Homeవినోదంకంగువ ఫస్ట్ సాంగ్... ఎక్స్‌ప్రెషన్స్‌తో సూర్య, మ్యూజిక్‌తో డీఎస్పీ కుమ్మేశారంతే!

కంగువ ఫస్ట్ సాంగ్… ఎక్స్‌ప్రెషన్స్‌తో సూర్య, మ్యూజిక్‌తో డీఎస్పీ కుమ్మేశారంతే!


సూర్య (Suriya)ది తమిళనాడు కావచ్చు. కానీ, ఆయనకు నేషనల్ లెవల్‌లో చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయన నటనకు అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ సూర్య ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ ఏమీ కాదు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘కంగువ’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదలైన తొలి పాటతో అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ అవసరం లేదు. సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కంగువ’ ఫైర్ సాంగ్ నిజంగా ఫైర్ పుట్టించేలా ఉంది. 

సూర్య నటన… దేవి శ్రీ సంగీతం… ఫైర్ అంతే!
Kanguva Fire Song Review In Telugu: సూర్య కథానాయకుడిగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ వ్యయంతో ఉన్నత సాంకేతిక విలువలతో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. విజయ దశమి కానుకగా ఈ అక్టోబర్ 10న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇవాళ తొలి పాటను విడుదల చేశారు.

‘ఫైర్…’ పాటకు తెలుగులో శ్రీమణి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, దీప్తి సురేష్ ఆలపించారు. అరవింద్ శ్రీనివాస్, దీపక్ బ్లూ, సాయి శరణ్, ప్రసన్న ఆదిశేష కోరస్ అందించారు.  ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వం వహించారు.

‘ఆది జ్వాల…
అనంత జ్వాల…
వైర జ్వాల…
వీర జ్వాల…
దైవ జ్వాల…
దావాగ్ని జ్వాల’ అంటూ ఈ పాట సాగింది.

Also Read: కంగువ క్లైమాక్స్‌లో ఖైదీ – అన్నయ్య కోసం తమ్ముడి స్పెషల్ అప్పియరెన్స్!

ఫైర్ సాంగ్ ఎలా ఉంది? అనే విషయానికి వస్తే… నిజంగా సూర్య ఎక్స్‌ప్రెషన్స్ ఫైర్ అంతే! కళ్లలో క్రూరత్వం చూపించారు. ఒక అగ్ని పర్వతం ముందుకు దూకితే ఎలా ఉంటుందో… ఆ విధంగా ఉంది ఆయన నటన! ఇక, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సంగీతం సెగలు పెట్టించేలా ఉంది. ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింత పెంచేలా ఉంది.

Also Readసూర్య భాయ్… గ్యాంగ్‌స్టర్‌గా అదరగొట్టిన స్టార్ హీరో, రోలెక్స్‌ను బీట్ చేస్తాడా?


భారతీయ తెరపై ఇప్పటి వరకు రానటువంటి కథతో భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా ‘కంగువ’ను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య సరసన బాలీవుడ్ భామ, ‘కల్కి 2898 ఏడీ’ ఫేమ్ దిశా పటానీ కథానాయికగా నటించారు. బాబీ డియోల్, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘కంగువ’ను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. పది భాషల్లో త్రీడీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా పలు అంతర్జాతీయ భాషల్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

Also Readబాలయ్య వీరాభిమానిగా ‘బాలు గాని టాకీస్’ హీరో – కొత్త సినిమా అనౌన్స్ చేసిన ఆహా

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments