Suriya Kanguva Movie Release Date: హీరో సూర్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘కంగువా’. డైరెక్టర్ శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని నెలలు గడుస్తున్న ఇంకా రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు. కనీసం సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ కూడా లేవు. ఇటీవల సినిమాను 2024లో రిలీజ్ చేస్తామంటూ ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ రిలీజ్ డేట్ ప్రకటించ లేదు. మూవీ రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీపావళికి థియేటర్ లో సందడి
ఈ క్రమంలో తాజాగా మూవీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది టీం. అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ మేరకు సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ‘డియర్ ఆల్.. అక్టోబర్ 10న వస్తోంది’ అనే సింపుల్ క్యాప్షన్‌తో కంగువ రిలీజ్ డేట్‌ని ప్రకటించాడు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ ఆకట్టుకుంటుంది. యద్ద భూమిలో ఓ పెద్ద గుట్టలా పడి ఉన్న శవాలపై సూర్య కత్తి పట్టుకుని కనిపించాడు. ఇక్కడ సూర్య లుక్ చాలా ఇంటెన్సీవ్‌గా ఉంది.
కాగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిచిన ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణసంస్థలు యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ, యాక్షన్ క్వీన్ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా సుమారు 38 భాషల్లో విడుదల చేయబోతున్నారట. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య ఐదు విభిన్న పాత్రలో కనిపిస్తాడని టాక్. ఇక ఈ సినిమాలో హీరో సూర్య కంగ అనే ఓ పోరాట యోధుడిగా కనిపించనున్నాడు.
ఇదిలా ఉంటే జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘వేట్టియాన్’ మూవీని కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల రజనీ స్వయంగా చెప్పారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడేటట్టు కనిపిస్తున్నాయి. లేదా వేట్టయాని రిలీజ్ వాయిదా వేసి వెనక్కి తీసుకువెళ్లే అవకాశం ఉందంటున్నారు. అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర కూడా ఇదే తేదీకి విడుదల చేస్తున్నట్టు మూవీ మొదట ప్రకటించింది. కానీ మూవీ రిలీజ్ డేట్ మార్పు చేసి మరింత ముందుకు తీసుకువచ్చారు. సెప్టెంబర్ 27 సినిమాను విడుదల చేబోతున్నారు. దీంతో దేవర స్థానంలో కంగువ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ప్రకటన ఇచ్చినట్టుంది మూవీ టీం.
మరిన్ని చూడండి