Homeవినోదంకార్తీకదీపం 2 సీరియల్: నాన్న కావాలని గోల చేసిన సౌర్య, దీప ఎమోషనల్ - నన్ను...

కార్తీకదీపం 2 సీరియల్: నాన్న కావాలని గోల చేసిన సౌర్య, దీప ఎమోషనల్ – నన్ను ఆపేది ఎవడంటూ రంగంలోకి వంటలక్క!


Karthika Deepam 2 Serial Promo Today Episode: నెంబర్ వన్ స్థానంలో 6 ఏళ్ల పాటు దిగ్విజయంగా కొనసాగి.. సూపర్ హిట్‌గా నిలిచిన ‘కార్తీక దీపం’ సీరియల్‌కు పార్ట్ 2 మొదలైన సంగతి తెలిసిందే. ‘కార్తీక దీపం.. ఇది నవ వసంతం’ ట్యాగ్‌తో స్టార్ అయిన సీజన్ 2ను అభిమానులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇప్పటికే మెల్లమెల్లగా కొత్త క్యారెక్టర్లను డైరెక్టర్‌ పరిచయం చేస్తున్నారు. గొప్పింట్లో పుట్టిన దీపను తన నానమ్మే నిరు పేదని చేసేయడం చూపించారు. కుభేర్ అనే వ్యక్తి దీపని తన సొంత కూతురిలా సాకడం. అత్త అనసూయ మాటలతో చదువు పక్కన పెట్టేసి దీప వంటలక్కగా మారడం చూపించారు.  ఇక నిన్నటి ఎపిసోడ్‌లో దీప కూతురు సౌర్యని పరిచయం చేశారు. తాజాగా ‘కార్తీకదీపం’ ప్రోమో వచ్చింది. 

సౌర్యని దీప జాతరకు తీసుకొని వస్తుంది. సౌర్యని దీప ఇంటికి వెళ్దామని పిలుస్తుంది. దీంతో సౌర్య నేను రాను ఇక్కడే ఉంటాను అని.. నాన్న వచ్చి ఉంటే  నాకు సైకిల్ కొని ఇచ్చేవాడు అని అంటుంది. సౌర్య మాటలకు దీప ఏడుస్తుంది. దీంతో సౌర్య ఏంటి కనీళ్లు వస్తున్నాయ్ అని అడుగుతుంది. దానికి దీప మనసులో.. నా దురదృష్టం కళ్లలో నీళ్లలా ఇలా బయటకు వస్తుంది అని ఏడుస్తుంది. ఇక సౌర్య తల్లిని దగ్గరకు పిలిచి ముద్దు పెట్టి కన్నీళ్లు తుడుస్తుంది. దాంతో దీప ఇంకా ఎమోషనల్ అవుతుంది. ఇక తర్వాత జాతరలో సైకిల్ పోటీలు జరుతాయి. పోటీలకు వెళ్లమని సౌర్య తల్లికి చెప్తే సైకిల్ పోటీలే కదా మనల్ని ఆపేది ఎవరూ అని దీప రంగంలోకి దిగుతుంది. దీంతో ప్రోమో పూర్తవుతుంది.

 

నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగింది అంటే.. 

దీపను కుభేర్ అల్లారు ముద్దగా పెంచుతాడు. దీప పెరిగి పెద్ద అవుతుంది. కుభేర్ టిఫెన్ షాపు దగ్గర కాలనీ వాళ్లు అందరూ చిట్టీలు వేస్తుంటారు. అక్కడ ఉన్నవారు అంతా చిట్టీలో నా పేరు వస్తుంది అంటే నా పేరు వస్తుంది అని అంటారు. ఇంతలో కుభేర్ వచ్చి గొడవ పడొద్దని దీప వస్తే చీటీ తీస్తుంది అని చెప్తాడు. కుభేర్ అలా చెప్పగానే దీప సైకిల్ మీద ఎంట్రీ ఇస్తుంది. ఇక అక్కడ అందరూ దీపని పొగిడేస్తారు. 

మరోవైపు జ్యోత్స్న, కార్తీక్‌లు కలిసే పెరుగుతుంటారు. కార్తీక్, జ్యోత్స్నలు తన తల్లితో పాటు గుడికి వస్తారు. అక్కడ జ్యోత్స్న కొలను దగ్గరకు వెళ్లి తన బావ కార్తీక్‌కు కలువ పువ్వు అడుగుతుంది. ఇక కార్తీక్ కొలనులో మునిగిపోతాడు. జ్యోత్స్న భయంతో తన తల్లిని పిలుచుకు వస్తుంది. అటుగా సైకిల్ తొక్కుతూ ఆడుకుంటున్న దీప కార్తీక్‌ కొలనులో మునిగిపోవడం చూస్తుంది. నీటిలోకి దూకి కార్తీక్‌ను కాపాడుతుంది. 

దీప మొదటి సారి తన బావతో పాటు కన్న తల్లి సుమిత్రను చూస్తుంది. తన మేనల్లుడిని కాపాడినందుకు సుమిత్ర దీప చేయి పట్టుకొని థ్యాంక్స్ చెప్తుంది. దీప కూడా సుమిత్రను అమ్మ అని పిలుస్తుంది. సుమిత్ర దీపకు డబ్బులు ఇవ్వబోతే దీప వద్దుంటుంది. దీపని సుమిత్ర నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. ఇక కార్తీక్ తనకు సాయం చేసినందుకు దీపకు థ్యాంక్స్‌ చెప్పి భవిష్యత్‌లో తనకు సాయం చేస్తాను అని కార్తీక్ దీపకు చెప్తాడు. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇక కొలనులో దిగిన తర్వాత దీపకు తన తల్లి గుర్తుగా తండ్రి కుభేర్ ఇచ్చిన చైన్ కార్తీక్‌ జేబులోకి చేరుతుంది.

కుభేర్ అక్క అనసూయ చదువుకుంటున్న దీపను తిడుతుంది. దీపని కలెక్టర్ చేయడం కోసం తన తమ్ముడు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్నాడు అని చెప్తుంది. దీప తన తమ్ముడి సొంత కూతురు కాదు అని తెలిసిన అనసూయ దీప చదువుకి అడ్డు పడుతుంది. దీంతో కుభేర్ తన అక్కని పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్తాడు. మాటల్లో అనసూయ కొడుకు నర్శింహ గాలి తిరుగులు తిరుగుతున్నాడని అతడికి దీపని ఇచ్చి పెళ్లి చేయను అని కుభేర్‌ చెప్తాడు. దీంతో అనసూయ దీపకు నర్శింహకు పెళ్లి జరిగితే వాడే సెట్ అవుతాడని దీపే తన కోడలు అని తెగేసి చెప్తుంది. కుభేర్ బయటకు వచ్చి చూసేసరికి దీప పుస్తకాలు తన ఫ్రెండ్‌కి ఇచ్చేసి చదువు మానేసి తండ్రికి వంటలు నేర్పమని అడుగుతుంది. అయిష్టంగానే కుభేర్ సరే అంటాడు. 

కొన్నేళ్ల తర్వాత దీపక్క సైకిల్ మీద టిఫెన్లు పెట్టుకొని వస్తుంటుంది. ఆమె కోసం రోడ్డు మీద చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇక దీప అందరికీ తన చేతితో టిఫిన్ పెడుతుంది. అందరూ తింటుంటే తన కడుపు నిండినట్లు చాలా సంతోష పడుతుంది. అక్కడ ఉన్న వారంతా దీపను తెగ పొగిడేస్తారు. 

సౌర్య ఎంట్రీ..

స్కూల్ బయట ఓ పాప రెండు చేతులు కట్టుకొని నిల్చొంటుంది. పిల్లలు అందరూ బడిలోకి వెళ్తే పాప మాత్రం వెళ్లదు. ఇంతలో ఓ టీచర్ వచ్చి సౌర్య క్లాస్‌కి రా అని పిలిచినా సౌర్య రాను అంటుంది. తన తండ్రి ఈ రోజు వస్తారు అని అమ్మ వస్తే వెళ్తాను అని అంటుంది. ఇక టీచర్‌కి కూడా దీప టిఫెన్ ఇస్తుంది. టీచర్‌ మెచ్చుకుంటుంది. ఇక దీప సౌర్యని తీసుకొని జాతరకు వెళ్దామంటుంది. ఇక దీపకు సౌర్య తన తండ్రి గురించి అడుగుతుంది. ఇక దీప తన గతం గురించి భర్త గురించి బాధపడుతుంది. ఇక దీప తన కూతురు సౌర్యను తీసుకొని జాతరకు వెళ్లడంతో నిన్నటి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: సత్యభామ సీరియల్ మార్చి 27th: వామ్మో సత్య, క్రిష్‌కి తన విశ్వరూపం చూపించేసిందిగా, శోభనం క్యాన్సిల్!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments