Karthika Deepam Idi Nava Vasantham Serial Episode జ్యోత్స్న ఇళ్లంతా చూస్తూ బయటకు వచ్చి చూస్తూ ఈ ఇళ్లు నాదే అని అనుకుంటుంది. ఇంతలో దీప అటుగా వస్తే ఇద్దరూ ఒకర్ని ఒకరు గుద్దుకుంటారు. ఏమైందని ఎందుకు వెనక నుంచి నడుచుకుంటూ వస్తున్నావ్ అని దీప జ్యోత్స్నని అడిగితే నా ఇళ్లు నా ఇష్టం అని నువ్వే అడ్డుగా వచ్చావ్ అని జ్యోత్స్న అంటుంది.
దీప: నేను కరెక్ట్ గానే వచ్చాను నువ్వే అడ్డుగా నా ప్లేస్‌లోకి వచ్చేవ్.
జ్యోత్స్న: మనసులో నేను నీ ప్లేస్‌లోకి కాదే ఈ ఇంటికి వారసురాలిగా వచ్చావు.
దీప: ఏమైంది దీప ఎందుకో టెన్షన్ పడుతున్నావు.
జ్యోత్స్న: నేను ఎందుకు టెన్షన్ పడతాను నాకు ఏమైంది.
దీప: కార్తీక్ బాబు పెళ్లికి ముహూర్తాలు పెట్టించమన్నా ఇంకా ఏం పట్టించుకోవడం లేదు అని ఆలోచిస్తున్నావా.
జ్యోత్స్న: మనసులో నువ్వు గ్రేట్ దీప ముందు నేను ఈ ఇంటి వారసురాలు కాదు అనే విషయం కాకుండా బావతో నా పెళ్లి గురించి ఆలోచించాలి.
జ్యోత్స్న: దీపని వెళ్లిపోమని.. దీప ఎందుకు బావ గురించి గుర్తు చేసింది అలా చేసింది అంటే నాకు ఏదో ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిందని అర్థం. నాకు తెలీకుండా ఏమైనా జరుగుతుందా.
దీప: స్వప్న నువ్వు ఎప్పుడు వచ్చావ్. వెంటనే మాట్లాడాలి అన్నావ్ ఏమైంది.
స్వప్న: అన్నయ్య కూడా వస్తాడు అప్పుడు చెప్తా.
జ్యోత్స్న: నేను ఈ ఇంటి వారసురాలు కాదని బావకి తెలిస్తే అప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాడా కచ్చితంగా చేసుకోడు. అప్పుడు ఎవర్ని చేసుకుంటాడు. దీపనా.. నేను ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. నేనే ఏదో ఒకటి చేసి బావతో మూడు ముళ్లు వేయించుకోవాలి నేనే కాస్త తగ్గి ఉండాలి.
ఇంతలో కార్తీక్ వస్తాడు. జ్యోత్స్న ఎదురెళ్లాలి అని అంటాడు. కార్తీక్ కూడా దీప ఇంటికి వెళ్తాడు. స్వప్న మీద కోప్పడతాడు. ఇంట్లో గొడవ పెట్టుకున్నట్లు కాదని అంటాడు. కాశీ ఎవరో చెప్పడానికి నా దగ్గర ఇప్పుడు సమాధానం ఉందని ఇప్పుడు నువ్వు నిజంగానే నాకు అన్నయ్యవని స్వప్న అంటుంది. ఆ మాటలకు దీప కార్తీక్‌లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. దీప నిజం చెప్పేసిందేమో అని కార్తీక్ అనుకునేలోపు కాశీకి నువ్వు బావ అయితే నాకు అన్నయ్యే కదా అని అంటుంది. ఇక స్వప్న కార్తీక్, దీపలను తన తండ్రితో మాట్లాడమని చెప్తుంది.
కార్తీక్: కాశీ మా రిలేటివ్ అని నువ్వు మీ నాన్నతో చెప్పకూడదు.
స్వప్న: మీరు ఇంకా లేటు చేస్తే లేచి పోయి పెళ్లి చేసుకోవడం తప్ప నాకు ఇంకో దారి లేదు.
కార్తీక్: (జ్యోత్స్న అప్పుడే వచ్చి చాటుగా మాటలు వింటుంది) ఈ పెళ్లి మనం అనుకున్నంత ఈజీగా జరగదు. అల్రెడీ ఇంట్లో పెళ్లి మాటలు అయ్యాయి. నువ్వు కోరుకున్నట్లే ఈ పెళ్లి జరుగుతుంది. ఏం చేయాలో నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు.
దీప: ఆలోచించుకునేంత టైం ఎక్కడుంది బాబు.
జ్యోత్స్న: స్వప్న ఉందన్న విషయం జ్యోకి తెలీదు. దీప కార్తీక్‌లు తమ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారని అనుకుంటుంది. వీళ్లేంటి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. మరి ఇంతకు తెగించారు ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి. ఇప్పుడు గొడవ పడితే వాళ్లు రెచ్చిపోతారు కదా. దీప నువ్వు ఇంత పెద్ద సైలెంట్ కిల్లర్‌వి అనుకోలేదు.
కార్తీక్: ఇన్నాళ్లు మన మధ్య దూరం ఎంతో తెలీదు కానీ ఇప్పుడు నువ్వు నా సొంత మనిషివి ఎవరు ఎన్ననుకున్నా సరే ఈ పెళ్లి నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది.
జ్యోత్స్న: దీప గుండెల్లో గుచ్చావ్ కదే. నేను తొందర పడకపోతే ఇక నా జీవితం అయిపోయినట్లే.
స్వప్న: నాకు ఇప్పుడు మీరు తప్ప మరెవరూ లేరు. ఒకటి కాశీతో పెళ్లి రెండు చావు ఈ రెండు తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అర్థం చేసుకోండి.
కార్తీక్: ఏం చేయాలో అర్థం కావడం లేదు దీప. కాశీ ఎవరో తెలిసే మా నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తుంది. లేదంటే కూతురి ఇష్టం విషయంలో ఎందుకు ఇలా ఉంటారు. ఇవన్నీ మీరు ఆలోచించొద్దు దీప మీకు ఉన్న సమస్యలు చాలు ఇది నేను చూసుకుంటానులెండీ.
దీప: మనసులో మీరు నాకు అంత సాయం చేస్తే నేను మిమల్ని ఎలా వదిలేస్తా కార్తీక్ బాబు. మీ అమ్మ గారు నాకు కూడా బాధ్యతే.
పారిజాతం తన భర్తకి కాఫీ ఇస్తుంది. పారిజాతం ముఖానికి నలుపు రంగు అంటి ఉంటే అది చూసి శివనారాయణ ఏమైందని అడుగుతాడు. దానికి పారిజాతం మనసులో ఇదేంటో తెలిస్తే నన్ను ఛీ కొడతావ్ అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్.. శౌర్య కొత్త సైకిల్ తొక్కుతూ బయట ఉన్న పారిజాతం దగ్గరకు వస్తుంది. కొత్త సైకిల్ అని ఆడుకుందామని అంటుంది. ఇక పాప తన తల్లిని పిలుస్తానని సైకిల్ అక్కడ పెట్టి వెళ్తే పారిజాతం సైకిల్ బ్రేక్ తీసేస్తుంది. ఆ బ్రేక్ ఆయిల్ ముఖానికి రాసుకున్నానని అనుకుంటుంది. ఇక పారిజాతం బయట కాఫీ తాగుతుంటే శౌర్య బ్రేక్ పడక పారుని గుద్దేస్తుంది. పారిజాతం శౌర్యని తిడుతుంది. ఇక శివనారాయణ బయటకు వస్తే జరిగింది శౌర్య చెప్తుంది. కొత్త సైకిల్ బ్రేక్ ఎందుకు పట్టదని ఆయన చూసి బోల్ట్ తీసేశారని పారిజాతంతో బోల్ట్ పెట్టమని అంటాడు. ఇష్టమొచ్చినట్లు తిడతాడు. మొత్తం వెతికి పారు సైకిల్కి బోల్ట్ పెడుతుంది. మరోవైపు జ్యోత్స్న ఏం చేస్తే బావని పెళ్లి చేసుకుంటాడని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో గేటు సౌండ్ అవడం విని నర్శింహని చూస్తుంది. నర్శింహ దీప ఇంటికి వచ్చి అత్తాకోడళ్లని చూసి నా చేతిలో చచ్చారని అనుకొని వాళ్లదగ్గరకు వెళ్తాడు.
నర్శింహని వెళ్లిపోమని దీప, అనసూయ అంటారు. నర్శింహ మాత్రం డబ్బులు అడుగుతాడు. శోభ తనని వదిలేసిందని అంటాడు. దీపని పెళ్లి చేసుకొని నష్టపోయానని నష్టపరిహారంగా డబ్బులు అడుగుతాడు. ఇళ్లు తన పేరు మీద రాసి డబ్బు అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
మరిన్ని చూడండి