Homeవినోదంఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో... 'పుష్ప 2', పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ

ఇన్నోసెంట్, కన్నింగ్, సూపర్ ఈగో… ‘పుష్ప 2’, పుష్ప రాజ్ పాత్రపై ఆర్జీవి రివ్యూ


డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్ల పరంగా వైల్డ్ ఫైర్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఓవైపు ఈ మూవీ గురించి నెగెటివ్ కామెంట్స్, వివాదాలు, విమర్శలు వినిపిస్తుంటే, మరోవైపు ఊహించని రీతిలో దూసుకెళ్తోంది ‘పుష్ప 2’ మూవీ. ‘నీ యవ్వ తగ్గేదె లే’ అంటూ ఈ సినిమా రికార్డుల మాస్ జాతర షురూ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘పుష్ప 2’ మూవీలోని పుష్ప రాజ్ పాత్రపై రాంగోపాల్ వర్మ ‘నా రివ్యూ’ అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ ని షేర్ చేశారు. 

ఆ పోస్టులో రాంగోపాల్ వర్మ “పుష్ప 2లోని పుష్ప రాజ్ పాత్ర గురించి నా రివ్యూ. ఇండియన్ సినిమాలలో షార్ప్ గా ఉండే పాత్రలు చాలా అరుదు. ఒక స్టార్ హీరో స్వయంగా తన ఇమేజ్ ను పక్కన పెట్టి పుష్ప రాజ్ వంటి పాత్రను చేయడం చాలా అరుదు. ముఖ్యంగా ఒక లోపం ఉన్న వ్యక్తిగా నటించడం. ఇది నిజంగానే ఆరుదైన సంఘటనలో ఒకటి అని చెప్పొచ్చు. ఒక ప్రేక్షకుడిగా సినిమాను చూసినప్పుడు నిజంగానే పుష్ప వంటి పాత్ర ఉంటుందని నేను నమ్మాను. ఇలా ప్రేక్షకుడిని సినిమాలోని పాత్రలో జీవించి, ఆకట్టుకోవడం అన్నది నటుడికి అంత తేలికైన విషయం కాదు. పుష్ప పాత్ర హై కాంట్రాస్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి వచ్చింది. అంటే ఇన్నోసెంట్ కలిపి ఉన్న కన్నింగ్, సూపర్ ఈగో వంటి లక్షణాలాన్ని పుష్పరాజ్ పాత్రలో కలగలిపి ఉన్నాయి. నేను ఇలాంటి వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా సూపర్ హీరో అంటే ఉన్న డెఫినిషన్ వేరు. దాని ప్రకారం సూపర్ హీరో అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. కానీ పుష్ప క్యారెక్టర్ లో నటించిన అల్లు అర్జున్ మాత్రం ఆ నిర్వచనాన్ని తప్పు అని నిరూపించారు. మునుపెన్నడూ చూడని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయి. 

ఇప్పటి నుంచి దశాబ్దాల పాటు పుష్పరాజ్ పాత్ర ఒక రిఫరెన్స్ పాయింట్ గా ఉండబోతోంది సినిమా చరిత్రలో. కానీ సినిమాలో అల్లు అర్జున్ తన పాత్రకు సంబంధించిన కొన్ని అవాస్తవిక దృశ్యాలు కూడా నిజమేమో అనిపించేలా నటించాడు. సీఎం తనతో ఫోటోకు ఫోజులు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు అతనికి అహం దెబ్బతిని, మనసుకు గాయం కావడం లేదా అహంకారాన్ని చంపుకుని సారీ చెప్పడానికి తాగడం వంటి ఎమోషనల్ సన్నివేశాల ద్వారా అల్లు అర్జున్ ఆ పాత్రకు ప్రాణం పోశారు. అతను కేవలం బాడీ లాంగ్వేజ్ తో మాత్రమే కాకుండా ఇలా డీప్ గా ఉండే ఎమోషన్స్ తో పుష్పరాజ్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఈ విషయాన్ని చెప్పినందుకు క్షమించండి కానీ పుష్ప 2 ద్వారా ఈ జర్నీని బాగా ఆస్వాదించాక నేను అనుకుంటున్నది ఏంటంటే అల్లు అర్జున్ కూడా అతని ముందు తక్కువే అన్పిస్తున్నాడు’ అంటూ ముగించారు రాంగోపాల్ వర్మ. మొదటి నుంచి రాంగోపాల్ వర్మ అల్లు వర్సెస్ మెగా వివాదంపై ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ, ‘పుష్ప 2’ సినిమాకు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇలా పుష్ప రాజ్ పాత్రను ప్రశంసలతో ముంచేస్తూ ఆయన చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

Also Readఅల్లు అర్జున్‌కు మళ్లీ నేషనల్ అవార్డు… ‘పుష్ప 2’కు వచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments