Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కాంచన, కార్తీక్ ఇంటికి రావడంతో సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం చాలా సంతోషిస్తారు. సుమిత్ర పాపని అమ్మవారిగా రెడీ చేసి కుర్చీ మీద కూర్చొపెట్టి పూజ చేస్తుంది. దీప, సుమిత్ర పాప కాళ్లు కడిగి పసుకు రాసి అమ్మవారిలా కొలుస్తారు. మరోవైపు శివనారాయణ, దశరథ్ ఇంటికి వస్తుంటారు. పూజ తర్వాత పెళ్లి గురించి మాట్లాడమని జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతుంది. ఇక ఇంతలో దశరథ్ వాళ్లు రావడంతో అందరూ ఒకర్ని ఒకరు చూసుకొని షాక్ అయిపోతారు.
అమ్మవారి పూజ జరుగుతుంది అని దశరథ్ చెప్తే దానికి శివనారాయణ పూజ ఆపాల్సిన అవసరం లేదు ముందు పూజ చేయండి తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. అనసూయ దీపతో వీళ్లని పిలిచింది నువ్వు అని అంటే అప్పుడు నీ పని ఉంటుందని అంటుంది. అందరూ శౌర్యకు పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకుంటారు. అందరూ ఇంట్లో ఏం గొడవ జరగకుండా చూడు అని అమ్మవారికి దండం పెట్టుకుంటారు. పూజ అయిపోయిందని అని చెప్పి అందర్ని ఆశీర్వాదం తీసుకోమని జ్యోత్స్న అంటుంది. అందరూ జంటలుగా ఆశీర్వాదం తీసుకోవాలి అంటే ఇక్కడ కొందరు జంట లేకుండా ఉన్నారని పెద్దాయన కాంచనను ఉద్దేశించి అంటారు. ఇక జ్యోత్స్న కార్తీక్ పక్కన నిల్చొని మనం జంటగా ఆశీర్వాదం తీసుకుందామని అంటుంది. మనకి పెళ్లి అవ్వలేదు తాతయ్య చూస్తే బాగోదని కార్తీక్ చెప్పిన జ్యోత్స్న వినకుండా కార్తీక్ చేయి పట్టుకుంటుంది.
శివనారాయణ: ఈ ఇంట్లో అమ్మవారి పూజ జరిగింది ఎవరూ ఇంట్లో కంట తడి పెట్టడం మంచింది కాదు. దీప పాపని అత్తతో ఇంటికి పంపేస్తుంది. దిష్టి తీసి నగలు తీసేయ్ మంటుంది. పాప ఉయ్యాల్లో ఊగుతుంటుంది. ఇక శివనారాయణని కాంచన నాన్న అని పిలిస్తే ఇంకేం మాట్లాడొద్దు అంటాడు.
శివనారాయణ: అమ్మా సుమిత్ర నీకు ఓ శుభవార్త జ్యోత్స్నకి పెళ్లి సంబంధం కుదిరింది. అన్ని విషయాలు మాట్లాడాం ఎక్కడా మచ్చ లేని గౌరవమైన కుటుంబం అది. వాళ్లు తొందరలోనే మన ఇంటికి వస్తారు. మనవరాలిని పెళ్లి చూపులకు సిద్ధంగా ఉండమని చెప్పు.
దశరథ్: అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం నాన్న మాటే నా మాట.
కార్తీక్: పదమ్మా మనకి ఒక ఇళ్లు ఉంది మనకు గౌరవం ఉంది మనిషి తప్పు చేస్తే వంశాన్నే వెలేస్తారా. మచ్చ లేని గౌరవమైన కుటుంబం అంట.
కాంచన: నువ్వేం బాధ పడకు వదినా నాన్నని ఏం అనకు.
జ్యోత్స్న: మమ్మీ నేను బావని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోను వెళ్లి డాడీతో చెప్పు.
పారిజాతం: ముసలోడు మొత్తం నాశనం చేశాడు.
దీప: తప్పు నాదే అమ్మ మిమల్ని కలపాలి అని ఓ ప్రయత్నం చేశా.
సుమిత్ర: నువ్వు వెళ్లు దీప తర్వాత మాట్లాడుకుందాం.
అనసూయ దిష్టి తీయడానికి పళ్లెం తీసుకొని వస్తుంది. శౌర్య కనిపించదు. దీపతో అనసూయ విషయం చెప్తుంది. బయట పూల దండ పడి ఉండటం చూసిన దీప కంగారు పడుతుంది. అత్తని పిలిచి శౌర్యని నర్శింహ తీసుకెళ్లిపోయాడా ఏంటి అని అడుగుతుంది. ఏదో జరిగింది అని దీప కంగారు పడుతుంది. అనసూయ దీప ఇద్దరూ పాప కోసం వెతుకుతారు. నర్శింహ పాపని ఎత్తుకొని పారిపోతాడు. పాప వదలమని చెప్తే నర్శింహ వదలడు దీప వాళ్లు కూడా పాపని వెతుకుతుంటారు. ఒక శౌర్య నర్శింహని కొరికేసి పారిపోయి దాక్కుంటుంది. ఇక నర్శింహ పాపని చూసేస్తాడు. దీప, అనసూయ కూడా అక్కడికి వస్తారు. పాపని దీప తీసుకుంటుంది. ముగ్గురి మధ్య కొట్లాట జరుగుతుంది. నన్నే వద్దనుకున్నావ్ నా తాళి ఎందుకు అని నర్శింహదీప మెడలో తాళి తెంపేస్తాడు. తాళిని తీసుకెళ్లి అగ్నిలో పడేస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
మరిన్ని చూడండి