Homeవినోదంకలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కాళ్లు పట్టుకున్నా కనికరించని పద్మాక్షి.. బావమరదళ్లు సూపర్

కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కాళ్లు పట్టుకున్నా కనికరించని పద్మాక్షి.. బావమరదళ్లు సూపర్


Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకమహాలక్ష్మీ, విహారి తల్లి పక్కపక్కన నిల్చొని దేవుడికి దండం పెట్టుకుంటారు. అటుగా వచ్చిన ఇద్దరు ఆడవాళ్లు వాళ్లని చూసి కాబోయే అత్తాకోడళ్లు ఇప్పటి నుంచే కలిసి మెలసి గుళ్లకు తిరుగుతున్నారని అనుకుంటారు. ఇక కనకమహాలక్ష్మీ వెళ్లిపోగా విహారి తన తల్లి పెద్ద మేనత్త ఇంటికి బయల్దేరుతారు. ఆవిడ ఇళ్లు చూసి చాలా పెద్ద ఇళ్లు కట్టించిందిరా మీ అత్తయ్య అని అంటుంది. ఇక వాచ్ మ్యాన్ ఎవరు మీరు అని  అడిగితే మేనల్లుడిని అని విహారి ఇంట్లోకి వెళ్తాడు. 

విహారి, అతని తల్లి ఇంట్లోకి అడుగు పెట్టబోతే అతని పెద్ద మేనత్త పద్మాక్షి గుమ్మంలో అడుగు పెట్టనివ్వకుండా ఆగండని అరుస్తుంది. ఇద్దరూ బయటే నిల్చొండిపోతారు. విహారి పెద్ద మేనత్త వాళ్ల దగ్గరకు వస్తుంది. పద్మాక్షి వాచ్‌మాన్‌కి పిలిచి అతని గట్టిగా కొడుతుంది.. 

పద్మాక్షి: విలువైన మనుషులు ఉండే ఇళ్లు ఇది. ఇలాంటి వాళ్లని ఇంటి గుమ్మం వరకు ఎందుకు పంపించావు. 
వాచ్‌మెన్: మేనల్లుడు అని చెప్పారు మేడం.
పద్మాక్షి: అంటే ఆలోచించవా గేట్లు తీసేస్తావా. ఇలా ఎవరు చెప్పినా నమ్మేస్తావా. గుమ్మం దగ్గరకు వచ్చింది ఎవరో ఏంటి అనేది తెలుసుకోవా. అన్నీ తెలుసు కొని ఈ ఇంట్లోకి వచ్చే అర్హత ఉంటేనే పంపించాలి. లేదంటే గేటు దాటనివ్వకూడదు.

విహారి తల్లి పద్మాక్షి చేయి పట్టుకొని మీ కాళ్లు అనుకోండి క్షమించండి అని అంటుంది. ఇక పద్మాక్షి నువ్వు తాకిన నాకు తేళ్లు జర్రెలు పాకినట్లు ఉంటుందని అంటుంది. పని మనిషికి శానిటైజర్ తీసుకురమ్మని చెప్పి చేతులు శుభ్రం చేసుకుంటుంది. ఇక మేడ మీద నుంచి పద్మాక్షి కూతురు (బ్రహ్మముడి సీరియల్లో అనామిక) చూసి అత్తయ్య అని పక్కన ఉన్నది బావేనా అని అనుకుంటుంది. విహారిని చూసి బావగారే అని అనుకుంటుంది. 

విహారి తాతయ్య నానమ్మల షష్టిపూర్తి జరుపుతున్నాం నానమ్మ కోసం రమ్మని చెప్తాడు. తనకు జరిగింది చాలా పెద్ద అన్యాయం అని రాను అని అంటుంది. మీరు నాకు చేసిన అన్యాయానికి నేను మాట్లేడేది తక్కవే అని అంటుంది. మీ అమ్మ పిడుగులా పడిందని తన అన్నయ్యని తీసుకుపోయి వాళ్ల అమ్మతో పాటు అందరికీ అన్యాయం చేసిందని తన కలలు నాశనం చేసిందని దేవుడు చూస్తూ ఉండడని అందుకే మీ అమ్మ పసుపు కుంకుమలు దూరం చేశాడని అంటుంది. పద్మాక్షి మాటలకు విహారి తల్లి ఏడుస్తుంది. విహారి ఏడుస్తాడు. క్షమించమని విహారి తల్లి అడిగితే మనిషిగా చంపేసి శవానికి క్షమాపణ చెప్తే ఎలా అని చివరకు విహారి తల్లి కాళ్లు పట్టుకోవడానికి వంగినా పద్మాక్షి కనికరించదు. ఇక పద్మాక్షి వాళ్లని బయటకు పంపేయమని వాచ్‌మాన్‌తో చెప్తుంది. ఇక పద్మాక్షి కూతురు బావ అని అంటే ఇంకోసారి బంధుత్వాలు కలిపితే బాగోదని వార్నింగ్ ఇస్తుంది. కూతుర్ని తీసుకొని వెళ్లిపోతుంది. విహారి కూడా తల్లిని తీసుకొని వెళ్లిపోతాడు.

మరోవైపు సౌధామణి కూతురు ఆశ్రిత పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతాయి. విహారి ఫ్రెండ్ లగేజ్ తీసుకొని వచ్చి అవినాష్‌కి కాల్ చేస్తాడు. అవినాష్ లగేజ్ తీసుకొని వస్తానని అంటాడు. ఇద్దరూ బ్యాగ్‌లు మార్చుకుంటారు. ఇక ఇద్దరూ బ్యాగ్‌లు చెక్ చేసుకొని అవినాష్ బ్యాగ్‌లో వడ్డానం వంటి బంగారం నగలు చూడటంతో ముందే తెలిసి ఉంటే లైఫ్ సెటిల్ అయిపోయేదని అనుకుంటాడు. ఇక ఆదికేశవ్ అతన్ని పిలుస్తాడు. ప్రకాశ్ మనసులో ఇంత డబ్బున్న ఇంట్లో మంచి మనసు ఉన్న ఇలాంటి ఒక్క వ్యక్తి కలిస్తే చాలు జాక్ పాట్ కొట్టినట్లని అనుకుంటాడు. ఇక కనకమహాలక్ష్మీ అందంగా రెడీ అవ్వడం చూసి ఆదికేశవ్ మురిసిపోతాడు. దగ్గరకు వెళ్లి చాలా ముద్దుగా ఉన్నావని మహాలక్ష్మి అని దగ్గరకు తీసుకుంటాడు. నువ్వు రేపు పెళ్లి అయితే ఎలా అని ఎమోషనల్ అవుతాడు. తండ్రి మాటలకు కనకమహాలక్ష్మీ కూడా ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నర్శింహ రెండో పెళ్లి చేసుకున్నాడని విడాకులు అడిగిన దీప.. కార్తీక్ ఎమోషనల్ స్పీచ్!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments