Homeవినోదంఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు

ఇఫీ వేడుకల్లో నాగచైతన్య – శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు


IFFI 2024 : ప్రముఖ నటి శోభిత ధూళిపాళ, అక్కినేని నాగ చైతన్య త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ జరుపుకున్నఈ జంటకు.. వచ్చే నెలలో  పెళ్లి జరగనున్నట్లు తెలుస్తున్నది.  డిసెంబర్ 4న అట్టహాసంగా వీరి వెడ్డింగ్ జరగనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు.  ఇక పెళ్లికి ముందే శోభిత, చైతన్య కలిసి పలు ఈవెంట్లకు జంటగా వెళ్తున్నారు. ఇంట్లో జరిగే వేడుకలతో పాటు బయట జరిగే ఈవెంట్స్ లోనూ పాల్గొంటున్నారు.

IFFI 2024 ఫిలిం ఫెస్టివల్ లో అక్కినేని ఫ్యామిలీ సందడి

ప్రస్తుతం గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరుగుతుంది. ఈ వేడుకలో అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఆయన నటించిన పలు క్లాసిక్ చిత్రాలను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని ఫ్యామిలీ ఈ వేడుకలకు హాజరైంది. అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ నటి, చైతన్యకు కాబోయే శ్రీమతి శోభిత ధూళిపాళ కూడా వెళ్లింది. నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ కలిసి రాగా, నాగార్జునతో అమల కలిసి వచ్చింది. వీరంతా కలిసి రెడ్ కార్పెట్ మీద ఫోటోలకు ఫోజులిచ్చారు.  కాబోయే దంపతులు నాగచైతన్య, శోభిత ధూళిపాళ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

ఏఎన్నార్ అవార్డుల వేడులకో స్పెషల్ అట్రాక్షన్ గా శోభిత

రీసెంట్ గా జరిగిన  దివంగత అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని 2024 వేడుకలోనూ శోభిత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. హైదరాబాదు అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమితాబచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో చైతన్యకు కాబోయే భార్య శోభితా కూడా పాల్గొన్నది. నాగ చైతన్య శోభిత జంట హైలెట్ గా నిలిచింది. ఇద్దరు కలిసి అతిథులను రిసీవ్ చేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు గోవాలో జరుగుతున్న సినీ వేడుకల్లోనూ ఈ జంట పాల్గొని సందడి చేసింది.

8 రోజుల పాటు కొనసాగనున్న IFFI 2024 ఫిలిం ఫెస్టివల్

ఈ ఏడాది IFFI 2024 ఫిలిం ఫెస్టివల్  8 రోజుల పాటు కొనసాగనుంది. ఈ వేడుకల్లో భారతీయ సినిమా రంగం మీద చెరగని ముద్ర వేసిన నలుగురు ప్రముఖుల శత జయంతి వేడుకల సందర్భంగా వారికి నివాళులర్పించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌ కపూర్‌, గాయకుడు మహమ్మద్‌ రఫీ, బెంగాలీ దర్శకుడు తపన్‌ సిన్హాకు సంబంధించి ఈ వేడుకలో ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Read Also: తోపు లెక్క ఫీల్ అవ్వొద్దన్న ఫైమా… పల్లవి ప్రశాంత్‌పై నోరు పారేసుకున్న గీతూ – సుమ షోలో ‘బిగ్ బాస్’ మాజీ కంటెస్టెంట్ల రచ్చ

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments