బిగ్ బాస్ సీజన్ 7లో 10 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో కెప్టెన్ అవ్వాలని అనుకుంటున్న వారికి ఇంకా రెండు ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ఛాన్స్.. ఈవారం అయిపోయింది. అందుకే ఇప్పటివరకు కెప్టెన్స్ అవ్వని ప్రియాంక, అమర్.. కెప్టెన్ బ్యాడ్జ్ గురించి గట్టిగా పోటీపడ్డారు. కానీ అమర్ మాత్రం ఈ పోటీని వేరేదారిలో తీసుకెళ్లాడు. తాను ఓడిపోతున్నానని అర్థమయినప్పుడు ఏడవడం మొదలుపెట్టాడు, ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయితే తను అలా రియాక్ట్ అవ్వడం స్ట్రాటజీ అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు అమర్. అంతే కాకుండా నామినేషన్స్ సమయంలో కూడా రతికతో ఈ విషయంపై వాగ్వాదానికి దిగాడు.
అది స్ట్రాటజీ ఏమో..
నామినేషన్స్ ప్రారంభం అవ్వకముందు శివాజీ, అమర్‌దీప్ కెప్టెన్సీ టాస్క్ గురించి గుర్తుచేసుకున్నారు. అదే సమయంలో ‘రేయ్ బాగా ఆలోచించుకొని వేయండ్రా, ఇదేంట్రా ఇది, నా లైఫ్ రా’ అనేవి అమర్ ఊతపదాలు అంటూ శివాజీ వెటకారంగా మాట్లాడాడు. ‘‘కొన్ని కొన్ని స్ట్రాటజీలు బయటికి చెప్పకు. కొన్ని మీకు తెలుసు. కొన్ని ఏవో వాడతాను. దానికి ఎవడైనా లొంగుతాడేమో నేను చూస్తా. లొంగేవాడు లొంగుతాడు కదా. నా బాధ నాది. మీరెందుకు దాన్ని హైలెట్ చేస్తారు’’ అంటూ కెప్టెన్సీ టాస్క్ సమయంలో తను ఎమోషనల్ అయినదాని వెనుక అర్థాన్ని బయటపెట్టాడు.
అమర్, రతిక మధ్యలో యావర్..
నామినేషన్స్ సమయానికి తాను రతికను, యావర్‌ను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. తను సంచాలకుడిగా వ్యవహరిస్తున్న టాస్క్‌లోనే యావర్ తప్పులు చేశాడని, దాని వల్ల అర్జున్‌కు అన్యాయం జరిగిందని ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో యావర్ చేసిన తప్పులు గుర్తుచేస్తూ తనను నామినేట్ చేశాడు అమర్. యావర్ తప్పు చేశాడని అమర్ చెప్పగా.. సంచాలకుడిగా అది గమనించకపోవడం తప్పు అంటూ తప్పును అమర్‌పై తోశాడు యావర్. దాంతో పాటు బాల్స్ టాస్క్‌లో కూడా యావర్ గేమ్ ప్లే సరిగా లేదన్నాడు. దీంతో ఇద్దరి మధ్య సీరియస్ వాగ్వాదమే జరిగింది. ఆ తర్వాత రతిక సరిగా గేమ్ ఆడాలని నామినేట్ చేస్తున్నట్టు తన కారణాన్ని చెప్పాడు అమర్. ‘‘మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా.. మనసులో నీ మీద ఎలాంటివి పెట్టుకోలేదు’’ అని సీరియస్‌గా చెప్పాడు. రతిక మాత్రం అమర్ చెప్పిన కారణాలకు ఒప్పుకోకుండా డిఫెండ్ చేసుకోవడం మొదలుపెట్టింది. అదే సమయంలో యావర్ కూడా మధ్యలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా చేయకూడదు అని కెప్టెన్‌గా ప్రియాంక.. జోక్యం చేసుకొని సందర్భాన్ని కంట్రోల్ చేయాలని చూసింది. కానీ యావర్ తన మాట కూడా వినకుండా అమర్‌దీప్ నామినేషన్స్ మధ్యలోకి వచ్చాడు. అలా ఇరువురితో వాగ్వాదాలతోనే అమర్ నామినేషన్స్ ముగిశాయి.
రతిక రివర్స్ నామినేషన్..
అమర్‌దీప్.. తనను నామినేట్ చేసినందుకు.. రతిక కూడా అమర్‌ను నామినేట్ చేసింది. రతిక చెప్పిన కారణాలను పట్టించుకోకుండా అమర్.. చాలావరకు సైలెంట్‌గా నిలబడ్డాడు. చాలాసేపు రతిక చెప్పే కారణాలు విన్న తర్వాత ‘‘అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడకు’’ అని రివర్స్ అయ్యాడు అమర్. ఆ మాట రతికకు నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో సంచాలకుడిగా సరిగా వ్యవహరించలేదనే కారణంతో పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసింది రతిక. సంచాలకుడిగా తన వల్ల యావర్ డిస్టర్బ్ అయ్యాడని ప్రశాంత్‌పై ఆరోపణలు చేసింది. అదే విషయాన్ని యావర్‌ను కూడా అడిగింది. అంటే యావర్ ఫీల్ అయ్యాడని నామినేట్ చేస్తున్నావా అంటూ ప్రశాంత్ కౌంటర్ ఇచ్చాడు. నామినేషన్స్ మధ్యలో వేరేవాళ్ల పేరు తీసుకురావద్దని శివాజీ సలహా ఇవ్వడంతో రతిక సైలెంట్ అయ్యింది.
Also Read: ‘యానిమల్’ క్రేజీ అప్డేట్ – ట్రైలర్ డేట్ ఎప్పుడంటే?