Megastar Chiranjeevi Met CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుని హైదరాబాద్‌లోని (Hyderabad) ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) శనివారం కలిశారు. ఈ క్రమంలో ఆయనకు సీఎం సాదర స్వాగతం పలికారు. సీఎం సహాయ నిధికి తన తరఫున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరఫున రూ.50 లక్షల చెక్కులను విరాళంగా అందించారు. విపత్కర సమయంలో సహాయం అందించిన చిరంజీవికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి… వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ధన్యవాదాలు తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వరద బాధితుల సహాయార్థం సినీ పరిశ్రమతో పాటు పలువురు ప్రముఖులు సీఎం సహాయ నిధికి విరాళం ప్రకటించారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు వ్యాపారులు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు.
Also Read: Rains: ఏపీకి భారీ వర్ష సూచన – ఈ జిల్లాలకు అలర్ట్, అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు
మరిన్ని చూడండి