Homeవినోదంచిరంజీవి, బన్నీని ఒకే వేదికపైకి తీసుకొస్తున్న బాలకృష్ణ - మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్...

చిరంజీవి, బన్నీని ఒకే వేదికపైకి తీసుకొస్తున్న బాలకృష్ణ – మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్ స్టాప్?


మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య సత్సంబంధాలు లేవని జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్క వేదిక మీదకు రావడం అనేది ఆసక్తి కలిగించే అంశమే కదా! వాళ్లిద్దరూ ఒకే చోట సందడి చేసే అవకాశం కుదరడానికి కారణం గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ.

బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలు… బన్నీకి ఆహ్వానం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ ప్రవేశించి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న టాలీవుడ్ ఇండస్ట్రీ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేసింది. హైదరాబాద్ సిటీలోని హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో తెలుగు చిత్రసీమ ఆధ్వర్యంలో గ్రాండ్  సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా బన్నీని కలిసి ఆహ్వానం అందించారు.

బాలకృష్ణ, బన్నీ మధ్య మంచి అనుబంధం ఉంది. అందువల్ల, తాను తప్పకుండా ఈ కార్యక్రమానికి వస్తానని ఐకాన్ స్టార్ చెప్పారట. దాంతో మేనమామ చిరంజీవితో కలిసి ఒకే వేదిక మీద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

బాలకృష్ణ కోసం వేడుకకు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి!
సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కనుక ఇండస్ట్రీలో ఆయన తరం హీరోలతో పాటు సీనియర్లు, జూనియర్లను సైతం ఆహ్వానిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవిని ఆల్రెడీ కలిశారు. ఆయనకు ఆహ్వానం అందించారు. ఈ వేడుకకు తాను తప్పకుండా వస్తానని చిరు సైతం హామీ ఇచ్చారట.
Allu Arjun Chiranjeevi: చిరంజీవి, బన్నీని ఒకే వేదిక మీదకు తీసుకొస్తున్న బాలకృష్ణ - మెగా వర్సెస్ అల్లు గొడవకు ఫుల్ స్టాప్?

మెగా ఫ్యామిలీ గొడవలకు బాలకృష్ణ వేడుకకు ఫుల్ స్టాప్ పడుతుందా?
నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లి ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం చేయడం కొందరికి నచ్చలేదు. వైసీపీకి వ్యతిరేకంగా జనసేన పోరాటం చేస్తుంటే… స్నేహితుడి కోసం అంటూ బన్నీ వెళ్లడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. సోషల్ మీడియా వేదికగా అతడి మీద విమర్శలు చేశారు. 

‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ వేడుకలో ‘తనకు ఇష్టమైతే, నచ్చితే వస్తా’ అంటూ బన్నీ కామెంట్ చేయడం ఆ విమర్శలకు ఇన్ డైరెక్ట్ కౌంటర్ అని పలువురు భావించారు. ఆ తర్వాత ‘నువ్వు పుడింగివా’ అంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి కామెంట్ చేయడం, బన్నీతో తమ పార్టీకి శత్రుత్వం లేదని చెప్పడం తెలిసిన విషయాలే.

Also Readసరిపోదా శనివారం రివ్యూ: నాని మాస్ హీరోయిజం వర్సెస్ ఎస్.జె. సూర్య విలనిజం – సినిమా ఎలా ఉందంటే?


మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ మధ్య సోషల్ మీడియాలో ఉప్పు నిప్పు అన్నట్టు ఉంది పరిస్థితి. కొణిదెల, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరిగిందని ఫిల్మ్ ఇండస్ట్రీలో జనాలు సైతం ఆఫ్ ది రికార్డ్ కామెంట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం అంతా కలిస్తే సెట్ అవుతుందని, అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుందని బన్నీ వాస్ సైతం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం… చిరంజీవి, బన్నీ ఒక్క వేదికకు వచ్చే అవకాశాలు ఉండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిలో ఆసక్తి నెలకొంది. ఏపీ ఎన్నికల తర్వాత చిరు, బన్నీ పబ్లిక్ స్టేజి మీద ఒక్కటిగా కనిపించలేదు. మరి, ఈ వేడుకలో కనిపిస్తారా? వెయిట్ అండ్ సి.

Also Readఅన్నయ్యా… అన్నయ్యా… అన్నయ్యా… నీది మాములు విలనిజం కాదన్నయ్యా… ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments