Homeవినోదం'కీడా కోలా' మూవీ టీంకు ఎస్పీ చరణ్‌ లీగల్‌ నోటీసులు - ఎస్పీ బాలు గొంతు...

‘కీడా కోలా’ మూవీ టీంకు ఎస్పీ చరణ్‌ లీగల్‌ నోటీసులు – ఎస్పీ బాలు గొంతు వాడి షాకిచ్చారు


SP Charan Fires on Keedaa Cola Team: దివంగత లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్‌ని రీ క్రియేట్‌ చేసి తమ సినిమాలో వాడుకున్నారని ఓ తెలుగు మూవీ యూనిట్‌పై ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ మండిపడ్డారు. ఎస్పీబీ వాయిస్‌ను ఆస్కార్‌ అవార్డు గ్రహిత ఏఆర్‌ రెహమాన్‌ మళ్లీ రిక్రియేట్‌ చేయబోతున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతుండగానే ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఆయన వాయిస్‌ని రిక్రియేట్‌ చేశారు. ఆయనే సంగీత దర్శకుడు వికేక్‌ సాగర్‌. గతేడాది తరుణ్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ‘కీడా కోలా’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు.

తరుణ్‌ భాస్కర్‌ ప్రధాన పాత్రలో చైతన్యరావు, జీవన్‌, విష్ణు వంటి నటులు కీలక పాత్రలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమాలోని ఓ కామెడీ సీక్వెన్స్‌లో భాగంగా లెజండరి సింగర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్‌ను వాడుకున్నారు. ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్తమంత అనే సాంగ్‌ను కామెడీ సీక్వెన్స్‌ కోసం వాడారు. దానికోసం ఏఐ ద్వారా ఎస్సీబీ వాయిస్‌తో సాంగ్‌ రీ క్రియేట్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇది కాస్తా ఆయన కుమారుడు ఎస్సీ చరణ్‌ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే దీనిపై ఆయన లీగల్‌ యాక్షన్‌కు దిగారు. కీడా కోలా మూవీ టీంపై షాకిస్తూ వారికి నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. గతనెల జనవరి 18వ తేదీన సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్‌ సహా సినీ దర్శక-నిర్మాతలకు కూడా ఆయన నోటీసులు పంపినట్టు సమాచారం.

Also Read: ఏప్రిల్‌లో కాదు… ‘దేవర’ కొత్త రిలీజ్ డేట్ చెప్పిన ఎన్టీఆర్!

అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎస్పీ చరణ్‌ అసహనం వ్యక్తం చేశారాట. ముందుస్తు అనుమతి లేకుండా తన తండ్రి గొంతుని వాడటం కరెక్ట్‌ కాదని అన్నారట. “మాకు దూరమైన మా తండ్రి వాయిస్‌ని ఏఐ ద్వారా రీక్రియేట్‌ చేయడం మంచి విషయమే. చనిపోయినా ఆయన గొంతుకు మళ్లీ జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ, దీనిపై కనీసం మాకు ముందస్తు సమాచారం ఏం లేదు. మా అనుమతి లేకుండా ఆయన గొంతును రీక్రియేట్‌ చేయడం మాకు బాధ కలిగించిందన్నారు. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరికాదన్నారు. అందుకే ఈ విషయంలో లీగల్‌గా వెళ్లామని ఆయన పేర్కొన్నారు.

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి ఫీల్‌ గుడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్‌ భాస్కర్‌ కీడా కోలా సినిమాను క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందించారు. మూవీ కథ విషయానికి వస్తే.. వాస్తు (చైతన్య రావు) తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. చిన్నప్పటి నుంచి తాతయ్య (వరదరాజులు) సంరక్షణలో పెరిగి పెద్దవాడు అవుతాడు. బొమ్మ విషయంలో కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వమని ఉద్యోగం ఇచ్చిన బాస్ కోర్టులో కేసు వేస్తాడు. చేతిలో చిల్లిగవ్వ లేని వాస్తు తరఫున స్నేహితుడు లాంచమ్ (రాగ్ మయూర్) కేసు వాదిస్తూ ఉంటాడు. మరోవైపు 20 ఏళ్ళ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన భక్త నాయుడు (తరుణ్ భాస్కర్), కార్పొరేటర్ కావాలని ఆశపడే అతని తమ్ముడు జీవన్ (జీవన్ కుమార్) కిడ్నాప్ చేస్తారు. వారికి బొద్దింక పడిన కీడా కోలాకు సంబంధం ఏమిటి? కీడా కోలా కంపెనీ సీఈవో (రవీందర్ విజయ్), అతని దగ్గర పనిచేసే షాట్స్ (‘రోడీస్’ రఘురామ్) ఏం చేశారు? అసలు, ఆ బొమ్మ కథ ఏంటి అనేది దాని చూట్టు సినిమాను తిప్పుతూ క్రైం కామెడీగా తరుణ్‌ భాస్కర్‌ ఆసక్తిగా తెరకెక్కించాడు. 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments