Homeవినోదంకష్టాల్లో ఉండే స్నేహితుడి కోసం నిలబడే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్‌ - నిర్మాత బన్నీవాసు...

కష్టాల్లో ఉండే స్నేహితుడి కోసం నిలబడే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్‌ – నిర్మాత బన్నీవాసు ఎమోషనల్‌


Bun Vasu Comments on Allu Arjun: స్నేహితుడికి అవసరం ఉందంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా ఉండే వ్యక్తి అల్లు అర్జున్‌పై అని నిర్మాత బన్నీవాసు అన్నారు. ఆయ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బన్నీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతూ ఆయన ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. “నాకు ఒకటే ధైర్యం ఎప్పుడూ. నా లైఫ్‌లో ఒకరు ఉన్నారు. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా.. ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉందంటే మాత్రం ఆయన వచ్చి నిలబడతారు.

నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరే ఇద్దరు నన్ను గుర్తుపట్టేస్తారు. ఒకరు మా అమ్మ. రెండో వ్యక్తి అల్లు అర్జున్‌. నేను ఆయనను అడగవసరం లేదు. నా అవసరాన్ని ముందే గుర్తించి చేస్తారు ఆయన. ఆయ్‌ సినిమా పబ్లిసిటీ లేదు. అల్లు అర్జున్‌ గారితో ఓ ట్వీట్‌ వేయించమని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. కానీ అది నేను అడగాల్సిన అవసరం లేకుండానే, వీడికి అవసరం ఉందని ఆయనకు తట్టింది. వెంటనే ఈ రోజు (ఆగష్టు 13) ఉదయం 11 గంటలకు ఆయ్‌ మూవీ గురించి ట్వీట్‌ చేశారు. అది బన్నీ అంటే. ఒక స్నేహితుడి కోసం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలబడతారు. నాకు ఎలాంటి కష్టం వచ్చిన ఆయన ముందుంటారు. 20 ఏళ్ల క్రితం నేను గీతా ఆర్ట్స్‌ నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది.

అంత పెద్ద మిస్టేక్ చేసిన ఆ రోజు ఈ స్నేహితుడి కోసం నిలబడ్డాడు బన్ని. అప్పుడు ఆయన ఒకటే అన్నారు. తను ఉంటున్నాడు. ఉంటాడు. నా కోసం వాళ్ల నాన్న (అల్లు అరవింద్‌) గారిని కూడా ఎదిరించారు. ఒక స్నేహితుడి గురించి ఎవరైనా ఎదురు నిలబడతారంటే నాకు తెలిసి ఎకైక వ్యక్తి అల్లు అర్జున్. ఆ రోజు ఆయన నా పక్కన లేకపోతే ఈ రోజు బన్నీ వాసు అనేవాడు ఈ స్టేజ్‌పై ఉండేవాడు కాదు. మా మధ్య శుభకాంక్షలు, హ్యాపీ బర్త్‌డేలు చెప్పుకోవడం వంటివి ఉండవు. కానీ నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నా కోసం నిలబడే వ్యక్తి ఆయన. నా కోసమే అనే కాదు తన స్నేహితుడు అనేవాడు పడిపోతున్నాడంటే పట్టుకునే వ్యక్తి అల్లు అర్జున్‌. 

అలాంటి మంచి వ్యక్తి జీవితంలో ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నా” అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. అలాగే “జానీ సినిమాకు యానిమేటర్ పని చేసిన తను ఇప్పుడు ఓ సినిమా నిర్మించే స్థాయికి ఎదగడం, గీతా ఆర్ట్స్‌లో భాగం అయిన నేను జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యామిలీ వ్యక్తితో సినిమా చేసే స్థాయికి ఎదగాను. నేను చిన్నప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్‌ గారిని ఫ్యాన్‌ని. ఖుషి సినిమా చూసి మా నాన్న అంబాసిడర్‌ కారు వేసుకుని హైదరాబాద్‌ వచ్చిన కుర్రాడిని.. ఇప్పుడు ఆయన పొలిటికల్‌ జర్నీలో భాగం అయి, ఆయన వెనకల అడుగులో అడుగులు వేసి వెళ్లగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేసుకుని ఉంటాను అనిపిస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత బన్నీవాసు. 

Also Read: ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’.. డైరెక్టర్‌ రాజమౌళి డాక్యుమెంటరిపై రామ్ చరణ్‌ ఆసక్తికర కామెంట్స్‌

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments