Kanguva Producer Gnanavel Raja About Kalki 2898 AD: 2024 మొదలయినప్పటి నుంచి సౌత్ నుంచి విడుదలయిన చాలావరకు సినిమాలు సూపర్ సక్సెస్‌ను సాధిస్తున్నాయి. ఇంకా మరెన్నో చిత్రాలు బాక్సాఫీస్‌పై తమ ప్రతాపం చూపించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక తాజాగా విడుదలయిన ‘కల్కి 2898 ఏడీ’ కూడా అదే కేటగిరిలో చేరుతుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా చాలావరకు మూవీ లవర్స్‌ను ఆకట్టుకుంది. ఎంతోమంది సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాపై తెగ ప్రశంసలు కురిపించారు. తాజాగా అందులో ‘కంగువా’ నిర్మాత జ్ఞానవేల్ రాజా కూడా యాడ్ అయ్యారు.
‘కల్కి 2898 ఏడీ’పై ప్రశంసలు..
‘కల్కి 2898 ఏడీ’ మూవీ తెలుగులో ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో.. హిందీలో కూడా అదే రేంజ్‌లో కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళ్తోంది. ఈ విషయంపై ‘కల్కి 2898 ఏడీ’ని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు ‘కంగువా’ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా. ఈ మూవీ ఎన్నో సౌత్ ఇండియన్ చిత్రాలకు గేట్‌వేగా మారిందని ఆయన అన్నారు. చాలామందిపై ‘కల్కి 2898 ఏడీ’ మూవీ ప్రభావం చూపించిందని, సూర్య హీరోగా తాను నిర్మించిన ‘కంగువా’పై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. నార్త్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ప్రతీ సౌత్ సినిమాపై దీని ప్రభావం ఉంటుందని వ్యాఖ్యలు చేశారు జ్ఞానవేల్ రాజా.
మూడు రోజులు నిద్రపోలేదు..
‘‘కల్కి 2898 ఏడీ రిలీజ్ అయిన తర్వాత నేను మూడు రోజుల పాటు నిద్రపోలేదు. ఎందుకంటే నార్త్‌లో రిలీజ్ అవుతున్న ప్రతీ సౌత్ సినిమాను ఇది ఇంపాక్ట్ చేస్తుంది. ‘పుష్ప’లాంటి సినిమాపై ‘కల్కి 2898 ఏడీ’ నేరుగా ఇంపాక్ట్ చూపించకపోయినా.. ఇన్‌డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే కచ్చితంగా చూపిస్తుంది. కచ్చితంగా నార్త్‌లో భారీ ఎత్తున విడుదల అవుతున్న ప్రతీ సౌత్ సినిమాపై ప్రేక్షకులు, మేకర్స్ నమ్మకం కచ్చితంగా పెరుగుతుంది. ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకోగానే నేను కూడా ధైర్యంగా కంగువా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయగలిగాను లేదా ‘పుష్ప 2’ రిలీజ్ అయ్యేవరకు ఆగేవాడిని’’ అంటూ ‘కల్కి 2898 ఏడీ’ ఎఫెక్ట్.. ‘కంగువా’పై ఏ రేంజ్‌లో ఉందో తెలిపారు జ్ఞానవేల్ రాజా.
అవన్నీ ముఖ్యం..
ఒక సినిమా అనేది ప్రేక్షకుల వరకు రీచ్ అయ్యేవరకు ఎన్నో అంశాల్లో జాగ్రత్తలు వహించాలి అని నిర్మాత జ్ఞానవేల్ రాజా తెలిపారు. ‘‘సినిమా విడుదలవుతున్న సమయం చాలా ముఖ్యం. ప్రమోషన్స్ చేసే విధానం చాలా ముఖ్యం. కంటెంట్ క్వాలిటీ చాలా ముఖ్యం’’ అన్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మించిన ‘కంగువా’ను శివ డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అక్టోబర్ 10న విడుదల కానుందని తాజాగా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇందులో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. వీరితో పాటు బాబీ డియోల్, జగపతి బాబు, యోగి బాబు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కోలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘కంగువా’ను రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు జ్ఞానవేల్ రాజా.
Also Read: ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్స్ – అప్పుడే ఆ బాలీవుడ్ మూవీ రికార్డ్ బ్రేక్ చేసిందిగా
మరిన్ని చూడండి