Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode దీప దగ్గరకు ఎందుకు వెళ్లావని దీప కార్తీక్ భార్య నువ్వు కార్తీక్‌ని కోరుకోవడం తప్పుని సుమిత్ర కూతురు జ్యోత్స్నతో చెప్తుంది. ఇక సుమత్రి పారిజాతానికి రెండు చేతులు పెట్టి దండం పెట్టి నా కూతుర్ని నాకు వదిలేయండి ఇది జరగదు అని జ్యోత్స్నకి సర్ది చెప్పండని అంటుంది. ఇక సుమత్ర తన కూతుర్ని కాపాడుకోవాలి అంటే ఎవరితో మాట్లాడాలి అని అనుకుంటుంది.
ఇక దీప ఇంట్లోకి వస్తే కాంచన ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. జ్యోత్స్న గురించి చెప్పకుండా దీప బయటకు వెళ్లానని చెప్తుంది. ఇక అనసూయ దీప ఫంక్షన్ గురించి ఏం మాట్లాడటం లేదని అంటుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. డాక్టర్ శౌర్యని జాగ్రత్తగా చూసుకోమన్నాడని చెప్తాడు. ఈనిజం ముగ్గురి మధ్యే ఉండాలి అంటాడు.
కాంచన: దీప చెప్పింది నిజమేరా నీ రిసెప్షన్ జరగదు. కొన్ని వాస్తవాలు మనం కూడా అర్థం చేసుకోవాలి. రిసెప్షన్ పెట్టి అందర్ని పిలుస్తే వస్తారు. కానీ వచ్చిన వాళ్లు అంతా నీ తండ్రి గురించి అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు. నన్ను అడిగితే నేను ఏం చెప్తా. పోని ఫంక్షన్ చేస్తున్న స్వప్నని అడిగితే తను ఏం చెప్తుంది.
దీప: ఇన్నీ ఆలోచించే నేను వద్దన్నా.
కార్తీక్: ఆ మనిషి రావాలని నువ్వు అనుకుంటే నేను వెళ్లి పిలుస్తాను.
స్వప్న: అప్పుడే కాశీ స్వప్న వస్తూ.. అవసరం లేదు అన్నయ్య మీరు ఎవరూ వెళ్లొద్దు. మీరు ఎవరూ వెళ్లకుండా ఆయన వస్తారు నేను పిలుస్తాను. ఆయనకు ఒక కూతురు ఉంది కొడుకు ఉన్నాడు. ఇద్దరి పెళ్లి చూడలేదు. ఈ రిసెప్షన్ ఆగదు వదినా ఎందుకంటే నీ మరదలు పంతానికి పౌరుషానికి సవాలు ఇది. కొంతమంది నోర్లు మూయించాలి. దాని కోసం నేను ఒక మెట్టు దిగుతా. నేను వెళ్లి డాడీని రిసెప్షన్‌ని పిలుస్తాను. కాశీ నువ్వు రావొద్దు నువ్వు వస్తే ఏదో ఒకటి అంటారు.
కాశీ: నేను వస్తాను స్వప్న మీ డాడీ తిడితే తిట్టని మా అక్క కోసం నేను నాలుగు మాటలు పడతాను.
కావేరి శ్రీధర్‌తో స్వప్న ఇంటికి తీసుకెళ్లమని తనకు బంగారు గొలుసు ఇస్తానని అల్లుడిని పిలిచి పదహారు రోజుల పండగ చేస్తానని అంటుంది. దాంతో శ్రీధర్ ఆ పని మనిషి కొడుకుని ఇంటి గుమ్మం తొక్కనివ్వను అంటాడు. ఇంతలో కాశీ, స్వప్నలు ఇంటికి వస్తారు. శ్రీధర్ వాళ్లని లోపలికి రానివ్వకపోతే కావేరి రమ్మని అంటుంది. ఇద్దరూ పిలిస్తేనే వస్తానని అంటుంది స్వప్న. ఇక కాశీ అందరూ మామయ్యని ఎందుకు ఇబ్బంది పెడతారు అని అంటే నువ్వు నాకు సపోర్ట్ చేయకురా అంటాడు. గుమ్మం బయటే నిల్చొని మాట్లాడుతారు. ఇక కాశీ మామయ్యని ఏం అనొద్దు అని అంటే దయచేసి నువ్వు జాలి చూపించకురా అని తల పట్టుకుంటాడు. ఇక కావేరి ఇద్దరినీ లోపలికి పిలుస్తుంది. ఇద్దరూ లోపలికి వస్తారు.
మంచి అల్లుడు, మంచి కోడలు భలే దొరికారురా నా కొడుకు కోడలికి అని అంటాడు. ఇక స్వప్న అన్నయ్య, వదినలకు రిసెప్షన్ చేస్తున్నాం మమ్మీ నువ్వు డాడీని తీసుకొని రా అని అంటుంది. భర్తని వద్దన్న భార్య కొడుకు కోసం పిలుస్తుంది. తండ్రిని కాదన్న కూతురు అన్నావదిన కోసం పిలుస్తుంది. నన్ను వెలివేస్తారు కానీ అన్నింటికీ నేను కావాలి అని అంటాడు. కావేరి కూతురికి నెక్లెస్ ఇస్తే స్వప్న ఫంక్షన్‌కి వచ్చినప్పుడు తీసుకురమ్మని అంటుంది. చచ్చినా వెళ్లను అని శ్రీధర్ అనుకుంటాడు. కాంచన సుమిత్రకి కాల్ చేస్తుంది. సుమిత్ర ఏడుస్తుంది. పిల్లలు ఏ తప్పు చేయలేదు అని నీ మీదే నాకు కోపం ఉందని సుమిత్ర అంటుంది. కాంచన షాక్ అయిపోతుంది. పిల్లల జీవితం మీద మన పెత్తనం ఏంటి. ఎందుకు మాట తీసుకున్నావని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: ‘త్రినయని’ సీరియల్: విశాలే తనకు కాబోయే భర్త అని ఫిక్స్ అయిపోయిన త్రినేత్రి.. బ్రేక్ ఫెయిల్!
మరిన్ని చూడండి