ఐఫా… ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 దుబాయ్‌లో అంగ రంగ వైభవంగా జరగనున్నాయి. దీని కోసం టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ వెళ్లారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్… ఇక హీరోయిన్లకు వస్తే ప్రియమణి, మృణాల్ ఠాకూర్ నుంచి ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా వరకు… ఇంకా నాని వంటి యంగ్ హీరోలు పలువురు ఐఫాలో సందడి చేయనున్నారు.
అటు జావేద్… ఇటు రెహమాన్… మధ్యలో చిరు!
ఐఫాలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్ ఒక వైపు…. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మరోవైపు కూర్చోగా… మధ్యలో చిరు ఆశీనులు అయ్యారు. చిరు, రెహమాన్… ఇద్దరు ఐకాన్స్ ఒక్క ఫ్రేములో అంటూ ఆ వీడియోను ఐఫా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అటు బాలయ్య… ఇటు వెంకటేష్… మధ్యలో బ్రహ్మి!
హీరో ఎవరైనా సరే కామెడీ కింగ్, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఉంటే థియేటర్లలో నవ్వులే నవ్వులు. అందరి హీరోలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఈ ఏడాది ఐఫాలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ మధ్య కాసేపు కూర్చుని కనిపించారు బ్రహ్మి.
Also Read: ‘లవ్ సితార’ రివ్యూ: శోభితా ధూళిపాళ పెళ్లి సినిమా – Zee5 OTTలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్
ఐఫా ఉత్సవానికి హోస్ట్‌గా రానా దగ్గుబాటి, తేజా సజ్జా!
ఐఫా 2024 బాలీవుడ్ అవార్డులకు కింగ్ ఖాన్ షారుఖ్ హోస్ట్ చేయనున్నారు. సౌత్ ఇండస్ట్రీలో మన తెలుగుకు వచ్చేసరికి మ్యాచో మ్యాన్ రానా దగ్గుబాటి, యంగ్ అండ్ టాలెంటెడ్ యంగ్ స్టర్ తేజా సజ్జా హోస్ట్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నారు.
మృణాల్ ఠాకూర్, ప్రియమణి, ప్రగ్యా జైస్వాల్, రకుల్, ప్రియాంక అరుల్ మోహన్, ఊర్వశి రౌతేలా, రెజీనా, మాళవికా శర్మ, ఫరియా అబ్దుల్లా వంటి యంగ్ హీరోయిన్లు… ఇంకా రాధికా శరత్ కుమార్, మీనా వంటి సీనియర్ హీరోయిన్లు సైతం సందడి చేస్తున్నారు. హిందీ హీరోయిన్, తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన కృతి సనన్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు.
మరిన్ని చూడండి