Homeవినోదంకలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం, విహారిల ఎదురుగానే ఆదికేశవ్‌కు అవమానం.. !

కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకం, విహారిల ఎదురుగానే ఆదికేశవ్‌కు అవమానం.. !


 Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక ఓకే చేసిన ప్రాజెక్ట్‌ని విహారి క్యాన్సిల్ చేసేస్తాడు. దాంతో అంబిక చాలా రగిలిపోతుంది. మొదటి సారి తన లెక్కలు తప్పాయని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానని మండిపోతుంది. ఇక ఆ డెలికేట్స్‌తో ఎలా అయినా మీకు ఈ ప్రాజెక్ట్ ఇస్తానని చెప్తుంది. ఇక అందరి ముందు సుభాష్‌ మీద నింద వేసినందుకు సుభాష్‌ హర్ట్ అయిపోతాడు. 

అంబిక: సుభాష్ విహారి స్పీడ్‌కి బ్రేక్ వేయడానికి నీ మీద కోప్పడాల్సి వచ్చింది.
సుభాష్: నువ్వు దొరక్కుండా ఉండటానికి నన్ను బ్లేమ్ చేశావ్ నన్ను ఇరికించావ్ అని సుభాష్ హర్ట్ అయి వెళ్లిపోతాడు.

కనక మహాలక్ష్మీ విహారికి భోజనం పెట్టడానికి అన్ని సిద్ధం చేస్తుంటుంది. ఇంతలో విహారి ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వస్తుంది. విహారి చూడకముందే కనకం విహారిని చూస్తుంది. విహారి తనని చూడకూడదని క్యాంటీన్లోనే దాక్కుంటుంది. మరోవైపు సహస్ర కూడా విహారికి కాల్ చేస్తుంది. రేపు గుడికి వెళ్లాలని చెప్తుంది. ఎలాంటి పరిస్థితిలోనూ మిస్ అవ్వొద్దని మిస్ అయితే తల్లి గొడవ పెట్టేస్తుందని చెప్తుంది. ఇక తులా
భారం కూడా ఉందని రేపు ఏ ప్రోగ్రాం పెట్టుకోకుండా రమ్మని అంటుంది. ఇక విహారికి వరస ఫోన్స్ రావడంతో వెళ్లిపోతాడు. కనకం ఊపిరి పీల్చుకుంటుంది.

 ఆదికేశవ్, గౌరీలు విహారి ఆఫీస్‌కు వస్తారు. లోపలికి వెళ్లబోతే సెక్యూరిటీ వాళ్లు వెళ్లనివ్వరు. దాంతో ఆదికేశవ్ విహారి, కనకాల పెళ్లి ఫోటో చూపించమని అప్పుడు మనం ఎవరో తెలిసి లోపలికి వెళ్లనిస్తారని అంటాడు. మరోవైపు కనకం తల్లిదండ్రులను చూస్తుంది. ఇక విహారి తన గదిలో ఉన్న సీసీ కెమెరాల్లో ఆదికేశవ్ వాళ్లు రావడం చూస్తాడు. వాళ్లు వచ్చారేంటని షాక్ అయిపోయి పరుగులు తీస్తాడు. 

విహారి: వీళ్లు ఇక్కడ ఉన్నారేంటి అసలు ఈ ఆఫీస్‌ గురించి వీళ్లకి ఎవరు చెప్పారు. 
కనకం: అమ్మానాన్నలేంటి ఇక్కడికి వచ్చారు. విహారి గారి ఆఫీస్‌ అని తెలిసి వచ్చారా. 
అంబిక: సుభాష్ కోపంగా ఉందా.
సుభాష్: లేదు చాలా సంతోషంగా ఉంది. అందరి ముందు అవమానించావ్ కదా దాన్ని గుర్తు చేసుకొని సంబర పడుతున్నా. నా మీద ఫైల్ విసిరావ్ కదా అది గుర్తు చేసుకొని సరదా పడుతున్నా. 
అంబిక: సుభాష్ అర్థం చేసుకో నేను ఆ మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే నా మీద నమ్మకం పోయేది. విహారికి మన మీద నమ్మకం ఉన్నంత వరకే నేను ఏమైనా చేయగలను. లేదంటే ఆ ఇంటి నుంచి అణువంత కూడా దోచుకోలేం.
సుభాష్: ఏమో అంబిక నీకు డీల్ చేయడం లేదు అందుకే నేను ప్రాబ్లమ్‌లో పడ్డా.

ఆదికేశవ్ వాళ్ల ఫోన్ స్విఛ్ ఆఫ్ అయిపోతుంది. ఆదికేశవ్ విహారి తన అల్లుడని చెప్పి ఒక్కసారి లోపలికి పంపమని అడిగితే సెక్యూరిటీ వాళ్లు ఆదికేశవ్‌ని గెంటేస్తారు. ఆదికేశవ్ కింద పడిపోతాడు. ఆటో డ్రైవర్, గౌరీ ఇద్దరూ ఆదికేశవ్‌ని లేపి సపర్యలు చేస్తారు. ఇక అది చూసిన కనకం చాలా ఏడుస్తుంది. ఏం చేయలేకపోతున్నా అని ఫీలవుతుంది. విహారి కూడా చూసి చాలా బాధ పడతాడు. ఇక విహారి సెక్యూరిటీని పిలిచి సెక్యూరిటీకి చివాట్లు పెట్టి సారీ చెప్పమని అంటాడు. గౌరీ, ఆదికేశవ్‌లు వెళ్లిపోతారు.

మరోవైపు అంబిక, సుభాష్‌ని మోటీవేట్ చేస్తుంది. దాంతో సుభాష్ కూల్ అయిపోతాడు. సుభాష్ అంబికను దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకునే టైంకి కనకమహాలక్ష్మీ చైర్ సౌండ్ చేస్తుంది. దాంతో అంబిక చూసేస్తుంది. వచ్చి కనకం మీద సీరియస్ అవుతుంది. వాళ్లిద్దరి గురించి ఎవరికీ చెప్పినా శవంలా మారుతుందని అంటుంది. ఎవరికీ చెప్పనని కనకం బతిమాలుతుంది. ఇక కనకం పరుగులు పెడుతూ రాము కనిపించడంతో అమ్మగారు వాళ్లకి వడ్డించమని చెప్పి వెళ్లిపోతుంది. కనకం తల్లిదండ్రుల కోసం పరుగులు పెడుతుంది. విహారి కనకం తల్లిదండ్రులకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తాడు. ఇక అంబిక వాళ్లు రావడంతో భోజనం చేస్తారు. లక్ష్మీ చాలా బాగా వండిందని అంటాడు. మరోవైపు కనకం రోడ్ల మీద పరుగులు తీసి ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: ‘సీతే రాముడి కట్నం’ సీరియల్: సుమతి సంతకం చేసిన టీచర్.. మహాకు ట్విస్ట్ ఇచ్చిన సీత, సూర్య నడిచేశాడోచ్!

 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments