Oh My Lily Lyric Video Song From Tillu Square: త్వరలో థియేటర్లో టిల్లు స్వ్కేర్ సందడి చేయబోతున్నాడు. సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ టీం నేడు రెండో సాంగ్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార పోస్టన్స్, టీజర్, సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాధికా.. రాధికా సాంగ్ అయితే యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నేడు బ్రేకప్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
‘ఓ మై లిల్లీ.. ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా..’ పాట ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. సిద్ధూ, రవి ఆంటోనీ సాహిత్యం అందించిన ఈ పాటకు అచ్చు రాజమణి దర్శకత్వంలో శ్రీరామ్ చంద్రయ పాడిన ఈ పాటు బాగా ఆకట్టుకుంటుంది. ‘టిల్లు స్క్వేర్’ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సిద్దు జొన్నగడ్డే స్వయంగా స్క్రిన్‌ప్లే అందించడం విశేషం.
రెండేళ్ల క్రితం యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ‘డీజే టిల్లు’ ఎంతంటి విజయం సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ సినిమా సంచలనం విజయం సాధించింది. రాధిక రాధిక అంటూ సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్స్ లో చేసిన రచ్చని యూత్ తెగ ఎంజాయ్ చేసింది. ఇక సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ పేరుతో సీక్వెల్ ని ప్రకటించింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మార్చి 29న విడుదలకు సిద్దమైంది.
Also Read: ఓటీటీలో ‘హనుమాన్’ రికార్డుల వేట – 11 గంటల్లోనే అత్యధిక మిలియన్ల వ్యూస్, ఆ రికార్డ్స్ బ్రేక్!
తమన్ కాదు… భీమ్స్ చేతిలో ‘టిల్లు స్క్వేర్’
అయితే, ‘డీజే టిల్లు’ సినిమాకు ఎస్ తమన్ నేపథ్య సంగీతం అందించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు సైతం ఆయన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారని అంతా అనుకున్నారు. కానీ అందరి ఉహాగానాలు రివర్స్ చేస్తూ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ తెరపైకి వచ్చాడు. ‘టిల్లు స్క్వేర్’కు భీమ్స్ సిసిరోలియో రీ రికార్డింగ్ చేస్తున్నారు. ఆ వర్క్ మీద ఆయన బిజీగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ‘టిల్లు స్క్వేర్’ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనులు భీమ్స్ ప్రారంభించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాకు భీమ్స్ రీ రికార్డింగ్ చేస్తుంటే రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పాటలు ‘రాధిక… రాధికా’, ‘టికెట్టే కొనకుండా’ హిట్ అయ్యాయి. ‘ఓ మై లిల్లీ’ పాటను తాజాగా రిలీజ్ చేశారు.
మరిన్ని చూడండి