Homeవినోదంకార్తీకదీపం 2 సీరియల్: దీపకి కార్తీక్‌ ఫోన్ ఇచ్చాడని తెలుసుకున్న జ్యోత్స్న.. ఫుల్‌ మాస్‌గా...

కార్తీకదీపం 2 సీరియల్: దీపకి కార్తీక్‌ ఫోన్ ఇచ్చాడని తెలుసుకున్న జ్యోత్స్న.. ఫుల్‌ మాస్‌గా మార


Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ స్వప్నను తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంటే శౌర్య దీప ఫోన్ నుంచి కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది. కార్తీక్‌తో శౌర్య మాట్లాడటం ఫోన్ బాగుంది అని చెప్పడం జ్యోత్స్న వింటుంది. శౌర్య కార్తీక్‌తో ఫోన్‌లో మాట్లాడుతుందని కోపంతో అక్కడికి వెళ్తుంది. ఇంతలో దీప కూడా అక్కడికి వస్తుంది. కార్తీక్‌ ఫోన్‌లో నీకు మీ అమ్మకి ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి అని చెప్తాడు. అప్పుడు జ్యోత్స్న ఫోన్ తీసుకొని ఆ మాటలు వింటుంది. ఇక దీప కూడా శౌర్య ఎవరితో మాట్లాడుతుంది. ఆ ఫోన్ జ్యోత్స్న ఎందుకు తీసుకుందని అనుకుంటుంది. కార్తీక్ మాటలు విని జ్యోత్స్న నేను ఇది అస్సలు ఊహించలేదు బావ అని మనసులో అనుకుంటుంది. 

శౌర్య: జ్యో కార్తీక్ ఏమంటున్నాడు. అనగానే జ్యోత్స్న ఫోన్ ఇచ్చేస్తుంది.
దీప: మనసులో.. శౌర్య కార్తీక్‌బాబుకి ఎందుకు ఫోన్ చేసింది. అసలు ఇది ఫోన్ ఎందుకు ముట్టుకుంది. 
కార్తీక్: అడుగుతుంటే మాట్లాడవు ఏంటి రౌడీ. 
శౌర్య: ఏం మాట్లాడావ్.. ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది జ్యోతో. నాకు ఇప్పుడే ఫోన్ ఇచ్చింది.
కార్తీక్: కొన్ని విషయాలు ఎవరికి అయితే తెలియకపోతే బాగున్ను అనుకుంటామో వాళ్లకే తెలుస్తాయి. ఉన్న అనుమానాలు చాలవు అన్నట్లు ఇప్పుడు ఇదొక్కటి. ఇప్పటికే నా మీద కోపంగా ఉంది. మళ్లీ ఏం చేస్తుంది. రౌడీ నేను మళ్లీ కాల్ చేస్తా.
దీప: భోజనం చేద్దాం లోపలే కూర్చొ అన్నాకదా ఫోన్ ఎందుకు తీశావ్.
జ్యోత్స్న: శౌర్య ఇప్పుడు ఏం తప్పు చేసిందని ఇంతలా కోప్పడుతున్నావ్. దాని ఫ్రెండ్‌కి అది ఫోన్ చేసుకుంది. ఏం శౌర్య అంతేనా.. కొత్త ఫోనా.. అమ్మ కొనిందా.
శౌర్య: లేదు కార్తీక్ ఇచ్చాడు. 
దీప: కార్తీక్‌ బాబు ఇవ్వడం ఏంటి ఇది మనమే కొనుకున్నాం.
శౌర్య: అక్కడ నీకు కార్తీక్‌ ఫోన్ ఇవ్వడం నేను చూశాను అమ్మ. 
దీప: కానీ అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు కదా.
జ్యోత్స్న: మనలా పిల్లలు అబద్ధం చెప్పరు. ఏం చూస్తారో అదే చెప్తారు. ఫోన్‌లో కూడా విన్నాను. నిన్ను చేయి పట్టుకొని నేనే కదా ఇంట్లోకి తీసుకొచ్చాను. థ్యాంక్యూ సో మచ్. అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దీప శౌర్యని తిడుగుతుంది. తాను మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మధ్యలో దూరావని రా నీకు చూపిస్తా అని ఫోన్ బిల్ ఇస్తుంది. కార్తీక్‌ బాబు దగ్గర ఫోన్ కొనుకున్నా అని ఫ్రీగా తీసుకోలేదు అని కావాలి అంటే మీ ఫ్రెండ్‌ని వెళ్లి అడుగు అని అంటుంది. శౌర్య సారీ చెప్తుంది. జ్యోకి వెళ్లి చెప్తాను అని శౌర్య వెళ్తే దీప ఆపుతుంది. ఇప్పుడు ఏం చెప్పినా నమ్మరు అని దీప అనుకుంటుంది. చేయని తప్పునకు నేను మాటలు పడుతున్నాను అని దీప ఫీలవుతుంది.  

మరోవైపు సుమిత్ర కార్తీక్, జ్యోత్స్నల పెళ్లి విషయంలో పారిజాతం చేయించిన ప్రమాణం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దశరథ్ వచ్చి సుమిత్రని తన పిన్నిని ఏమీ అనొద్దు అంటాడు. సుమిత్ర మాత్రం తన కూతిరి విషయంలో ఆవిడ జోక్యం ఎందుకని అంటుంది. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమని పిల్లలు ఇద్దరికీ ఆ విషయం తెలుసని ఇప్పుడు ఇలా చేతిలో చేయి వేయించాల్సిన అవసరం ఏంటి అని దశరథ్‌ని అడుగుతుంది. దశరథ్ సుమిత్రని ఓదార్చుతాడు. జ్యోత్స్నని మాత్రం అత్తయ్యకి దూరంగా ఉంచాలి అని అంటుంది.

ఇక అనసూయ, నర్శింహతో మాట్లాడుతూ ఉంటుంది. దీపకు దూరంగా ఉండమని అంటుంది. దీప కనిపిస్తే చాలు భయంగా ఉందని అంటుంది. అనసూయ ఎంత చెప్పినా దీపని మాత్రం వదలను అని నర్శింహ అంటాడు. జ్యోత్స్న పారిజాతం దగ్గరకు వెళ్లి సీరియస్ అవుతుంది. దీపకి కార్తీక్ ఫోన్ కొనిచ్చాడు అని శౌర్య మాట్లాడిందని పారుతో జ్యోత్స్న చెప్తుంది. దీంతో పారిజాతం షాక్ అయిపోతుంది. కథ చాలా దూరం వెళ్లిందని అంటుంది. పారిజాతం కోపంతో దీప దుమ్ము దులుపుదాం పదా అంటుంది. జ్యోత్స్న వద్దని ఆపేస్తుంది. తన బావని తన ప్రేమని ఎగరేసుకుపోతాను అంటే చూస్తూ ఊరుకోను అని దీపకు మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తాను అని అంటుంది. జ్యోత్స్నలో ఫైర్‌ చూసి పారిజాతం బిత్తరపోతుంది. మాస్ క్లాస్‌ అని జ్యోత్స్న చెప్పే డైలాగ్స్ సూపర్‌గా ఉంటాయి. 

దీప హోటల్‌లో టిఫిన్స్ చేస్తుంటుంది. ఫోన్ చూసి జ్యోత్స్న మాటలు తలచుకొని బాధ పడుతుంది. జ్యోత్స్న మొదట్లో తనని ఎంత ప్రేమగా చూసుకుందో గుర్తు చేసుకుంటుంది. అక్క అని ప్రేమగా పిలిచే దానివి అని ఇప్పుడు నీకు శత్రువుని అయిపోయాను అని ఇదంతా ఆ పారిజాతం వల్లే అని అనుకుంటుంది. ఇక కార్తీక్ జ్యోత్స్నల ప్రామిస్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధానికి కార్తీక్ అంతలా ఇబ్బంది పడ్డాడు ఏంటి. వాళ్ల నాన్నలాగే కార్తీక్ మనసులో కూడా వేరే ఎవరు అయినా ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్‌లో టిఫిన్ ఆర్డర్ ఇవ్వడంతో దీప పట్టుకొని వెళ్తుంది. దీపకు నర్శింహ ఎదురవుతాడు. దీప దగ్గరకు నర్శింహ వస్తే దీప మళ్లీ తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్: సీత, రామ్‌ల ఫస్ట్‌నైట్ గురించి మాట్లాడిన విద్యాదేవి, మహా మీద పగ తీర్చుకొనే వరకు తగ్గేదేలేదట!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments