విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వీజే ఖన్నా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. టి. గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది అనన్య నాగళ్ల. తన సినీ కెరీర్ తో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా వెల్లడిస్తోంది. అందులో భాగంగా గత కొంత కాలంగా ఇన్‌స్టా గ్రామ్ లో గ్లామరస్ ఫొటోలు షేర్ చేయడానికి గల కారణాలను వివరించింది.
‘అన్వేషి’ మూవీ ప్రమోషన్స్ లో అనన్య నాగళ్ల
‘మల్లేశం’తో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది అచ్చ తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల. తొలి సినిమాలో పల్లెటూరి అమ్మాయిలా చక్కటి నటన కనబర్చింది. అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేసింది. పాత్ర ఏదైనా తన మార్కు నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె నటించిన ‘అన్వేషి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించింది.
గ్లామరస్ ఫోటోలు ఎందుకు షేర్ చేస్తున్నానంటే?- అనన్య
‘వకీల్ సాబ్’ సినిమాకు ముందు వరకు సోషల్ మీడియాలో ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేసిన తాను, ఆ తర్వాత ఎందుకు గ్లామరస్ ఫోటోలు షేర్ చేయాల్సి వచ్చిందో అన్యన్య వివరించింది. “ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘వకీల్‌సాబ్’ సినిమాలో నేను కూడా ఓ కీలక పాత్ర పోషించాను. ఈ సినిమాకు ముందు వరకు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ ఫొటోలు పంచుకునేదాన్ని. ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సమయంలో కొన్ని గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నా. ఆ ఫోటోలను క్యాజువల్ గానే సోషల్ మీడియాలో షేర్ చేశాను. వాటికి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు సినిమా రంగంలో దూసుకెళ్లాలంటే అన్ని రకాలుగా కనిపించాలి అనుకున్నాను. అప్పటి నుంచి గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నా. కొన్ని కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు వచ్చినా పెద్దగా కలిసి రాలేదు” అని వెల్లడించింది.
‘అన్వేషి’ సినిమాను వీజే ఖన్నా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: అందుకే రాహుల్ సిప్లిగంజ్‌తో పెళ్లి చేయలేదు – రతిక చెల్లి షాకింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial