Homeవినోదం'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కియారా అద్వానీ డుమ్మా... ఆస్పత్రిలో ఉందా? కారణం ఏమిటంటే?

‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కియారా అద్వానీ డుమ్మా… ఆస్పత్రిలో ఉందా? కారణం ఏమిటంటే?


‘గేమ్ చేంజర్’ విడుదలకు వారం కూడా లేదు. గత కొన్ని రోజులగా ఈ సినిమాలో హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తన శక్తి వంచన లేకుండా ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నిటిలోనూ పాల్గొంటున్నారు. అయితే, ఈ సినిమాలో ఆయన జోడిగా నటించిన కియారా అద్వానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఈవెంట్‌లో కూడా పాల్గొనలేదు. పోనీ, ఈ రోజు ఏపీలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తారా? అంటే… అది లేదు.

ఆస్పత్రిలో కియారా అద్వానీ…‌ సారీ!?
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన‌ ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు రాజమండ్రిలో జరగనుంది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నిటి కంటే ఇది బిగ్గెస్ట్ ఈవెంట్. ఆల్రెడీ రాజమండ్రి అంత మెగా అభిమానులతో నిండిపోయింది. ఈ వేడుకకు కియారా అద్వానీ కూడా హాజరు కావచ్చు అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆవిడ వచ్చే అవకాశం లేదు.

రాజమండ్రి కంటే ముందు ఈ రోజు (జనవరి 4, శనివారం) ఉదయం ముంబైలో‌ ‘గేమ్ చేంజర్’ మీడియా మీట్ జరిగింది. అందులో కియారా అద్వానీ కనిపించలేదు. రామ్ చరణ్ ముంబై వెళ్లి రెండు రోజులు అయింది. బాలీవుడ్ కండల వీరుడు, భాయిజాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బాలీవుడ్ ‘బిగ్ బాస్ 18’ కార్యక్రమంలో హీరో హీరోయిన్లు పాల్గొన్నారు. రామ్ చరణ్, కియారా కనిపించారు. ఆ తర్వాత కియారా అద్వానీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారని ప్రచారం జరిగింది.‌ దానిని ఆవిడ పిఆర్ టీం ఖండించింది. 

”కియారా అద్వానీ ఆస్పత్రిలో లేరు. గత కొన్ని రోజులుగా ఆవిడ రెస్ట్ అనేది లేకుండా వర్క్ చేస్తున్నారు. నాన్ స్టాప్ షెడ్యూల్స్ వల్ల కొంత విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. అందువల్ల రెస్ట్ తీసుకుంటున్నారు” అని కియారా టీం చెప్పింది. సో… రాజమండ్రి ఈవెంట్‌‌కు కియారా అద్వానీ వచ్చే అవకాశం లేదు. అదీ సంగతి.

Also Read: రామ్‌ చరణ్‌కు రాజమౌళి కండిషన్ – తొడ కొట్టాలని ఉందన్న దిల్ రాజు… SSMB29 విడుదలపై గ్లోబల్ స్టార్ కామెంట్స్


‘గేమ్ చేంజర్’ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. ఒక క్యారెక్టర్ పేరు రామ్ నందన్… అతను ఐఏఎస్ అధికారి. ఇంకో క్యారెక్టర్ పేరు అప్పన్న… అతను ప్రజల కోసం పాటు పడిన ఒక రాజకీయ నాయకుడు. అప్పన్నకు జోడిగా తెలుగు అమ్మాయి అంజలి నటించారు. తమిళ దర్శక నటుడు ఎస్ జె సూర్య, టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, మలయాళ స్టార్ జయరామ్, సునీల్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. 

Also Read‘గేమ్ చేంజర్’లో సెన్సార్ కట్ చేయమన్న పదాలు, సీన్లు ఇవే… రామ్ చరణ్ సినిమా నిడివి ఎంతంటే?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments