Homeవినోదంగౌతమ్‌ను టార్గెట్ చేసిన శోభా, అశ్విని - ఆ విషయం నచ్చలేదంటూ!

గౌతమ్‌ను టార్గెట్ చేసిన శోభా, అశ్విని – ఆ విషయం నచ్చలేదంటూ!


ఎప్పటిలాగానే సండే ఫన్‌డే అంటూ ప్రేక్షకులను బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత ఎంటర్‌టైన్ చేయించడానికి వచ్చేశారు నాగార్జున. ‘ఆట కావాలా, పాట కావాలా’ అంటూ స్టెప్పులేస్తూ స్టేజ్ మీదకు వచ్చిన నాగ్.. వచ్చిన వెంటనే కంటెస్టెంట్స్‌తో సరదా కబుర్లు మొదలుపెట్టారు. శనివారం ప్రసారం అయిన ఎపిసోడ్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులను గుర్తుచేసి, వారి ఆటను మెరుగుపరచుకోవడం కోసం సలహాలు ఇచ్చిన నాగార్జున.. ఆదివారం ఎపిసోడ్‌లో మాత్రం అందరితో సరదాగా ఉన్నట్టు తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

ఫ్రెండ్ ఎవరో చెప్పాలి..
కంటెస్టెంట్స్‌తో మాట్లాడడానికి సిద్ధమయిన నాగార్జున.. ముందుగా ‘‘శోభా నువ్వు మైక్ వేసుకోవాలమ్మా. మేకప్ వేసుకున్నావు. మైక్ మరచిపోయావు’’ అంటూ శోభాపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా నవ్వుకున్నారు. ఇలా సరదాగా స్టార్ట్ అయిన ప్రోమో మెల్లగా సీరియస్‌గా మారింది. ‘‘మామూలుగా అయితే సండే ఫన్‌డే అనేవాడిని కానీ ఫైనల్‌ దగ్గరకు వస్తోంది కదా. ఇప్పుడు మనం ఆడబోయే టాస్క్.. యాడ్ ఏ ఫ్రెండ్, బ్లాక్ ఏ హౌజ్‌మేట్’’ అని తను పెట్టబోయే టాస్క్ గురించి వివరించారు. అయితే కంటెస్టెంట్స్ అంతా ఒకరు తర్వాత ఒకరు వచ్చి తాము ఫ్రెండ్ చేసుకోవాలనుకుంటున్న కంటెస్టెంట్‌ను పిలిచి వారికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ వేయాల్సి ఉంటుంది. ఇక బ్లాక్ అనుకుంటున్న కంటెస్టెంట్స్ మొహంపై స్టాంప్ వేయాల్సి ఉంటుంది.

ఆ ఇద్దరికీ ప్రశాంతే ఫ్రెండ్..
ముందుగా గౌతమ్.. ఈ టాస్క్ ఆడడానికి ముందుకొచ్చాడు. ‘‘ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఉంది. ఎవరిని యాడ్ చేసుకుంటావు? ఎవరిని బ్లాక్ చేసుకుంటావు?’’ అని నాగార్జున అడగగా.. ప్రశాంత్‌ను ఫ్రెండ్ అన్నాడు గౌతమ్. ‘‘రా పెద్దపంతులు’’ అని పిలిచాడు. అలా అనగానే నాగార్జున ఆశ్చర్యపోయాడు. అంటే కాస్ట్యూమ్ అలా ఉందని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు. తనను ఎందుకు ఫ్రెండ్ అన్నాడో చెప్పమని నాగార్జన ప్రశ్నించారు. ‘‘కొంచెం పగలు అవి పెట్టుకుంటుండే. కానీ గత రెండు వారాల నుండి నార్మల్ అయిపోయింది. నామినేషన్స్ అప్పుడు కూడా నార్మల్ అయ్యాడు’’ అని క్లారిటీ ఇచ్చాడు గౌతమ్. ఇప్పటినుండి నాకు తను కూడా ఒక ఫ్రెండ్ అంటూ అమర్‌దీప్ కూడా ప్రశాంత్‌కే ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఇచ్చాడు.

గౌతమ్‌ను టార్గెట్..
ఆ తర్వాత వచ్చిన శోభా.. గౌతమ్‌ను బ్లాక్ చేస్తున్నానని చెప్తూ తన మొహంపై స్టాంప్ వేసింది. ‘‘ప్రియాంక కెప్టెన్ అవ్వడం నీకు ఇష్టం లేదా చెప్పు. ఇష్టం లేదని నీ నోటితో చెప్తూ నేను కొట్టడం ఆపేస్తాను అని చెప్పాడు సార్’’ అంటూ తన కారణాన్ని నాగార్జునతో వివరించింది శోభా. ‘‘నువ్వు టార్గెట్ చేసి కొట్టడం నాకు నచ్చలేదు’’ అని కోపంగా గౌతమ్‌తో చెప్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. శోభా తర్వాత వచ్చిన అశ్విని కూడా గౌతమ్‌నే బ్లాక్ చేస్తున్నానని చెప్పింది. ‘‘అమర్ అంత బాధపడుతుంటే కూడా టార్గెట్ చేసి కొట్టడం అనేది నాకు పర్సనల్‌గా నచ్చలేదు’’ అని తన కారణాన్ని బయటపెట్టింది. శివాజీ.. అనూహ్యంగా ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌ను అర్జున్‌కు ఇచ్చాడు. ‘‘వచ్చినప్పటి నుండి అర్జున్ ఫెయిర్‌గా అనిపించాడు’’ అని కారణాన్ని చెప్పాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్.. ‘‘తెలిసో తెలియకో తప్పు చేశాడు. ఇది ఇంకొకసారి రిపీట్ చేయొద్దు’’ అంటూ యావర్ మొహంపై స్టాంప్ వేశాడు.

Also Read: చిత్ర సీమలో విషాదం – గుండెపోటుతో ‘ధూమ్’ డైరెక్టర్ మృతి!



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments