Homeవినోదంకలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: నా బావ జోలికొస్తే చంపేస్తా: కనకానికి సహస్ర వార్నింగ్

కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: నా బావ జోలికొస్తే చంపేస్తా: కనకానికి సహస్ర వార్నింగ్


Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీ ఇంటికి వస్తుంది. పండు లక్ష్మీని చూసి యోగక్షేమాలు అడుగుతాడు. విహారిబాబుని నిన్ను చూసి ఇంట్లో అందరూ సంతోషించారా అని అడిగితే అందరూ హ్యాపీనే కానీ విహారి బాబు గారే ఇబ్బంది పడ్డారని లక్ష్మీ చెప్తుంది. దానికి పండు చిలకా గోరింకల్లా మీ ఇద్దరూ కలిసి వెళ్లి రావడం నాకు సంతోషంగా ఉందని అంటాడు. ఇక ఇద్దరూ ఇంటి లోపలకు వెళ్తుంటే గుమ్మం ముందు సహస్ర పూల కుండీ విసిరేస్తుంది. లక్ష్మీ షాక్ అయి నిల్చొండిపోతుంది. యమున, పద్మాక్షి, అంబిక అక్కడే ఉంటారు.

సహస్ర: ఏయ్ లక్ష్మీ నిన్ను తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దు అన్నానా లేదా మళ్లీ ఈ ఇంటి ముఖం చూడొద్దు అన్నా కదా ఎందుకు వచ్చావే. 
పద్మాక్షి: దూలానికి వేలాడే గబ్బిలంలా ఎందుకే ఇక్కడే వేలాడుతున్నావ్. అయినా ఈ ఇంట్లో ఎవరితో నీకు సంబంధం లేదు బంధుత్వం లేదు అయినా ఎందుకే మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తున్నావ్.
అంబిక: ఇంట్లో నుంచి వెళ్లమంటే వెళ్లిపోయింది నాలుగు రోజులు ఎవరితో తిరిగి ఎంజాయ్ చేసి మళ్లీ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇంటి యజమానురాలిగా గర్వంగా ఇంట్లోకి వస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీడం లేదు.
సహస్ర: ఏయ్ లక్ష్మీ నువ్వు ఇప్పుడే వెళ్లకపోతే మెడ పట్టుకొని గెంటేస్తా.
యమున: అమ్మా సహస్ర మీకు చెప్పాను కదా తనకు ఎవరూ లేరని అయినా మీరంతా ఎందుకు తన మీద ఇంత ద్వేషం చూపిస్తున్నారు.
సహస్ర: అత్తయ్యా ఈ లక్ష్మీని చూస్తేనే నాకు కంపరంగా ఉంటుంది. అయినా మీరు ఎందుకు దాన్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు.
యమున: నన్ను కాపాడిందని.
పద్మాక్షి: బాగుంది లక్ష్మీ యమున, మా నాన్నని కాపాడాను అనే సింపతీ కార్డ్‌తో బాగానే నట్టింట్లో తిరుగుతున్నావ్.
సహస్ర: చూడండి అత్తయ్యా ఈ లక్ష్మీని ఇంటి నుంచి పంపిస్తారా లేదా.
యమున: వెళ్తుంది అమ్మా తనకంటూ ఓ దారి దొరికినప్పుడు వెళ్లిపోతుంది. అంత వరకు అర్థం చేసుకో.
వసుధ: సహస్ర లక్ష్మీ కొన్ని రోజుల్లో వెళ్లిపోతుంది కదా అయినా నువ్వు నీకు కాబోయే అత్తయ్యకి కాస్త కూడా మర్యాద ఇవ్వవా. వదిన వీళ్లు ఇలాగే అంటారు కానీ మీరు లక్ష్మీని తీసుకొని లోపలికి వెళ్లండి. 

యమున లక్ష్మీని తీసుకొని లోపలికి వెళ్తుంది. సహస్ర బ్యాచ్ మొత్తం కోపంతో చూస్తూ ఉంటారు. లక్ష్మీ గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. ఇంతలో విహారి లక్ష్మీకి కాల్ చేస్తాడు. ఇంట్లోకి వెళ్లావా ఎవరికీ ఏం అనుమానం రాలేదు కదా అందరూ బాగానే మాట్లాడారు కదా అని అడుగుతారు. లక్ష్మీ జరిగిన అవమానం గుర్తు చేసుకొని మాట్లాడకుండా ఏడుస్తుంది. విహారితో ఎవరికీ ఏ అనుమానం రాలేదని ఎవరూ తనని ఏం అనలేదు అని చెప్తుంది. ఇక కనకం ఫ్రెష్ అయి వస్తే తన తల్లిదండ్రులు కాల్ చేస్తారు. అమెరికా క్షేమంగా వెళ్లిపోయారా అని అడుగుతారు. వచ్చేశాం అని కనకం చెప్తుంది. ఇక అల్లుడికి ఇబ్బంది పెట్టొద్దని జాగ్రత్తలు చెప్తారు. తర్వాత లక్ష్మీ పూజ చేస్తుంది. లక్ష్మీ మంత్రాలు బయటకు వినిపించడంతో పండు విని ఎవరైనా వింటే ఇంకా ఉందా అనుకొని లక్ష్మీ గదిలోకి వెళ్లి డోర్ వేస్తాడు. నీ పూజ మంత్రాలు అందరికీ తెలిస్తే ఇంకేమైనా ఉందా డోర్ వేసి మెల్లగా చేయ్ అని చెప్తాడు. ఎవరికైనా విషయం తెలిస్తే కష్టమని జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. దాంతో లక్ష్మీ ఇంకొక్క మూడు రోజులు నిష్టగా పూజ చేస్తే విహారి గారు క్షేమంగా ఉంటారని చెప్తుంది. లక్ష్మీ పూజ తర్వాత తాళికి కుంకుమ పెట్టుకుంటుంటే సహస్ర అక్కడికి వస్తుంది. లక్ష్మీ కంగారుగా కబోర్డ్ డోర్స్ వేసేస్తుంది. 

సహస్ర: ఈ నాలుగు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్. మీది ధర్మ పురం కదా. చెప్పు లక్ష్మీ. మీది ధర్మపురమే కదా. నేను నిన్ను అక్కడ చూశాను. 
లక్ష్మీ: అదేం లేదు అమ్మ ఆ ఊరితో నాకు ఏ సంబంధం లేదు.
సహస్ర: అవునా ఈ నాలుగు రోజులు ఎక్కడికి వెళ్లొచ్చావ్.
లక్ష్మీ: తిరుపతికి వెళ్లొచ్చా అమ్మ.
సహస్ర: సరే ఇప్పటికి తప్పించుకున్నావ్ కానీ మాట మాటికీ తప్పించుకోలేవు. నువ్వు తిరుపతికి వెళ్లా అన్నావ్ కదా మరి తిరుపతి ప్రసాదం ఏది. ప్రసాదం ఇవ్వు. తిరుపతి వెళ్లే వారు ఎవరూ ప్రసాదం తీసుకొని రాకుండా రారు కదా ఏది ప్రసాదం. నువ్వు తిరుపతి వెళ్లా అనగానే నమ్మేస్తా అనుకున్నావ్ కదా.
లక్ష్మీ: లేదమ్మా నేను ప్రసాదం తీసుకొచ్చా. ( లక్ష్మీ వస్తున్నప్పుడు విహారి తిరుపతి అని చెప్పావ్ కదా ప్రసాదం తీసుకురాకపోతే డౌట్ వస్తుందని ప్రసాదం ఏర్పాటు చేస్తాడు) ప్రసాదం తీసుకోండి అమ్మా.
సహస్ర: ప్రస్తుతానికి నమ్ముతున్నా కానీ ఇంకొకటి నీలోని ఆడతనం విహారి బావ మీద ఆశ పడుతుంది అనిపిస్తుంది. నాకు ఆ అనుమానం పోవాలి అంటే నువ్వు బావకి దూరంగా ఉండాలి. నువ్వు మా బావ మీద కన్నేసినా మనసు పడుతున్నావ్ అని ఏ మాత్రం అనిపించినా నీ ప్రాణం తీయడానికి కూడా నేను ఏ మాత్రం వెనకడుగేయను. బావ నా వాడు నా తప్ప ఇంకెవరికీ సొంతం అవ్వడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకో. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: ‘త్రినయని’ సీరియల్: పట్నం చేరుకున్న త్రినేత్రి బామ్మ.. ఇంట్లో రచ్చ చేస్తున్న వల్లభ!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments