నువ్వు సత్యకి సపోర్ట్ చేస్తున్నట్టే నాటకం ఆడుతూ మీ బాపు వైపు నిలబడ్డావ్ కదా అంటుంది జయమ్మ.. క్రిష్ మనసులోనే బాధపడతాడు. నువ్వు గాలి తిరుగుడు తిరుగుతుంటే ఏమవుతావో అనుకున్నా కానీ ఒక్క ఐడియాతో మొత్తం మార్చేశావ్ అంటూ సంజయ్ ని మెచ్చుకుంటాడు మహదేవయ్య.
పది మంది సపోర్ట్ ఉందో లేదో లెక్క చూసుకుని రావాలి కదా ఇక్కడివరకూ వచ్చి నా కాళ్లకు అడ్డం పడడం ఎందుకు అని ఫైర్ అవుతారు ఆఫీసర్. ముందు తొమ్మిది మందిలో నామినేషన్ వేయి అంటుంది జయమ్మ.
నేను ఒంటరిదాన్ని కాదని ఈ లోకానికి తెలియాలి ఈ తొమ్మిది మంది సంతకాలతోనే నామినేషన్ వేస్తాను పదండి అంటుంది సత్య. పదో వ్యక్తి లేకపోతే రిజెక్ట్ చేస్తానంటాడు అధికారి.
తొమ్మిది మందితో నామినేషన్ వేస్తుంది సత్య.. ఓ నిముషం టైమ్ ఉంది.. పదో మనిషి లేకపోతే రిజెక్ట్ చేస్తానంటాడు అధికారి. ఉన్నాడు అంటూ రుద్ర ఎంట్రీ ఇస్తాడు. మహదేవయ్య వారిస్తున్నా వినకుండా సత్య నామినేషన్ పై సంతకం చేస్తాడు. సత్య , నందిని సహా కుటుంబం అంతా థ్యాంక్స్ చెబుతారు. జయమ్మ స్వీట్ తినిపిస్తుంది.
బయట క్రిష్ కూల్ గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని రిలాక్స్ గా కూచుని జరిగింది తలుచుకుంటాడు. క్రిష్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఓ వీడియో పంపుతా అంటూ ప్లాన్ చెబుతాడు. ఆ వీడియో రుద్రకి పంపిన క్రిష్ ఫ్రెండ్ ..సత్య నామినేషన్ పై సంతకం చేయకపోతే ఈ వీడియో లీక్ చేసి మళ్లీ జైలుకి పంపిస్తా అని బెదిస్తాడు.
ఆ వీడియోలో రుద్ర ..రేణుకని రూమ్ లో బెదిరించిన వీడియో ఉంటుంది. వణికిపోయిన రుద్ర వెళ్లి సత్య నామినేషన్ పై సంతకం చేస్తాడు. ఇది తలుచుకుని క్రిష్ నవ్వుకుంటాడు
సత్య నామినేషన్ వేస్తుంది..సంబరంగా ఫొటోలు తీస్తాడు హర్ష. అందరి నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటుంది. నిన్ను నీ భర్తే చూసుకుంటాడు అనుకుంటుంది జయమ్మ.
సెలబ్రేషన్స్ చేసుకుందాం పదండి అంటూ సందడి చేస్తుంది నందిని.. నామినేషన్ వేసి బయటకు హుందాగా వస్తుంది సత్య.. క్రిష్ మురిసిపోతాడు. మహదేవయ్య అండ్ కో కుళ్లుకుంటారు
గుణంలో కాకపోయినా వయసులో పెద్దవారు దీవించండి మావయ్య అంటూ కాళ్లకు నమస్కారం పెడుతుంది ..మహదేవయ్య రగిలిపోతుంటాడు. నామినేషన్ వేయకుండా అడ్డుపడేందుకు చాలా ట్రై చేశారు దేవుడు నావైపే ఉన్నాడు అంటుంది సత్య.
నీ సెంటిమెంట్స్ తో ఇరుక్కుపోయి సంతకం చేశావ్ అని భైరవి పై ఫైర్ అవుతాడు. రుద్రాణి లాగిపెట్టి కొడతాడు మహదేవయ్య. నేనంటే వల్లో చిక్కినా నువ్వెందుకు సంతకం చేశావ్ అని అడుగుతుంది భైరవి. అప్పుడే అక్కడకు వచ్చిన క్రిష్ ఇక్కడ ఉండకూడదు అనుకుంటూ వెళ్లిపోతాడు
సత్యభామ జనవరి 20 ఎపిసోడ్ లో … బావగారు నా నామినేషన్ ఫామ్ పై ఎందుకు సంతకం చేశారు..వెనుక ఏదో అదృశ్య శక్తి ఉండే ఉంటుంది అంటుంది సత్య.. నీ పనైంది కదా అని క్రిష్ అంటే..చెప్పొచ్చుకదా అంటుంది.. అంతే పడిపోయాడు కృష్ణుడు..
Published at : 18 Jan 2025 09:21 AM (IST)
టీవీ ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి