Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode శౌర్యని తీసుకొని దీప హాస్పిటల్‌కి వెళ్తుంది. డాక్టర్లు కార్తీక్‌ని స్పృహ నుంచి లేపడానికి ప్రయత్నిస్తారు. కార్తీక్ లేవకపోవడంతో బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు వచ్చి పిలవమని మీ గొంతు వింటే లేస్తాడేమో అని అంటారు. అందరూ వచ్చి కార్తీక్‌ని లేపుతారు. ఏడుస్తారు. జ్యోత్స్న కూడా బావ నిన్నూ ఇలా చూడటం నా వల్ల కావడం లేదు బావ నా కోసం లే అంటూ ఏడుస్తుంది. అయినా ప్రయోజనం ఉండదు. ఇక డాక్టర్ మరోసారి కార్తీక్‌ని చెక్ చేసి కోమాలోకి వెళ్లిపోతున్నాడు అని అంటారు.
కార్తీక్‌కి ఇక పిలిచినా వినిపించదని 99 శాతం కోమాలోకి వెళ్లిపోయాడని చెప్తారు. ఇక కార్తీక్ స్పృహలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్తాడు. అందరూ గట్టిగా ఏడుస్తారు. జ్యోత్స్న ఏడుస్తూ అక్కడుండలేక బయటకు వెళ్లిపోతుంది. అక్కడికి పారిజాతం వస్తుంది.
పారిజాతం: ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్నదేనే. మనుషుల జీవితాలు మారిపోయేది హాస్పిటల్‌లోనేనే. ఒకప్పుడు స్వార్థంతో నేను చేసిన పాపం నీకు శాపం అయింది. చాలా కలలు కన్నాను ఆ కలలు అన్నీ కలలుగానే మిగిలిపోతున్నాయే.
జ్యోత్స్న: నువ్వు అలా అనొద్దు గ్రానీ. ఎందుకంటే నేను ఎవరికి పుట్టాలో నేను అనుకోలేదు. ఎవరి దగ్గర పెరగాలో అని నేను అనుకోలేదు. నా జీవితంలో నేను ఏదైనా అనుకున్నది ఉంది అంటే అది బావని పెళ్లి చేసుకోవడమే. దీప మీద నాకు ఉన్న కోపం ఎంత నిజమో బావ మీద నాకు ఉన్న ప్రేమ అంతే నిజం. బావకి ఏమైనా జరిగింది అంటే అంతకు ముందు నేను చచ్చిపోతాను.
పారిజాతం: 99 శాతం చాన్స్ లేదు అని డాక్టర్లు చెప్తున్నారు కదే.
జ్యోత్స్న: 1 శాతం ఉంది కదా గ్రానీ ఆ ఒక్క శాతం బావని నా కోసం బతికించడానికి ఏదైనా అద్భుతం జరగొచ్చు కదా.
పారిజాతం: అద్భుతం జరగాలి అంటే ఆ దేవుడే ఎవరో ఒకర్ని పంపాలి.
శౌర్య కార్తీక్ కార్తీక్ అని పరుగున వస్తుంది. కార్తీక్ దగ్గరకు వెళ్తానని శౌర్య అంటుంది. మీ వల్లే ఈ పరిస్థితి కార్తీక్‌కి వచ్చిందని ఇక కార్తీక్ మీద ఆశలు వదులుకోవాలని పారిజాతం అంటూ శౌర్యని వెళ్లనివ్వకుండా పట్టుకుంటే శౌర్య పారిజాతం చేయి కొరికి కార్తీక్ దగ్గరకు పరుగులు తీస్తుంది. కార్తీక్ లే ఏమైంది కార్తీక్ అంటూ కార్తీక్ చేయి పట్టుకొని ఏడుస్తుంది. ఇక డాక్టర్ శౌర్యతో నీ పిలుపు వినగానే అతనిలో కదలిక వచ్చిందని నువ్వు మాత్రమే పిలువు అని శౌర్యతో చెప్తాడు. దాంతో శౌర్య కార్తీక్ నాతో మాట్లాడు మనం ఇంటికి వెళ్లిపోదాం లే కార్తీక్ అని పిలిచి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు చూడకపోతే నీతో నా ఫ్రెండ్ షిప్ కట్ అని శౌర్య అనగానే కార్తీక్ కళ్లు తెరుస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు. కార్తీక్ కోమా నుంచి తేరుకోవడానికి శౌర్యనే కారణం అని డాక్టర్ అంటాడు.
కార్తీక్‌ని తీసుకొని ఇంటికి వస్తారు. రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే లేచి నడుస్తావని సుమిత్ర ధైర్యం చెప్తుంది. దానికి కార్తీక్ మీరంతా నా దగ్గర ఇలా ఏడుస్తూ జాలిగా ఉంటే రెండు నెలలు అయినా నేను కోలుకోలేనని అంటాడు. తాను తొందరగా కోలుకోవాలి అంటే మీరంతా ముందు ఇంటికి వెళ్లిపోండి అని తనని చూడటానికి ఎవరూ రావొద్దని కోలుకున్న తర్వాత నేనే వస్తాను అని అంటాడు. కార్తీక్ కోసం అందరూ వెళ్లిపోతారు. నేను వెళ్లను అని జ్యోత్స్న అంటుంది. నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వస్తాను అని అంటుంది.
కార్తీక్‌కి స్వప్న ఫోన్ చేస్తుంది. నీ అడ్రస్ చెప్పు నీకు ప్రమాదం జరిగిందని వస్తాను అని అంటాడు. స్వప్న వస్తాను అంటే కార్తీక్ వద్దని అంటే ఇద్దరి తండ్రి ఒకరే అని తెలిసిపోతుందని అనుకొని రావొద్దని అంటాడు. తానే కోలుకున్నాక వస్తాను అంటే మీ ఇంటికి వచ్చే అర్హత నాకు లేదా అని ఫీలవుతుంది. దీప కూడా విషయం చెప్పి రావొద్దని అందని చెప్తుంది. దాంతో స్వప్న ఫీలవుతుంది. త్వరగా కోలుకుంటే కలుద్దామని అంటుంది. జ్యోత్స్న ఇంటి దగ్గర కార్తీక్, దీపల మాటలు తలచుకొని బాధ పడుతుంది. బావ అడ్డుపడకుండా ఉంటే తన అడ్డు తొలగిపోయేది అని అనుకుంటుంది. ఇక పారు వచ్చి బాధ పడకు కార్తీక్ దగ్గరకు వెళ్దామని అంటుంది.
జ్యోత్స్న సుమిత్ర, దశరథ్‌ల దగ్గరకు వెళ్తే గ్రానీ కొడుకుని బాబాయ్ అని పిలిస్తే తాతయ్య ఎందుకు తిట్టాడని అడుగుతుంది. దానికి సుమిత్ర ఏదో తప్పు చేశాడని అంటుంది. దాంతో జ్యోత్స్న తప్పు చేసిన వాళ్లకి ఈ ఇంట్లో స్థానం లేదు. దీప వల్లే ఇంత ప్రమాదం జరిగితే అయినా ఇంకా ఎందుకు తనని పంపించడం లేదని అడుగుతుంది. ఇక పారిజాతం నీ మేనల్లుడు చావు అంచుల వరకు వెళ్లి వచ్చినా నీకు అవసరం లేదు అని కార్తీక్‌కి ఏమైనా అయితే నీ కూతురు ప్రాణాలు తీసుకునేదని ఈ గోల అంతా పెళ్లి ఆగిపోయిందని అంటున్నాం అని మీరు అనుకుంటున్నారు కానీ దీప వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఎవరికీ మనస్శాంతి లేదని ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అంటుంది. ఎందుకు గొడవ చేస్తున్నారు అని సుమిత్ర అడిగితే జ్యోత్స్న తనని పోలీసులు అరెస్ట్ చేయడం ఎవరి వల్ల నిశ్చితార్థం ఆగిపోవడం ఎవరి వల్ల అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
మరిన్ని చూడండి