇంతలో ఇద్దరు వచ్చి అర్జున్‌ని జున్ను ఫాదర్‌ అని అనుకొని విష్ చేస్తారు. లక్ష్మీ తాను జున్నుకి తండ్రి కాదు అని చెప్తుంది. ఇంతలో లక్కీ వచ్చి విష్ చేసి తన ఫ్యామిలీకి పరిచయం చేస్తాను అంటుంది. లక్ష్మీ రాను అంటున్నా లక్కీ బలవంతంగా తీసుకెళ్తుంది. ఇక లక్ష్మీ అరవింద, జానులను చూసి దాక్కుంటుంది. ఇక అక్కడే మాట్లాడుకుంటున్న మనీషా లక్ష్మీని చూస్తుంది. దేవయానికి చూపిస్తుంది. దేవయానికి లక్ష్మీ కనిపించదు. ఓ వైపు లక్కీ మరోవైపు దేవయాని, మనీషాలు లక్ష్మీని వెతుకుతారు. లక్ష్మీ వాళ్లు చూడకుండా తప్పించుకుంటుంది. లక్కీ జున్ను దగ్గరకు వచ్చి లక్ష్మీ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్తుంది. 

అర్జున్‌: జనాలను చూస్తే చాలు లక్ష్మీ ఇబ్బంది పడిపోతుంది. ఇక్కడ కూడా తనకు సంబంధించిన ఎవరినైనా చూసిందా. ఎందుకు కంగారు పడుతుంది. ఇక జున్ను మిత్ర దగ్గరకు వెళ్లి హ్యాపీ ఫాదర్స్ డే అకుంల్ అని  చెప్తాడు. మిత్ర థ్యాంక్యూ చెప్తాడు. ఇక అందరూ ఫంక్షన్‌ దగ్గర కూర్చొంటే జాను యాంకరింగ్ చేస్తుంది. ఫాదర్స్ శుభాకాంక్షలు చెప్తుంది. ఇక పిల్లలకు వాళ్ల తండ్రులకు గేమ్స్ ఆడిస్తున్నామని చెప్తుంది. ఒక్కో తండ్రి ఒక్కో చీటి తీసుకొని అందులో ఉండే హింట్ ఆధారంగా ట్రెజర్‌ కనుక్కోవాలి అని చెప్తారు. ఇక మిత్ర లక్కీతో ట్రెజర్ అంటే ఏదైనా స్పెషల్‌ ప్లేస్‌లో పెడతారు అని ఏదైనా స్పెషల్ ప్లేస్ ఉంటే అక్కడికి తీసుకొని వెళ్లమని లక్కీతో మిత్ర చెప్తాడు. ఇక సేమ్ అవే డైలాగులతో జున్ను అర్జున్‌ని అక్కడికి తీసుకొస్తాడు. ఆ మాటలు విన్న మిత్ర లక్కీతో జున్ను కన్నింగ్‌ అని తన మాటలు వినేసి అక్కడికి వచ్చాడని చెప్తాడు. ఇద్దరూ తన చీటీలను చదివి జున్ను మిత్రలు ఒకే సారి రాముడి పాదాల దగ్గర ఉన్న గిఫ్ట్ పట్టుకుంటారు.

మిత్ర: వీడి బుర్ర కూడా నాలాగే ఆలోచిస్తుంది ఎందుకు. నాకు ఐడియా వచ్చినప్పుడే వీడికి ఎందుకు వస్తుంది. 
జున్ను: ముందు మీరే ముట్టుకున్నారు కదా మీరే తీసుకోండి.
మిత్ర: నువ్వు దీనికోసమే పరుగెత్తావు కదా నువ్వే తీసుకో.
అర్జున్: మాకు ఇవ్వడమే తెలుసు ఒకరు వదిలేసింది తీసుకోవడం తెలీదు. 
మిత్ర: అలా అయితే ఇవ్వడానికి వదిలేయడానికి నేను ముందు ఉంటాను. ఒకరు వదిలేసింది దానం చేసింది తీసుకోవడం నాకు ఇష్టం లేదు. 
జున్ను: అయ్యో మీరు ఏంటి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు. ఇది వదిలేయడం కాదు దానం కాదు. అంకుల్ ఫస్ట్ ముట్టుకున్నారు అని నేను వదిలేశాను. 

ఇక జున్న రెండో సీతమ్మ పాదాల దగ్గర బాణం గుర్తుల ఆధారంగా రెండో ట్రెజర్‌ పట్టుకుంటాడు. ఇద్దరూ జాను దగ్గరకు తీసుకొని వెళ్లి ఇస్తారు. మనీషా మాత్రం లక్ష్మీని వెతుకుతుంది. ఇక లక్ష్మీని మనీషా చూసేస్తుంది. లక్ష్మీ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకు అడ్డంగా దొరికిపోయిన కార్తీక్‌, దీపలు – కార్తీక్ చేసిన పనికి ఫైర్‌ బ్రాండ్‌గా మరదలు పిల్ల!  

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments