Homeవినోదంఒకే థియేటర్లలో 5 లక్షల డాలర్లు వసూలు, ఓవర్సీస్ లో ‘యానిమల్‘ సరికొత్త రికార్డు

ఒకే థియేటర్లలో 5 లక్షల డాలర్లు వసూలు, ఓవర్సీస్ లో ‘యానిమల్‘ సరికొత్త రికార్డు


Animal Movie: రణ్‌బీర్‌ కపూర్ హీరోగా న‌టించిన తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యానిమల్’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రూ. 1000 కోట్ల మార్కును దాటేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సుమారు రూ.950 కోట్లకు పైగా వసూలు చేసింది.ఇక ఈ చిత్రంలో రణబీర్, బాబీ డియోల్, రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒకే థియేటర్ లో 5 లక్షల డాలర్లు వసూళు

‘యానిమల్‘ మూవీ ఓవర్సీస్ లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. టొరంటోలోని సిల్వర్ సిటీ బ్రాంప్టన్ సినిమాస్ లో ఏకంగా 5 లక్షల డాలర్ల గ్రాస్ వసూళు చేసింది. భారత కరెన్సీలో సుమారు రూ. 4 కోట్ల 16 లక్షలు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఓ భారతీయ సినిమా ఒకే థియేటర్ లో ఇంత మొత్తం వసూళు చేయడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని ‘యానిమల్’ నిర్మాణ సంస్థ తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

‘యానిమల్’ మూవీపై ప్రశంసలతో పాటు విమర్శలు

‘యానిమల్’ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఆర్జీవీ లాంటి దర్శకులు సైతం మూవీ మేకింగ్ నెక్ట్స్ లెవెల్ లో ఉందంటూ అభినందించారు. అదే సమయంలో ఈ మూవీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమాలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ తో పాటు మితిమీరిన వైలెన్స్ ఉందనే విమర్శలు వినిపించాయి. పార్లమెంట్ లోనూ ఈ సినిమాపై చర్చ జరిగింది. ఇలాంటి సినిమాల వల్ల సమాజానికి మంచికంటే కీడే ఎక్కువ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అటు సందీప్ తన సినిమాల్లో మహిళల మనోభావాలకు విలువ ఇవ్వరు అనే విమర్శలు సైతం వినిపించాయి.

యానిమల్ మూవీ గురించి..

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, రష్మిక మందన్న,బాబీ డియోల్  త్రిప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంట్ తో కూడిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.  రణబీర్, బాబీ డియోల్ నటన పట్ల విమర్శలకులు సైతం ప్రశంసలు కురిపించారు. బాబీ ఈ చిత్రంలో కనిపించేది కొద్ది సేపే అయినా, తన మార్క్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రష్మిక నటన కూడా అద్భుతం అంటూ పలువురు అభినందించారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో డిసెంబర్ 1న విడుదల అయ్యింది.  

Read Also: ఆ పాట విని ఫ్యూజులు ఎగిరిపోయాయ్, ‘నా పెట్టే తాళం’ సాంగ్ పై సత్యశ్రీ షాకింగ్ కామెంట్స్





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments