Ram Charan Completes Game Changer Movie Shooting: షూటింగ్ పూర్తి కాలేదు. ఇక అప్‌డేట్స్ కూడా పెద్దగా రావడంలో. ఆర్ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇది. దీంతో ‘గేమ్ ఛేంజర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవం, అప్‌డేట్స్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. అసలు గేమ్ ఛేంజర్ సినిమా ఉందా? క్యాన్సల్ అయ్యిందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక ఇటీవల ‘భారతీయుడు 2’ మూవీ షూటింగ్ శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ని ఖుషి చేశాడు.
ఈ సినిమా ఇంకా 10 రోజుల షూటింగ్ మిగిలి ఉందని, ‘భారతీయుడు 2’ రిలీజ్ గేమ్ ఛేంజర్ అవుట్ పుట్ చూసి పోస్ట ప్రోడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తానన్నారు. ఫైనల్ మూవీ చూసి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల దీనిపై అప్‌డేట్ ఇవ్వగా.. తాజాగా గేమ్ ఛేంజర్ షూటింగ్‌కి సంబంధించిన మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా చరణ్ షూటింగ్ పూర్తి అయ్యిందట. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
దేవిప్రియ అనే ఓ ఎక్స్ పోస్ట్‌లో గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు. “హమ్మయ్య గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయ్యింది. ఇక బుచ్చిబాబుతో RC16 మూవీకి రెడీ అవుతున్నాడు” ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ ఛేంజర్ మూవీని డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి షూటింగ్ సెట్ నుంచి లీకైన ఫోటోలు, వీడియో సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇందులో చరణ్ ఎలక్షన్ అధికారికగా కనిపించనున్నాడని సమాచారం. ఇక ఎంతో అగ్ర హీరోలతో కలిసి పని చేసిన శంకర్ రామ్ చరణ్‌తో కలిసి వర్క్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.
#GameChanger హమ్మయ్య @AlwaysRamCharan పాత్ర
షూటింగ్ ఈ రోజు తో పూర్తి అయ్యింది.
..
ఇక @BuchiBabuSana సినిమా కు రెడీ
— devipriya (@sairaaj44) July 6, 2024
రామ్ చరణ్‌తో కలిసి పని చేయడం చాలా డిఫరెంట్‌గా ఉందని, అయినా కూడా తనతో వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ హీరోగా పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, అంజలి, జయరామ్, సునీల్, సముద్రఖని సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘జిగర్తాండ’ ఫేం కార్తీక్ సుబ్బరాజ్ గేమ్ ఛేంజర్‌కు కథ అందించారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడని టాక్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ కలిసి ‘గేమ్ ఛేంజర్’ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుంది.
Also Read: ‘కల్కి 2898 AD’ టికెట్ల రేట్ల పెంపు – అసలు విషయం చెప్పిన నిర్మాత అశ్వనీ దత్
మరిన్ని చూడండి