‘కల్కి 2898 AD’ టైటిల్ అందుకే పెట్టాం – అసలు కథ చెప్పేసిన నాగ్ అశ్విన్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే తన అప్‌కమింగ్ మూవీ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తన సినిమాకు మార్కెట్ పెరిగింది కాబట్టి దానిని కాపాడుకునే బాధ్యత ప్రస్తుతం ప్రభాస్‌పైనే ఉంది. అందుకే తన అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ గురించి ఏదైనా అప్డేట్ బయటికొస్తే బాగుంటుందని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ‘కల్కి 2898 ఏడీ’ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అప్పుడు ‘ఫైటర్’, ఇప్పుడు ‘ఆర్టికల్ 370’ – ఆ దేశాల్లో హిందీ చిత్రాలకు తప్పని చిక్కులు
ఈమధ్య గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాలకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవేళ ఆ సినిమా ఎక్కువగా భారత్‌కు సంబంధించిన విషయాలపై తెరకెక్కించి ఉంటే.. దానిని విడుదల చేయడానికి గల్ఫ్ దేశాలు ఒప్పుకోవడం లేదు. కొన్నిరోజుల క్రితం హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘ఫైటర్’ మూవీకి ఇదే సమస్య ఎదురవ్వగా.. ఇప్పుడు యామీ గౌతమ్ లీడ్ రోల్ చేసిన ‘ఆర్టికల్ 370’ని కూడా విడుదల చేయడానికి గల్ఫ్ దేశాలు ఒప్పుకోవడం లేదని సమాచారం. కాగా ఇండియాలో మాత్రం ఈ సినిమా విడుదలయ్యి పాజిటివ్ టాక్‌ను అందుకుంటోంది. నెటిజన్లు దీనికి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
శ్రీముఖికి ఏం అనిపించిందో స్టేజి పైనే ముద్దు పెట్టింది: శేఖర్ మాస్టర్
టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఢీ షోతో కెరీర్ స్టార్ట్ చేసి ఎంతో కష్టపడి తన టాలెంట్ తో అదే ఢీ షోకి జడ్జిగా వ్యవహరించే స్టేజికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఎంతోమంది స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా దూసుకుపోతున్నాడు. ఓ వైపు సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తూనే మరోవైపు బుల్లితెరపై కొన్ని షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఢీ షోతో పాటూ ఇటీవల పలు కామెడీ షోలకి కూడా జడ్జిగా పనిచేశారు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే ఆ మధ్య ‘స్టార్ మా’లో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోకి జడ్జ్ గా వ్యవహరించిన శేఖర్ మాస్టర్‌కు శ్రీముఖి ఏకంగా ముద్దు పెట్టింది. ఇదే విషయమై శేఖర్ మాస్టర్ తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
థియేటర్లలో ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలుగు సినిమాలు ఇవే!
మార్చిలో కొత్త సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. థియేట్రికల్ రిలీజుల పరంగా ఫిబ్రవరి ముగిసినట్లే. ఇప్పుడు… ఈ వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలు అన్నీ మార్చిలో 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. వాటిలో కొత్త సినిమాలతో పాటు రీ రిలీజు సినిమాలు సైతం ఉన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అభిమాని వింత కోరికను తీర్చిన ప్రియాంక మోహన్, పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
ఈమధ్య చాలామంది యంగ్ హీరోయిన్స్.. ఎక్కువ సినిమాల్లో అనుభవం లేకపోయినా స్టార్ హీరోలతో జతకట్టే ఛాన్స్ కొట్టేస్తున్నారు. ఆ లిస్ట్‌లో ప్రియాంక మోహన్ కూడా యాడ్ అయ్యింది. నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో పరిచయమయిన భామ.. అక్కడి నుండి మొదలయ్యి ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఓజీ’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫ్యాన్స్‌తో ముచ్చటించాలి అనుకుంది ప్రియాంక మోహన్. అందులో ఎక్కువగా తనకు ‘ఓజీ’ గురించే ప్రశ్నలు ఎదురవ్వగా సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మరిన్ని చూడండి