Homeవినోదంకార్తీకదీపం 2 సీరియల్: స్వప్న తన చెల్లి అని కాంచనతో చెప్పిన కార్తీక్.. బిత్తరపోయిన శ్రీధర్,...

కార్తీకదీపం 2 సీరియల్: స్వప్న తన చెల్లి అని కాంచనతో చెప్పిన కార్తీక్.. బిత్తరపోయిన శ్రీధర్, దొర


Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప టిఫెన్ తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంటే మధ్యలో నర్శింహ కనిపించి దీపతో మాట్లాడుతాడు. ఆవేశంలో ఉన్న ఆడదాని జోలికి వెళ్లకూడదు అని కత్తిపీట పట్టుకున్న నిన్ను ఏం చేయకుండా వదిలేశాను అని నర్శింహ అంటాడు. దానికి దీప నువ్వు కాదురా నేను నిన్ను నా కూతురు గురించి ఆలోచించి వదిలేశా అని అంటుంది. దానికి నర్శింహ ఏ నీ కూతురికి తండ్రి ఉండడు అనా అని అడుగుతాడు. దానికి దీప కాదు.. తల్లి కూడా దూరం అయిపోతుంది అని అంటుంది.

నర్శింహ: నువ్వు తొందర పడకు ఈ చివరి మాటే నిజం చేస్తా.
దీప: నర్శింహ ఏదో కూతురిని చదివించడానికి చిన్న పని చేసుకొని బతికేస్తున్నా. నన్ను వదిలేసే.
నర్శింహ: నువ్వు నన్ను పోలీస్‌ స్టేషన్‌లో పెట్టించి కొట్టించకపోయి ఉంటే వదిలేసి ఉండేవాడిని. నా కూతురు కనిపించడం లేదు అని నా కాళ్లు పట్టుకొని అడిగి ఉంటే వదిలేసేవాడినేమో. ఇంటికి వచ్చి నా ముందు నా భార్యని కొట్టావ్. మొత్తానికి నా బస్తీలో నన్ను ఓ ఐటెమ్‌ గాడిని చేసి వదిలి పెట్టావ్. వదలను.. నిన్ను వదలను నీ కూతురిని వదలను.. కత్తిపీట కాకపోతే కత్తి తీసుకొస్తావ్ అంటే కదా. నువ్వు బరితెగించిన ఆడదానివి. నేను భయం లేని మగాడిని. ఛీ.. ఈ ఎదవతో నాకేంటి అని నువ్వు అనుకొంటే మూటా ముళ్లే సర్దుకొని నా పెళ్లానికి ఓ సారీ చెప్పి వెళ్లిపో. లేదు ఇక్కడే ఉంటా నా కార్తీక్ బాబు గాడితోనే ఉంటాను అన్నావే అనుకో. పచ్చి కారం ఒంటికి రాసుకున్నట్లు ఉంటుంది నాకు చెప్పు పోతావా.
దీప: తప్పు చేసింది నువ్వు అయితే నేను ఎందుకు పోవాలి. నా కూతురు నా ప్రాణం దానికి ఏమైనా జరిగితే నాకు బుర్ర సరిగా పని చేయదు. నాకు ఇంతకు ముందే పెళ్లి అయింది ఓ కూతురు ఉంది అని మర్చిపో. అది మన ఇద్దరికీ మంచిది. 

కార్తీక్ స్వప్నని హాస్పిటల్‌లో చేర్పిస్తుంది. ఇక స్వప్న ఎక్కువ మాట్లాడుతుంది. కార్తీక్ మాట్లాడకుండా రెస్ట్ తీసుకో అన్నా స్వప్న వినదు. దీంతో ఇక స్వప్న కార్తీక్‌ని డ్రిల్ మాస్టర్ అంటుంది. దానికి కార్తీక్ గట్టిగా నవ్వి తాను కూడా తన తండ్రిని మాస్టారూ అని అంటాను అంటాడు. ఇక స్వప్న తన తండ్రిని మూన్ డాడ్ అంటాను అంటుంది. అందేంటి అని కార్తీక్ అంటే తన తండ్రి అప్పుడప్పుడు కనిపిస్తాడు అని చెప్తుంది. ఇంతలో కాంచన అక్కడికి వస్తుంది. కాంచన రావడం రావడమే స్వప్నకు క్లాస్ ఇస్తుంది. నాన్ స్టాప్‌గా మాట్లాడుతుంది. దీంతో కార్తీక్ మనసులో స్వప్నకు తన తల్లి దగ్గర నుంచే ఈ అలవాటు వచ్చిందని నవ్వుకుంటాడు. ఇక స్వప్న కార్తీక్‌ని కాంచనకు పరిచయం చేస్తుంది. కాంచనకు కార్తీక్ శ్రీధర్ కొడుకు అని తెలీదు. కార్తీక్‌కు థ్యాంక్స్ చెప్తుంది. మరో వైపు దీప టిఫెన్ పట్టుకొని హాస్పిటల్‌కి వస్తుంది. దీప కార్తీక్, కాంచన వాళ్లు మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతుంది. ఆవిడ తనకు పిన్ని అవుతుందని తెలుసా అని అనుకుంటుంది. ఇక దీప టిఫెన్ ఇస్తుంది. 

ఇక కాంచన దీపని చూసి తనకు దీపకు గొడవ అయిందని  తర్వాత తన భర్త వచ్చాడని తాను వెళ్లిపోయిన తర్వాత దీప సారీ చెప్పిందని అంటుంది. దీప మనసులో శ్రీధర్‌ గారు ఎవరితో వాళ్లకి బాగానే కట్టు కథలు చెప్తున్నారు అని అనుకుంటుంది. స్వప్న కూడా దీప తప్పు చేసుంటుందని అంటే కార్తీక్ స్వప్న నిజం తెలుసుకోకుండా ఏమీ అనొద్దు అంటాడు. ఇక ఆ విషయం వదిలేయమని అంటాడు. మరోవైపు శ్రీధర్ కూడా హాస్పిటల్‌కి వస్తాడు. శ్రీధర్ కార్తీక్‌, దీపలను చూసి షాక్ అయి దాక్కుంటాడు. తండ్రి ఇంకా రాలేదు అని స్వప్న అంటే కాంచన కాల్ చేస్తుంది. మీటింగ్‌లో స్టక్ అయిపోయాను అని శ్రీధర్ అబద్ధం చెప్తాడు. ఇంటికి వస్తాను అంటాడు. కాంచన ఒప్పుకోవడంతో గండం నుంచి తప్పించుకున్నాను అని వెంటనే వెళ్లిపోతాడు. ఇక కార్తీక్, దీపలు బయల్దేరుతారు. 

దీప కార్తీక్‌ని స్వప్న గురించి అడుగుతుంది. కార్తీక్ తనకు వాళ్లు తెలీదు అని స్వప్నకు యాక్సిడెంట్ అవ్వడంతో హాస్పిటల్‌కి తీసుకొచ్చానని చెప్తాడు. స్వప్న రోడ్డు మీద స్కూటీతో ఓకాయన్ని ఢీ కొట్టిందని అంటాడు. దానికి దీప మనసులో ఒకే రక్తం కదా ఒకేలాంటి బుద్ధులు వచ్చినట్లు ఉన్నాయి. వీళ్లిద్దరూ రోడ్డు మీద ఎవర్నీ బతకనివ్వరు అనుకుంటా అని అనుకుంటుంది. ఇక దీప తెలీకుండా మంచి పని చేశారు అని కార్తీక్‌తో అంటుంది. ఇక దీప స్వప్న చాలా అమాయకంగా ఉంది అని మీలాంటి వాళ్ల స్నేహం తనకు చాలా అవసరం అని అంటుంది. ఇక కార్తీక్ కూడా తను చాలా నచ్చింది అని ఎంత అంటే నాకు తనలాంటి చెల్లి ఉంటే బాగుంటుందని అంటాడు. ఇక దీపకు కార్తీక్ టిఫెన్ డబ్బులు ఇస్తాడు. దీప వెళ్లిపోతుంది. 

మరోవైపు కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శ్రీధర్ లేటుగా ఇంటికి వచ్చాను సారీ అంటాడు. కాంచన కార్తీక్ ఓ అమ్మాయిని కాపాడి హాస్పిటల్‌లో చేర్పించాడు అని ఆ అమ్మాయి వల్ల కొత్త సమస్య వస్తుందని అంటుంది. ఇక శ్రీధర్ దీప కార్తీక్‌కి స్వప్న గురించి చెప్తే నా పని ఏంటి అని అనుకుంటాడు. ఇక కాంచన స్వప్న చాలా తనకు నచ్చిందని చలాకీగా ఉందని.. స్వప్న తనకు చెల్లిలా అనిపించిదని కార్తీక్ తనకు చెప్పాడని అంటుంది. ఇక స్వప్నని ఓ రోజు లంచ్‌కి పిలుస్తాను అని కాంచన అంటే శ్రీధర్ వద్దు అని కంగారుగా అరుస్తాడు. మరోవైపు దీప పాట పాడుతూ శౌర్యకి పాట నేర్పిస్తుంది. కార్తీక్ బయట నుంచి వింటూ ఉంటాడు. శౌర్య కార్తీక్‌ని చూసి తన తల్లికి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘త్రినయని’ సీరియల్: గ్లౌజ్ గురించి తిలోత్తమను ప్రశ్నించిన విశాలాక్షి.. నయనికి కనిపించిన ప్రమాదం, ఇంతకీ ఎవరు అది!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments