Homeవినోదం‘గం గం గణేశా’ ట్రైలర్... కామెడీ చేస్తూ భారీ క్రైమ్‌లో ఇరుక్కుపోయిన ఆనంద్ దేవరకొండ

‘గం గం గణేశా’ ట్రైలర్… కామెడీ చేస్తూ భారీ క్రైమ్‌లో ఇరుక్కుపోయిన ఆనంద్ దేవరకొండ


Gam Gam Ganesha Trailer Is Out Now: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యాడు ఆనంద్ దేవరకొండ. తను మొదటి సినిమా నుండి ఎక్కువగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథలతోనే హిట్లు సాధించాడు. గతేడాది విడుదలయిన ‘బేబి’తో ఆనంద్ రేంజే మారిపోయింది. అందుకే తన అప్‌కమింగ్ సినిమాలపై ప్రేక్షకుల ఫోకస్ పెరిగింది. ఇప్పటివరకు ఎక్కువగా ఫ్యామిలీ కథలు, ప్రేమకథలతో మెప్పించిన ఆనంద్.. మొదటిసారి క్రైమ్ కామెడీతో ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. అలా తన కెరీర్‌లో తెరకెక్కిన మొదటి క్రైమ్ కామెడీ చిత్రమే ‘గం.. గం.. గణేశా’. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యింది.

గాలిలో హీరో ఎంట్రీ..

ముందుగా ‘గం.. గం.. గణేశా’ ట్రైలర్ మొదలవ్వగానే ఒక గ్యాంగ్ కనిపిస్తుంది. మూడు లెక్కపెట్టలోపు బయటికి రావాలి అంటూ ఎవరికో వార్నింగ్ ఇస్తుంటారు. అప్పుడే గాలిలో కారును ఎగరేస్తూ ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ మూవీలో ఆనంద్ ఫ్రెండ్ పాత్రలో జబర్దస్త్ ఇమాన్యుయెల్ నటించాడు. ఆనంద్ ఎంట్రీ సీన్‌లో కారులో తన పక్కన ఇమాన్యుయెల్ కూడా ఉంటాడు. కట్ చేస్తే… ఆనంద్ తన గర్ల్‌ ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇస్తూ కనిపిస్తాడు. ‘‘వాడు సూపర్ మ్యాన్ అయితే నేను బ్యాట్ మ్యాన్ అవుతా. బ్యాట్ మ్యాన్‌కు ఎంత ఆస్తి ఉందో తెలుసా? తెలీదు’’ అంటూ తెలంగాణ యాసలో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో అలరించాడు ఆనంద్ దేవరకొండ.

మాటలతో మోసం..

‘గం.. గం.. గణేశా’లోనే ఆనంద్ ఒక దొంగ అని రివీల్ చేశారు మేకర్స్. ఆ తర్వాత నీలవేణి అనే పాత్రలో ప్రగతి శ్రీవాస్తవ పరిచయం అవుతుంది. ‘‘నాకు నీలవేణి అనే పేరు చాలా ఇష్టం. అందుకే టాటూ వేయించుకున్నా’’ అంటూ తన మెడపై ఉన్న టాటూను చూపిస్తాడు. అది వేరే భాషలో ఉండడంతో ఇదే విషయాన్ని తన ముందు గర్ల్‌ ఫ్రెండ్‌కు, ఫ్రెండ్ అయిన ఇమాన్యుయెల్‌కు కూడా చెప్తాడు ఆనంద్. వాళ్లు తన మాటలు నమ్మేసి మోసపోతారు. అలా కాసేపు కామెడీగా సాగిన ‘గం.. గం.. గణేశా’ ట్రైలర్.. పొలిటీషియన్‌గా రాజ్ అరుణ్ పరిచయంతో మరో మలుపు తిరుగుతుంది. అప్పుడే ఆనంద్, ఇమాన్యుయెల్‌కు యావర్.. ఒక సుపారీ ఇస్తాడు. దానికోసం వాళ్లిద్దరూ రాజావారిపల్లె బయల్దేరుతారు. అక్కడితో సినిమా మలుపు తిరగనుందని ‘గం.. గం.. గణేశా’ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

విగ్రహం వెనుక మోసం..

రాజావారిపల్లెలో వినాయక చవితిని ఘనంగా జరిపించడం కోసం కొండవీటి రాజా పాత్రలో సత్యం రాజేశ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ ఊరిలో వినాయక చవితి కోసం ప్రతిష్టించిన వినాయక విగ్రహం వెనుక ఏదో పెద్ద మోసం దాగి ఉందని ‘గం.. గం.. గణేశా’ ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. కానీ ఆ రహస్యం ఏంటి? ఆ ఉచ్చులో ఆనంద్ ఎలా చిక్కుకుంటాడు? మళ్లీ ఎలా బయటపడతాడు? అనేది సినిమాలోనే తెలుసుకోవాలని.. ట్రైలర్‌ను సస్పెన్స్‌తో ముగించారు మేకర్స్. ఇక ఈ మూవీతో ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ‘మిరాయ్’ నుంచి మనోజ్ గ్లింప్స్ విడుదల – ప్రపంచలోని అతీత శక్తుల్లో అతడు ఒకడట

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments