కియారా అద్వానీ (Kiara Advani) తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథానాయిక. సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా ‘భరత్ అనే నేను’లో నటించింది. ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జోడీగా ‘వినయ విధేయ రామ’లో కనిపించింది. ఇప్పుడు మరోసారి మెగా హీరో సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమె బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేశారు.
హాయ్ రే కియారా… ఎల్లోరా శిల్పంలా!
Game Changer team wishes Kiara Advani a very happy birthday with lovely poster: ‘గేమ్ ఛేంజర్’ సినిమా అనౌన్స్ చేసినప్పుడు కియారా అద్వానీ లుక్ కూడా విడుదల చేశారు. రామ్ చరణ్, ఆవిడ సూట్ బూట్ వేసుకుని కనిపించారు. ఆ తర్వాత ‘జరగండి జరగండి…’ సాంగ్ వచ్చింది. అందులో హీరో హీరోయిన్లు వేసిన స్టెప్పులు అందరినీ అలరించాయి. ఆ సాంగ్ నుంచి కియారా అద్వానీ లుక్ ఈ రోజు రిలీజ్ చేశారు.
‘జరగండి’ పాటలో కియారా అద్వానీని చూసినప్పటికీ… ఇవాళ విడుదల చేసిన లుక్ చూస్తే ‘ఎల్లోరా శిల్పంలా కియారా అద్వానీ ఏముందిరా’ అని ప్రేక్షకులు అంటరాని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఆ పోస్టర్ మీరూ చూడండి. నిజంగా జాబిలమ్మ జాకెట్ వేసుకుని వచ్చినట్టు లేదూ!
Also Read: ప్రభాస్ కోసం వెనక్కి తగ్గిన మంచు మనోజ్, తేజా సజ్జా – ‘రాజా సాబ్’ వెనుక ‘మిరాయ్’ రిలీజ్ డౌటే!
Team #GameChanger wishes our Jabilamma Aka @advani_kiara a very Happy Birthday ❤️
Her vibrant energy will soon enchant your hearts 💥
Mega Powerstar @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @DOP_Tirru @artkolla @SVC_official @ZeeStudios_ @zeestudiossouth @saregamaglobal… pic.twitter.com/PJMkzLTX4y
— Sri Venkateswara Creations (@SVC_official) July 31, 2024
క్రిస్మస్ బరిలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా!
Game Changer Release Date: ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. కియారా అద్వానీ బర్త్ డే నుంచి మొదలు పెడితే… క్రిస్మస్ వరకు వరుస అప్డేట్స్ రావడం ఖాయమని చెప్పాలి. కమల్ హాసన్ హీరోగా దర్శకత్వం వహించిన ‘భారతీయుడు 2’ విడుదల కావడంతో ఇప్పుడు శంకర్ దృష్టి అంతా పూర్తి స్థాయిలో ‘గేమ్ ఛేంజర్’ మీద ఉంది. ఆల్రెడీ రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. మిగతా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.
Also Read: చిరు, పవన్, చరణ్ కోసం కథ రాస్తున్న దర్శకుడు – మెగా మల్టీస్టారర్ వర్కవుట్ అయ్యేనా?
‘గేమ్ ఛేంజర్’ను క్రిస్మస్ బరిలో విడుదల చేస్తున్నట్లు అగ్ర నిర్మాత ‘దిల్’ రాజు ఆ మధ్య చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం మీద సోదరుడు శిరీష్ తో కలిసి ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. వాళ్ళ సంస్థలో 50వ సినిమా కూడా! ఆగస్టులో ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నాయని, మరి రెండో పాటగా ఏది విడుదల చేస్తారనేది శంకర్ గారి ఇష్టం అని సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. ఈ సినిమాలో తెలుగమ్మాయి అంజలి మరో హీరోయిన్. శ్రీకాంత్, సునీల్, ఎస్.జె. సూర్య తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని చూడండి