Kanguva Telugu Trailer: స్టార్ హీరో సూర్య శివ కుమార్ కథానాయకుడిగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సినిమా ‘కంగువ’. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. మాటల్లేవ్, మాట్లాడుకోవడాలు లేవ్… జస్ట్ విజువల్ ఫీస్ట్ అన్నట్టు ఉంది ట్రైలర్.
సూర్య హీరోగా ‘బాహుబలి’ రేంజ్ సినిమా…
ఆ యాక్షన్, విజువల్స్, మ్యూజిక్ అదుర్స్ అంతే!
‘కంగువ’ ట్రైలర్ 2.36 నిమిషాలు ఉంది. అందులో కథ ఏమిటి? క్యారెక్టర్లు ఏమిటి? అనేది రివీల్ చేశారు. అవి పక్కన పెడితే… ఆ విజువల్స్, యాక్షన్, కాస్ట్యూమ్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ అదుర్స్ అనేలా ఉంది. ముఖ్యంగా ‘బాహుబలి’ రేంజ్ సినిమా అనే వైబ్ కలిగించింది.
‘మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటన్నిటి కంటే మనది అంతు చిక్కని రహస్యం’ అని మహిళ చెప్పే మాటలతో ‘కంగువ’ ట్రైలర్ మొదలు అయ్యింది. లావా ప్రవహించే నదులు, భారీ బోటులు, చేతులు నరికి సముద్రంలో పడేసే క్రూరమైన మనుషులు మధ్య తన తెగను కాపాడుకోవడానికి కథానాయకుడు ఏం చేశాడు? అనే కథతో సినిమా తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. యాక్షన్ సన్నివేశాల్లో సూర్య అదరగొట్టారు. బాబీ డియోల్ తన గెటప్, నటనతో చాలా భయపెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే.
దసరాకు థియేటర్లలో ‘కంగువ’ సందడి!
Kanguva Movie Release Date: విజయదశమి కానుకగా ‘కంగువ’ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. అక్టోబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు.
Also Read: విజయవాడ బాబాయ్ హోటల్‌లో కోలీవుడ్ స్టార్ విక్రమ్ – ‘తంగలాన్’ హీరోయిన్ మాళవిక కూడా!
‘కంగువ’ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రతి స్టిల్, వీడియో మెటీరియల్, సాంగ్స్ ఈ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. పీరియాడిక్ యాక్షన్ జానర్‌లో ఇప్పటి వరకు రానటువంటి కొత్త కాన్సెప్ట్ తీసుకుని సినిమా తీశారని అర్థం అవుట్జోంది. పది భాషల్లో సినిమా విడుదల కానుంది. 2డీతో పాటు 3డీలోనూ ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు వస్తున్నారు. ఇంకా పలు అంతర్జాతీయ భాషల్లోనూ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నైజాం ఏరియాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ‘కంగువ’ను విడుదల చేయబోతోంది.
Kanguva Movie Cast And Crew: సూర్య సరసన బాలీవుడ్ భామ దిశా పటానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. కోలీవుడ్ ఫేమస్ కమెడియన్ యోగి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కూర్పు: నిశాద్ యూసుఫ్, కెమెరా: వెట్రి పళనిస్వామి, యాక్షన్: సుప్రీమ్ సుందర్, మాటలు (తమిళంలో): మదన్ కార్కి, కథ: శివ, ఆది నారాయణ, పాటలు (తమిళంలో): వివేక్, మదన్ కార్కి, కాస్ట్యూమ్ డిజైనర్: అను వర్ధన్ – దష్ట పిళ్లై, కాస్ట్యూమ్స్: రాజన్, నృత్య దర్శకత్వం: శోభి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏజే రాజా, సహ నిర్మాత: నేహా జ్ఞానవేల్ రాజా, నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా – వంశీ – ప్రమోద్, దర్శకత్వం: శివ.
మరిన్ని చూడండి