Homeవినోదంకాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ - Indian 2 ఆడియో లాంచ్‌లో చందమామ పాత్రపై...

కాజల్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన శంకర్ – Indian 2 ఆడియో లాంచ్‌లో చందమామ పాత్రపై క్లారిటీ


Kajal Aggarwal Role In Indian 2 Movie: తెలుగు తెర చందమామ, క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ అభిమానులకు లెజెండరీ ఫిల్మ్ మేకర్ శంకర్ పెద్ద షాక్ ఇచ్చారు. ఆ షాక్ మామూలుగా లేదు. శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాల్లో ‘ఇండియన్ 2’ ఒకటి. జూలై 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే… అందులో కాజల్ మాత్రం మీకు కనిపించదు. అవును… మీరు చదివింది నిజమే! పూర్తి వివరాల్లోకి వెళితే…

‘ఇండియన్ 2’లో కాదు… మూడో సినిమాలో!
Kajal Aggarwal will be seen in Indian 3: ‘ఇండియన్ 2’ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ యాక్ట్  చేస్తున్నట్లు తెలిపారు. తొలుత ఒక్క సినిమా అనుకున్నారు. ఆ తర్వాత డెసిషన్ మారింది. ముందు అనుకున్న కథను రెండు భాగాలుగా తీయాలని శంకర్ అండ్ టీమ్ అనుకుంది. దాంతో కాజల్ క్యారెక్టర్ ‘ఇండియన్ 3’లోకి వెళ్లింది. అదీ సంగతి. ‘ఇండియన్ 2’లో కాజల్ ఉండదని, మూడో పార్ట్ (Indian 3 Movie)లో ఉంటుందని శంకర్ తెలిపారు.

‘ఇండియన్ 2’లో తన క్యారెక్టర్ లేనప్పటికీ… చెన్నైలో జరిగిన ఆడియో వేడుకకు కాజల్ అగర్వాల్ అటెండ్ అయ్యారు. అంటే… సినిమాలో ఆవిడ కూడా ఒక పార్ట్ కదా! అందుకని, వైట్ అండ్ వైట్ డ్రస్సులో సందడి చేశారు. ‘ఇండియన్ 2’ కంటే ముందు ‘సత్యభామ’ సినిమాతో కాజల్ సందడి చేయనున్నారు. జూన్ 7న ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.


Indian 2 Movie Actress: కాజల్ అగర్వాల్ లేనప్పుడు ‘ఇండియన్ 2’లో హీరోయిన్ ఎవరు? అసలు ఎవరూ లేరా? అంటే… ఒకరు ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ‘ఇండియన్ 2’లో యాక్ట్ చేశారు. అయితే… కమల్ హాసన్ జోడీగా కాదు. సిద్ధార్థ్ సరసన ఆవిడ నటించారు. వాళ్లిద్దరి మధ్య చేసిన పాట ఇటీవల విడుదలైంది. దానికి మంచి స్పందన లభిస్తోంది.

Also Read: కాజల్‌ తో నవీన్ చంద్ర లవ్లీ రొమాంటిక్ సాంగ్ – సత్యభామ సరసం చూడండి


‘ఇండియన్ 3’ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్!
Indian 3 Movie Shooting Update: ‘ఇండియన్ 2’తో పాటు ‘ఇండియన్ 3’ షూటింగ్ దాదాపుగా పూర్తి చేశామని దర్శకుడు శంకర్ తెలిపారు. ముందుగా ఈ సినిమాను వేరే నిర్మాతతో చేయాలని అనుకున్నానని, తనకు ఈ సినిమా చేయాలని ఉన్నట్టు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ చెప్పడంతో ఆయనకు సినిమా చేశానని కూడా పేర్కొన్నారు. సుభాస్కరన్ లేకుండా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాలు ఊహించలేమని చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఆయన వరుస విజయాల్లో ఉండటం, కమల్ ‘విక్రమ్’కు అందించిన సంగీతానికి మంచి పేరు రావడంతో హిట్ కాంబినేషన్ అని ముద్ర పడింది.

Also Read: ‘సత్యభామ’ సినిమాలో ఆ యాప్ ప్రత్యేకతను చూపించాం – డీసీపీ సృజన కర్ణంతో కాజల్ స్పెషల్ ఇంటర్వ్యూ

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments