Karthika Deepam Idi Nava Vasantham Serial Episode లాయర్ జ్యోతి దగ్గరకు దీప వస్తుంది. కాళ్లకు చెప్పులు లేక నడవడానికి ఇబ్బంది పడుతూ అదోలా ఉన్న దీపని చూసి జ్యోతి ఏమైందని అడుగుతుంది. నిన్ను చూస్తుంటే ఏదో భయంగా ఉందని చెప్పి కూర్చొపెడుతుంది. దీప లాయర్‌తో తనకు విడాకులు కావాలని అడుగుతుంది.
దీప: నేను ఏం తప్పు చేయకున్నా ఏన్నో ఓర్చుకున్నాను కానీ ఈ రోజు పడ్డ మాటలు మాత్రం నా జీవితంలో పడలేను మేడమ్. వద్దు మేడమ్ కూతుర్ని ఎలా దక్కించుకోవాలో తెలీక ముందు నన్ను మానసికంగా చంపేయాలి అని చూశాడు. నేను తూలి పడబోతే కార్తీక్ బాబు నా చేయి పట్టుకున్నాడు. దాన్ని కూడా ఓ ఆధారం పెట్టుకొని పట్టపగలు మరో మగాడితో అలా నడిరోడ్డు మీద అని లాయర్ మాట్లాడుతుంటే ఆ మాటలే నన్ను నరికేస్తున్నాయ్ మేడమ్.
జ్యోతి: కేసు గెలవడానికి అవతల వాళ్లు ఇలాంటి మాటలు అని మానసికంగా ఇబ్బంది పెట్టి కేసు గెలవాలి అన్నది వాళ్ల ప్లాన్.
దీప: ఇక చాలు మేడమ్ మొదటి వాయిదాకే ఇలా చేశాడు అంటే ఇక తర్వాత ఎన్ని అబద్ధాలు చెప్పబోతున్నాడో ఇక ఆ మనిషితో నేను వేగ లేను నాకు విడాకులు కావాలి మేడమ్. మీరు విడాకులకు అర్జీ పెట్టండి నేను చెప్పాల్సింది కోర్టులో చెప్తాను.
సుమిత్ర: నా ప్రాణాలు కాపాడిన దీపకు నేనేం సాయం చేయలేకపోతున్నానండీ.
దశరథ్: నేను అదే ఆలోచిస్తున్నా సుమిత్ర రేపు ఏమైనా జరిగి పాపని నర్శింహకి ఇవ్వాల్సి వస్తే దీప పరిస్థితి ఏంటా అని.
సుమిత్ర: దీప చచ్చిపోతుందండి. దీప బతుకుతుందే శౌర్య కోసం.
పారిజాతం: దీప గురించి నువ్వు ఆలోచించినంత గొప్పగా నీ కన్న కూతురి గురించి ఆలోచించి ఉంటే ఇంకా బాగుండేది. దీపకి శౌర్య అంటే ప్రాణం అని తెలిసిన నీకు జ్యోత్న్సని కార్తీక్ అంటే ప్రాణం అని తెలీలేదు.
సుమిత్ర: అత్తయ్య నేను ఇంతకు ముందు చెప్పాను మళ్లీ చెప్తున్నాను జ్యోత్స్న నా కూతురు కార్తీక్ నా మేనల్లుడు వాళ్లిద్దరి మీద ప్రేమ వేరు దీప మీద ఉన్న అభిమానం వేరు. దీప పరాయిదే కావొచ్చు కానీ కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మన సమాజం ఉన్న పరిస్థితికి నింద పడిన మగాడిని అయినా క్షమిస్తుంది కానీ ఆడవాళ్లని వదలదు. ఓ అమ్మ మనసుతో ఆలోచించండి అత్తయ్య దీప ఎంత ధీనస్థితిలో ఉందో మీకు అర్థమవుతుంది.
దీప దీనంగా నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటి దగ్గర శౌర్య కనిపించకపోవడంతో కంగారు పడుతుంది. దీప పరుగున సుమిత్ర దగ్గరకు వెళ్తుంది. శౌర్యని పిలవమని అంటే బయటే ఆడుకుంటుందని సుమిత్ర చెప్తుంది. దీప లేదని చెప్పడంతో పారిజాతం మీ ఆయనో అత్తో వచ్చి తీసుకెళ్లుంటారని అంటుంది. దాంతో సుమిత్ర దీప దశరథ్‌లు పాపని వెతకడానికి బయటకు వెళ్తారు. దీప కార్తీక్‌కి కాల్ చేస్తుంది. ఇక దీప సెల్ ఛార్జింగ్ అయిపోతే కార్తీక్ కాల్ చేసే సరికి దీప ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో కార్తీక్ కంగారు పడి దీప దగ్గరకు బయల్దేరు తాడు. మరోవైపు జ్యోత్స్న ఫొటోలు తీసుకుంటుంటే పారిజాతం మనవరాలి దగ్గరకు వెళ్తుంది. శౌర్య కనిపించడం లేదని చెప్తుంది. నర్శింహే తనని తీసుకెళ్లుంటాడని జ్యోత్స్న అంటుంది. దీపని దత్తత తీసుకున్న తల్లిదండ్రులుగా మీ అమ్మనాన్నలు మరారని ఇక కార్తీక్ అయితే దీపకు ఏమైనా అయితే ఎగిరి వస్తాడని అంటుంది.
సుమిత్ర, దీప వాళ్లు కంగారు పడతారు. తనకి నర్శింహ మీద అనుమానంగా ఉందని దీప బయల్దేరుతుంది. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. శౌర్య కనిపించడం లేదని దీప అంటుంది. ఇంతలో శౌర్య ఇంట్లోని అలమరలో దాక్కోని బయటకు వస్తుంది. దీపకు భయపడొద్దని కార్తీక్ ధైర్యం చెప్తాడు. ఇంతలో శౌర్య వస్తుంది. బూచోడు వస్తాడని తనని తీసుకుపోతాడని అందుకే బీరువాలో దాక్కున్నానని శౌర్య చెప్తుంది. ఇక బూచోడు వస్తాడని జ్యో చెప్పిందని అంటుంది. నాకు నాన్న వద్దమ్మా నేను నీతోనే ఉంటాను అని శౌర్య అంటుంది. ఇక శౌర్య కార్తీక్‌ని ఎక్కడికీ వెళ్లొద్దని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్ వెంటపడుతున్న సత్య, సోనితో రుద్ర అఫైర్, అందరూ శత్రువులయ్యారని మహదేవయ్య ఫైర్!
మరిన్ని చూడండి