Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి ఇచ్చిన టికెట్ పడేసి కనకం ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. విహారి మాటలు తలచుకొని బాధ పడుతూ రాత్రి వేళ ఒంటరిగా నడుస్తూ వస్తుంది. కొందరు రౌడీలు కనకాన్ని తన ఒంటి మీద నగలు చూసి ఆశ పడతారు. ఇక విహారి కూడా ఇంటికి వెళ్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక విహారి చిన్న మేనత్త భర్త బయట ఉంటే అతని భార్య కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. విహారి ఫ్రెండ్స్‌ని కూడా విహారి గురించి అడగమని అంటుంది. ఎలా అయినా విహారిని కనిపెడతానని లేదంటే ఇళ్లరికపు అల్లుడికి విలువ లేదని అంటాడు.
మరోవైపు రౌడీలు కనకాన్ని తరుముకుంటూ వస్తారు. కనకం పరుగెత్తుకుంటూ కాఫీ షాపు దగ్గరకు వస్తుంది. అందర్ని చూసి రైడీలు పారిపోతారు. ఇక విహారి మామ కనకం బంగారం చూసి ఆశపడి ఎలా అయినా బంగారం కొట్టేసి మంచి ప్లేస్‌కి వెళ్లిపోవాలని అనుకుంటాడు. కనకం దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడి తనని బస్‌స్టాండ్ దగ్గరకు వెళ్లమంటాడు. కనకం వెళ్తుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత కనకం ఒంటరిగా ఉంటుంది. కనకం నగలన్నీ తీసి బ్యాగ్‌లో వేసుకుంటుంది. తండ్రి చివరగా తొడిగిన గాజుల్ని చూసి బాధ పడుతుంది. ఇక విహారి మామ కనకాన్ని కర్రతో కొట్టి నగల బ్యాగ్‌తో పారిపోతాడు. కనకం కింద పడిపోతుంది.
విహారి: నేను కూడా స్వార్థం చూసుకుంటే నాకు ప్రకాశానికి తేడా ఏంటి. నన్ను నమ్ముకొని ఊరు కాని ఊరు వచ్చింది. కానీ నేను తనని మధ్యలోనే వదిలేశాను. డ్రైవర్ యూటర్న్ తీసుకొని ఎయిర్ పోర్ట్‌కి పద. విహారి ఎయిర్ పోర్ట్‌కి వెళ్లి కనకం గురించి అడుగుతాడు. కనకం ఫ్లైట్ ఎక్కలేదని తెలుసుకుంటాడు. ఎయిర్ పోర్ట్ మొత్తం వెతుకుతాడు. ఇంతలో విహారి తల్లి ఎయిర్ పోర్ట్‌కి వస్తుంది. రాజమండ్రికి టికెట్ తీసుకుంటుంది.
విహారి బయటకు వచ్చి కనకం ఫొటో చూపింంచి అందరికీ కనకం గురించి అడుగుతాడు. మరోవైపు కనకం ఉన్న దగ్గరే వెతికినా కనకాన్ని గుర్తించలేడు. విహారి వెళ్లిపోయిన తర్వాత కనకం లేస్తుంది. ఇంతలో విహారికి తన తాతయ్య కాల్ చేసి మీ అమ్మ ఎయిర్ పోర్ట్‌కి వెళ్లిందని ఇంకా రాలేదని ఇంటికి తీసుకురమ్మని చెప్తాడు. కనకం కూడా మళ్లీ ఎయిర్ పోర్ట్‌కే వెళ్తుంది. విహారి తల్లి వదిన పద్మాక్షి మాటలు తలచుకొని మళ్లీ ఫిట్స్ వచ్చేస్తుంది. కనకం హాస్పిటల్‌లో జాయిన్ చేస్తుంది. ఇక మందులు తీసుకురమ్మని చెప్తే కనకం డబ్బులు లేవు అని బాధ పడుతుంది. ఇంతలో తన తల్లి కొంగుకి కట్టిన డబ్బులు గుర్తు చేసుకొని వాటిని తీసి మెడిసిన్ తీసుకొని వస్తుంది. మరోవైపు విహారి కూడా ఫోన్ ట్రై చేస్తుంటాడు. విహారి తల్లి కాళ్ల దగ్గర కనకం కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. విహారి తల్లికి మెలకువ వచ్చి నీరు తీసుకోవాలని ప్రయత్నిస్తే కనకం లేచి నీళ్లు తాగిస్తుంది. కనకాన్ని చూసిన ఆమెకు గతంలో కనకమే సాయం చేసిన సంగతి గుర్తొస్తుంది. థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
మరిన్ని చూడండి