Homeవినోదంకార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌ల రిసెప్షన్‌ చేయనున్న కాశీ, స్వప్న.. జ్యో ఇంటికి ఆహ్వానం!

కార్తీకదీపం 2 సీరియల్: దీప, కార్తీక్‌ల రిసెప్షన్‌ చేయనున్న కాశీ, స్వప్న.. జ్యో ఇంటికి ఆహ్వానం!


Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode పారిజాతం దాసు ఇంటికి వెళ్లి కాశీ, స్వప్నలతో గొడవ పెట్టుకుంటుంది. ఆరేళ్ల కూతురున్న ఓ తల్లిని మీ అన్న చాటుగా తాళి కడితే అది పెళ్లి అయిపోతుందా అని స్వప్నని అడుగుతుంది. ఎందుకు కాదు అని స్వప్న అంటే అయితే మీ అన్నని పెళ్లాన్ని తీసుకొని బయటకు వెళ్లమను జనాలు ఎలా ఛీ కొడతారో అర్థమవుతుందని అంటుంది. పది మందికి చెప్పుకునే అంత గొప్ప బంధం కాదు అంటుంది. మా అన్న వదినల్ని ఏం అనొద్దు అని స్వప్న అంటుంది.

పారిజాతం: అంటాను చాటుగా కాపురం చేసుకోవడం తప్ప మేం భార్యభర్తలం అని ఎవరికీ చెప్పుకోలేరు.
స్వప్న: మా అన్నయ్య వదినలకు నేను రిసెప్షన్ చేస్తాను బంధువుల్ని పిలుస్తాను.
పారిజాతం: అప్పుడు అందరూ ఉమ్మేస్తారు.
కాశీ: ఎందుకు ఉమ్మేస్తారు నీ లాంటి వాళ్ల నోరు మూయించడానికి అయినా అక్కాబావలకు రిసెప్షన్ చేస్తాం.
స్వప్న: ఛాలెంజ్ చేస్తున్నా అమ్మమ్మ గారు అందరికీ తెలిసేలా రిసెప్షన్ చేస్తా అవసరం అయితే పేపర్‌లో యాడ్ వేస్తా.  
కాశీ: అక్క మాకు పెళ్లి చేసింది కదా ఇప్పుడు మేం అక్క కోసం ఏదో ఒకటి చేయాలి నాన్న. ఎవరు ఆపుతారో చూద్దాం.

దీప వంట చేస్తుంది. స్వప్న, కాశీ, దాసు ఇంటికి వస్తారు. అనసూయ, కాంచన వాళ్లుతో మాట్లాడుతారు. అంతా ఓకేనా అని కాశీ అడిగితే అనసూయ ఓకే కాదు అని గుడిలో జరిగిన గొడవ ఇంట్లో ఇంకా రేగుతుందని అంటుంది. ఇక స్వప్న కార్తీక్‌ని కాశీ స్వప్నని తీసుకొచ్చి పక్కపక్కన కూర్చొపెడతారు. ఇంతలో దాసుకి ఫోన్ వస్తే బయటకు వెళ్తాడు. దాసుకి ఓ వ్యక్తి కాల్ చేసి దాసు కోసం వెతుకుతున్న వ్యక్తి ముత్యాలమ్మ గూడెం అని చెప్తే అనసూయ విని మాదే అని చెప్పబోతే దాసు ఆపేస్తాడు. అనసూయకు చెప్పకూడదు అని కవర్ చేస్తాడు. కనీసం అతని పేరు అయినా తెలుసుకో అని చెప్తాడు. 

కాశీ:  పెళ్లి గురించి పది మందికి తెలియాలి కదా అందుకే రిసెప్షన్ పెట్టి బంధం గురించి అందరికీ తెలియాలి అనుకుంటున్నాం. ఏం అంటావ్ అక్క.
దీప: మంచి ఆలోచన మీ గురించి అందరికీ తెలియాలి కదా.
స్వప్న: వదినా రిసెప్షన్ మా గురించి కాదు మీ గురించి. మా గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుసు మీ గురించి ఇప్పుడు అందరికీ తెలియాలి. 
దీప: ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు.
స్వప్న: తెలియాలి వదినా అందరూ లేకపోతే నోటికొచ్చినట్లు వాగుతారు. మన వాళ్లే అంటారు. వాళ్ల నోరు మూయించాలి అంటే ఇలా చేయాల్సిందే. ఏం అంటావ్ అన్నయ్య.
కార్తీక్: ముందు షేక్ హ్యాండ్ ఇవ్వు. నా మనసులో ఉన్న క్లారిటీ లేని ఆలోచనలకు నువ్వు క్లారిటీ ఇచ్చావ్. అన్నయ్య మనసు తెలుసుకున్న స్వప్న అంటే నువ్వే స్వప్న. రైట్ టైంలో  మంచి సలహా ఇచ్చావ్.

ఇక కాశీ, స్వప్నలు తామే రిసెప్షన్‌  చేస్తామని అంటే కాంచన మేం చేస్తాం రా అంటే అవసరం అయితే మీ సాయం కోరుతా అత్తయ్య అని అంటాడు. ఇక దీప ఆయన పరువు తీయాలి అని నేను అనుకోవడం లేదు ఇది న్యాయంగా అనిపించుకోవడం లేదు అని అంటే దానికి కార్తీక్ నాకు అది అవమానం కాదు నా ఇష్టం నా బాధ్యత అని అంటాడు. స్వప్న వదినా అంటే నీతో అలా పిలుపించుకోవడమే నాకు ఇబ్బందిగా ఉంది ఇక మీ అన్నయ్యకి భార్యగా ఎలా అని అంటుంది. ఇక కార్తీక్ తనకు ఇష్టమని నీ ఇష్టం ఏంటో నీ ఇష్టమే అని అంటాడు. దాసు కూడా దీపని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ఎవరు చెప్పినా దీప వద్దని ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోతుంది. అందరూ దీపని ఎవరు ఒప్పిస్తారని అనుకుంటారు. అందరూ శౌర్య మీద ఆ బాధ్యత పెడతారు. నువ్వు అడిగితే కచ్చితంగా ఒప్పుకుంటుందని చెప్తారు. 

శివనారాయణ ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. ఇంతలో పారిజాతం ఫోన్‌కి రిసెప్షన్ ఇన్విటేషన్‌ని కాశీ పంపిస్తాడు. అది అందరికీ తెలిసిపోతుంది. మనం వాళ్లని వెలివేశాం కాబట్టి వాళ్లు నా అహం దెబ్బ తీసేలా చేస్తున్నారు అని ఇన్నాళ్లు అల్లుడు నా గుండె మీద తంతే కూతురు అంత కంటే పెద్దగా తన్నిందని ఈ రెసెప్షన్ జరిగితే మనం చాలా మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండండి అని శివనారాయణ చెప్పి తిన్న ప్లేట్‌లో కడిగేసి వెళ్లిపోతాడు. దశరథ్, జ్యోత్స్న అందరూ తిండి నుంచి లేచి వెళ్లిపోతారు. ఇక జ్యోత్స్న దీప అంతు చూస్తా అని వెళ్లబోతే పారిజాతం ఆపి రేపు దాని అంతు చూద్దువులే అని ఆపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read:  చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మా అన్నయ్యతో మహాసంగ్రామం.. మిత్రకు కరెంట్ షాక్ కొడుతుందా!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments