Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శౌర్య కనిపించడం లేదని దీప కాశీతో చెప్తుంది. ఇక సుమిత్ర అమ్మ ఇంటికి వెళ్లిందేమో అంటే కాశీ పారిజాతానికి ఫోన్ చేసి శౌర్య వచ్చిందా అని అడుగుతాడు. దానికి పారిజాతం తెలీదు అంటుంది. అవుట్ హౌస్ ఖాళీగా ఉందని అంటుంది. ఇక పారిజాతం ఏదో జరుగుతుందని దీప పాపని తీసుకెళ్తే వీడు నన్ను అడుగుతున్నాడేంటి అని అనుకుంటుంది. ఇక దీప, కాశీ వీధుల్లో వెతుకుతారు.
మరోవైపు డాక్టర్ శౌర్యకి ట్రీట్మెంట్ చేస్తారు. కార్తీక్ దీపకి కాల్ చేస్తే ఫోన్ స్విఛ్ ఆఫ్ వస్తుంది. ఇక శౌర్య హార్ట్ ప్రాబ్లమ్ దీపకి చెప్తే బెటర్ అని అప్పుడు దీప పాపని బాగా చూసుకుంటుందని అనుకుంటాడు. ఇంతలో డాక్టర్ వచ్చి కార్తీక్‌ని తన క్యాబిన్‌కి పిలుస్తాడు. శౌర్యకి ఏమైందని కార్తీక్ డాక్టర్‌ని అడుగుతాడు. ఇది రేర్ కేస్ అని ప్రమాదం అన్నట్లు మాట్లాడుతాడు. గతంలో ఇలాంటి కేసే వచ్చిందని ఆ కేసులో వచ్చిన పేషెంట్ చనిపోయిందని ఇప్పుడు శౌర్య మీద డౌట్‌తో శాంపిల్స్ తీసుకున్నానని చెప్తాడు. కార్తీక్ కుమిలిపోతాడు. రెండు కోట్లు వరకు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తాడు. పాప నిన్ను కలవరిస్తుందని పాప నీతోనే ఉంటే ఆనందంగా ఉంటుందని డాక్టర్ చెప్తాడు. పాపని ఇంటికి తీసుకెళ్లమని రిపోర్ట్ వస్తే క్లారిటీ వస్తుందని అంటాడు.
కార్తీక్: ప్రమాదం చిన్నదే దీపకి నిజం చెప్పాలి అనుకున్న కానీ ఇంత పెద్ద ప్రమాదం అయితే దీపకి ఎలా నిజం చెప్పాలి. ముందు దీప ఎక్కడుందో తెలుసుకోవాలి. సుమిత్రకి కాల్ చేసి దీప వచ్చిందా అని అడుగుతాడు. దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అత్త. ఆ మనిషిని కాస్త బతకనివ్వమని ఇంట్లో వాళ్లకి చెప్పు అత్త. నేను అయితే చూస్తూ ఊరుకోను అన్నింటికీ ఒకేసారి సమాధానం చెప్తాను.
సుమిత్ర: నిజంగా ఏం జరిగిందో నాకు తెలీదురా.
కార్తీక్: చేసిన వాళ్లు ఇంట్లో ఉంటారు అడుగు అత్త తెలుస్తుంది.
సుమిత్ర: జ్యోత్స్న.. జ్యోత్స్న దీపని ఏం అన్నావ్ దీప ఎందుకు వెళ్లిపోయింది. దీప వెళ్లిందా వెళ్లేలా చేశావా.
జ్యోత్స్న: అవును నేనే వెళ్లేలా చేశాను అయితే ఏంటి.
శివనారాయణ: ఏమైంది.
జ్యోత్స్న: ప్రపంచం మునిగిపోయింది తాత. దీప ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు బావ నాకు భర్త అవుతాడు అన్న హోప్ ఉన్ను. కానీ దీప అత్తా బావల్ని పూజకి పిలిచి ఆ బంధాన్ని ఇంకాస్త దూరం పెంచింది.
శివనారాయణ: కాంచన, కార్తీక్‌ని ఇంటికి పిలిచింది దీప.
జ్యోత్స్న: అవును తాత.
తనకు బావ కావాలి అని జ్యోత్స్న అంటే అది జరగదు అని శివనారాయణ అంటాడు. తప్పు చేసిన వాళ్లని క్షమిస్తే తాను చనిపోయినట్లే అని అంటాడు. దానికి జ్యోత్స్న వద్దు తాత నువ్వు నీ పంతం తగ్గించుకోవద్దు ఎవరి కోసం నువ్వు మారొద్దు. పరువు కోసం నువ్వు చావడం ఎందుకు బావని ప్రేమించింది నేను కదా బావ కోసం నేనే చస్తాను అని అంటుంది. గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని చాకు తీసుకుంటుంది. పారిజాతం ఏడుస్తూ పంతం కోసం ప్రాణాలు తీసేస్తారా మీరేం పెద్ద మనిషి అని భర్త మీద అరుస్తుంది. అందరూ తలుపు తీయమని ఏడుస్తారు. ఎవరు ఎన్ని చెప్పినా జ్యోత్స్న వినదు. మీరు పెళ్లి చేస్తాను అంటే వస్తాను లేదంటే చస్తాను అంటుంది. దాంతో పారిజాతం, సుమిత్రలు శివనారాయణ్ని బతిమాలుతారు. కార్తీక్‌తో పెళ్లి చేయమని అంటారు. దానికి ఆశలు కలిగించింది మనమే కదా మన తప్పు మనం సరిదిద్దుకుందామని అంటారు.
దశరథ్ ఏడుస్తూ కూతుర్ని పోగొట్టుకొని బతకలేను నాన్న నిన్ను ఎప్పుడూ ఏం అడగలేదు నా కూతురికి ప్రాణభిక్ష పెట్టమని అడుగుతారు. అందరూ పెద్దయన్ని దండం పెట్టి పెళ్లికి ఒప్పుకోమంటారు. దాంతో శివనారాయణ సరే అంటాడు. కొడుకు చేతిలో చేయి వేసి మీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నానని అంటాడు. దాంతో జ్యోత్స్న చాకు కింద పడేసి బయటకు వస్తుంది. అత్తని కూడా ఒప్పిస్తానని అంటాడు. ఇంకెప్పుడూ ఇలా చేయొద్దని సుమిత్ర అంటుంది. దాంతో బావతో పెళ్లి అయిపోతుంది కదా అమ్మ ఇంకెప్పుడూ ఇలా చేయను అంటుంది.
కార్తీక్ శౌర్యని తీసుకొని ఇంటికి వస్తాడు. జ్యూస్ తాగిస్తాడు. దీప వచ్చి వెళ్లిన సంగతి కాంచన కార్తీక్‌కు చెప్తుంది. ఇక కార్తీక్‌తో శౌర్య అమ్మ వస్తే నన్ను తీసుకెళ్లిపోతుందని అంటుంది. బూచోడు వచ్చాడని చెప్తుంది. తనని ఎత్తుకెళ్లడం గురించి చెప్తుంది. అమ్మానానమ్మ బూచోడిని కొట్టారని చెప్తుంది. దాంతో కార్తీక్ తల్లితో అమ్మా నేను అనుకున్న దాని కంటే పెద్ద గొడవ జరిగిందని అంటాడు. ఇక శౌర్య తనకు నాన్న కావాలని అంటుంది. నాన్నగా నువ్వు కావాలని అంటుంది. కార్తీక్, కాంచన షాక్ అయిపోతారు. నాన్నగా ఉంటావా కార్తీక్ అని అడుగుతుంది. మరోవైపు ఏడుస్తుంది. ఇంతలో కాశీ కార్తీక్‌కు కాల్ చేస్తాడు. శౌర్య కనిపించడం లేదంటే శౌర్య నా దగ్గర ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
మరిన్ని చూడండి