Gautam Ghattamaneni Graduation Day: సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్ర.. ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీ లైఫ్ గురించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటారు. ముఖ్యంగా తమ పిల్లలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన తల్లిదండ్రులుగా ఫాలోవర్స్‌తో షేర్ చేసుకొని చాలా గర్వంగా ఫీలవుతుంటారు. తాజాగా తమ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ గ్రాడ్యుయేషన్ డేకు వెళ్లడంతో పాటు ఇద్దరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని హ్యాపీగా షేర్ చేసుకున్నారు. దాంతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్ చేశారు.
చాలా గర్వపడుతున్నాను..
‘నా మనసు గర్వంతో నిండిపోయింది. నీ గ్రాడ్యుయేషన్‌కు కంగ్రాచులేషన్స్. నీ జీవితంలో తరువాతి పాఠం నువ్వే రాసుకోవాలి. నువ్వు ఎప్పటిలాగానే రాణిస్తావని నమ్ముతున్నాను. నీ కలలను ఎప్పుడు వదులుకోకు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామని మర్చిపోకు. ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను’ అంటూ తన సంతోషాన్ని ఫాలోవర్స్‌తో పంచుకున్నాడు మహేశ్ బాబు. అంతే కాకుండా తన కొడుకుతో దిగిన ఫోటోను, గౌతమ్ గ్రాడ్యూయేషన్ వీడియోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో మహేశ్ ఫ్యాన్స్ సైతం గౌతమ్‌కు కంగ్రాట్స్ చెప్తున్నారు. మహేశ్ బాబు మాత్రమే కాకుండా నమ్రత కూడా ఈ విషయంపై స్పెషల్ పోస్ట్ చేశారు.
నిన్ను నువ్వు నమ్ము..
‘‘మై డియర్ జీజీ. నువ్వు నీ జీవితంలోనే కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు కాబట్టి ఈరోజు నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను. నీకు నువ్వు ఎప్పుడూ నిజాయితీగా ఉండు. నీ ప్యాషన్స్‌ను ఫాలో అవ్వు. నీ కలలను ఎప్పుడూ దూరం చేసుకోకు. మేము నిన్ను నమ్మినంతంగా నిన్ను నువ్వు నమ్ము. నీ జీవితం నిన్ను ఎక్కడికి తీసుకెళ్లినా నా ప్రేమ, సపోర్ట్ ఎప్పటికీ నీకు ఉంటాయి. ఈ ప్రపంచం ఇంక నీదే. ఐ లవ్ యూ సో మచ్’ అంటూ తన కొడుకును చూసి గర్వపడుతూ, తనపై ప్రేమను కూడా బయటపెట్టారు నమత్ర. తన పిల్లలకు సంబంధించిన ఏ విషయం అయినా ప్రేక్షకులతో పంచుకోవడానికి నమ్రత ముందుంటారు. అలా గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ వేడుక గురించి మహేశ్, నమ్రత పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యూయేషన్ వేడుకకు మహేశ్, నమత్రతో పాటు సితార కూడా హాజరయ్యింది.
Also Read: అలాంటి వాళ్లను వెంటనే బ్లాక్ చేస్తాను, నా ఫేవరెట్ హీరోయిన్స్ వాళ్లే – సితార ఘట్టమనేని
మరిన్ని చూడండి