Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శ్రీధర్ కావేరి ఇంట్లో నుంచి బయల్దేరుతుండగా మళ్లీ ఎప్పుడు వస్తారు అని కావేరి అడుగుతుంది. దానికి శ్రీధర్ అన్ని తెలిసిన నువ్వు స్వప్నలా అలా అడగొద్దని అంటాడు. స్వప్నని చూస్తే ఎంత జాలేస్తుందో నిన్ను చూస్తే అంత కోపం వస్తుందని అంటాడు. బిజినెస్ పని మీద వెళ్లిన తనకు మళ్లీ ఎందుకు ఫోన్ చేయించావ్ అని ప్రశ్నిస్తాడు.
శ్రీధర్: నేను చెప్పింది అబద్ధం అని స్వప్నకు తెలీదు కానీ నీకు తెలుసు కదా. చేతిలో ఫోన్ ఉంది కదా అని డైల్ చేసి రమ్మన్న అంత ఈజీ కాదు నేను రావడం.
కావేరి: అంటే తప్పు నాదే అంటారా.
శ్రీధర్: కాదు మనద్దరిదీ. స్వప్నకి ఈ నిజం ఎప్పుడో చెప్పుండాల్సింది. స్వప్న వచ్చి సీరియస్‌గా చూస్తుంటే.. స్వప్న మొత్తం వినేసిందా ఏంటి. రామ్మా నీ గురించే అడుగుతున్నా నువ్వే వచ్చావ్.
స్వప్న: నాతో చెప్పాల్సిన నిజం ఏంటి. ఏదో ఒకరోజు అని నన్ను చూసి సగంలోనే ఎందుకు ఆపేశావ్.
కావేరి: మనసులో.. ఇప్పుడు ఈయన ఏం చెప్తారు.
శ్రీధర్: చెప్తానమ్మా.. నేను నీ దగ్గర ఓ నిజం దాచాను.
స్వప్న: మనసులో.. నిజంగానే డాడీ నిజం చెప్పబోతున్నారా. అదే జరిగితే నేను తట్టుకోలేను. డాడీని క్షమించలేను.
శ్రీధర్: ఇది ఎప్పటికైనా నీకు తెలియాల్సిందేనమ్మా. ఆవిషయం నేను చెప్పడం కంటే మీ అమ్మ చెప్తే బాగుంటుంది. మీ మమ్మీకి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేనే చెప్తా. నీకు ఓ మంచి సంబంధం చూశానమ్మ వాళ్లకి నువ్వు తెగ నచ్చేశావ్. ఇప్పుడు అమ్మాయికి చెప్పకపోయినా వాళ్లకు నేను మాట ఇచ్చాను కాబట్టి ఎప్పటికైనా చెప్పాలి అని నేను అన్నాను. సరే మరి నేను వెళ్తాను.
నర్శింహ: దీప ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంటే నర్శింహ అడ్డుకొని.. ఫంక్షన్‌కి నేను కూడా వచ్చాను దీప. నీ వెనకే కూర్చొన్నా. అది తండ్రి గురించి మాట్లాడుతుంటే నా మీద భయంతో ఎక్కడ చెప్పేశావో అనుకున్నా. నేనే స్టేజ్ మీదకు వెళ్తామని అనుకున్నా. కానీ చివరి వరకు ఉంటే అర్థమైంది దానికి నువ్వు ఎలా తయారు చేశావో.
దీప: దానికి నువ్వు తండ్రి అని చెప్తే అసహ్యించుకుంటుంది.
నర్శింహ: పోనీ ఆ కార్తీక్ పేరు చెప్పు ఆనంద పడుతుంది. అది ఎంత ఆనంద పడుతుందో తెలీదు కానీ నీ మనసులో కోరిక మాత్రం అదే.
దీప: నన్ను నాలాగే ఉండనివ్వు నీలా ఎక్కడ పడితే అక్కడ గొడవలకు దిగనివ్వకు. నా కూతురే నా బలం దాని కోసం చేతులు పట్టుకొని ప్రాధేయపడగలను. చేతులు విరిచేయగలను. సంబంధం లేని మనిషివి అలాగే ఉండు.
నర్శింహ: అప్పుడు అది నాకు పుట్టిన కూతురు కాదు అని ఒప్పుకో. నా కూతురు నీకు పుట్టలేదు అని ఒక్క మాట చెప్పు నీ జోలికి రాను. నా కూతురు అయితే నాకు ఇచ్చేయ్. అడిగి వెళ్లిపోతున్నా అని ఏమీ చేయను అనుకోకు.
దీప: నీకు నేను ఏం అన్యాయం చేశాను అని ఇంతలా చంపుకుతింటున్నావ్. నాకున్న ఒకే ఒక బంధం అది దాన్ని వదులుకోలేను.
నర్శింహ: దాని ఒంట్లో ఉంది నా రక్తమే అయితే దాన్ని నాకు ఇచ్చేయ్. అవును నువ్వు ఇంటికా టిఫెన్ సెంటర్‌కా టిఫెన్ సెంటర్‌కి అయితే నిన్ను దింపేద్దామని, అయినా కార్తీక్ కారులోనే కదా నా కారులోనూ ఏసీ ఉంది. అయినా నీకు ఓ రేంజ్ ఉంది కదా అలాంటి నువ్వు రిచ్ కార్లు ఎక్కుతావు కానీ నా కారు ఎందుకు ఎక్కుతావు. చిన్నప్పుడు నేను పడుకోకపోతే మా అమ్మ బూచోడు వస్తాడు అనేది. ఆ బూచిని చూడాలి అని నేను నిద్రపోయే వాడినే కాదు. తర్వాత అర్థమైంది ఆ బూచి నేనే అని. నువ్వు కూడా నీ కూతురికి ఇలాంటి కథలే చెప్తావు కదా. బూచోడు వస్తాడు అని కానీ ఈ సారి నిద్ర పోయినా బూచోడు వస్తాడు. బూచోడు మంచోడు కాదు అని చెప్పు. పాప జాగ్రత్త..
నర్శింహ మాటలకు దీప ఏడుస్తుంది. కార్తీక్‌ని కాంచన, శ్రీధర్‌లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడుగుతారు. కార్తీక్ ఈ రోజు మీకు నా పెళ్లి గురించి ఓ క్లారిటీ ఇస్తాను అని చెప్తాడు. అందుకు రెస్టారెంట్‌కి వెళ్దామని అంటాడు. మరోవైపు శౌర్య డల్‌గా కూర్చొని ఉంటుంది. దీప శౌర్య దగ్గరకు వచ్చి కూర్చొని బుజ్జగిస్తుంది. వారం రోజులు స్కూల్‌కి వెళ్లొద్దని చెప్తుంది. తనకి చెప్పకుండా ఎక్కడికీ వెళ్లొద్దని అమ్మమ్మ ఇంటికి కూడా వెళ్లొద్దని దీప అంటుంది. దానికి కార్తీక్ ఎందుకు అని ఎంట్రీ ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
మరిన్ని చూడండి