Kajal Aggarwal Latest Photos: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
సుమన్ చిక్కాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో కాజల్ మూవీ టీంలో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది.
క్రైం, యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కాజల్ స్వయంగా యాక్షన్ సన్నివేశాల్లో చేసిందట. మరోవైపు ఈ బ్యూటీ ఇండియన్ 2 చిత్రంతోనూ బిజీగా ఉంది.
ఆదివారం చెన్నైలో జరిగిన ఇండియన్ 2 ఆడియో లాంచ్‌లో పాల్గొంది. మరోవైపు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ ఉంటుంది. ఇటూ తన చిత్రాలను ప్రమోషన్స్ చేస్తూనే మరోవైపు ఫోటోషూట్స్ నిర్వహిస్తుంది.
తాజాగా ఈ చందమామ ఎల్లో కలర్ ఫ్లోరల్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. స్ట్రిప్ షోల్డర్ మ్యాక్సీ టాప్ ఈ చందమామ ముద్దబంతిలా మెరిసిపోయింది.
ఈ ఫోటోలను షేర్ చేస్తూ ‘తన పాకెట్‌లో సన్‌షైన్ ఉంది'(Sunshine in my pocket) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఎల్లో డ్రెస్‌లో ఇలా కాజల్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఏంటీ “రోజుకు రోజుకి ఈ చందమామ అందం పెరుగుతుంది.. చూపు తిప్పుకోవడం కష్టమే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 03 Jun 2024 12:42 AM (IST)
సినిమా ఫోటో గ్యాలరీ
మరిన్ని చూడండి