Homeవినోదంఇక ఆ సమోసాలే కాపాడాలి - ‘సర్ఫిరా’ మూవీ కోసం అక్షయ్ కుమార్ పాట్లు, ఈ...

ఇక ఆ సమోసాలే కాపాడాలి – ‘సర్ఫిరా’ మూవీ కోసం అక్షయ్ కుమార్ పాట్లు, ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?


INOX Offer To Sarfira Audience: ఒక సినిమాకు హైప్ క్రియేట్ అవ్వాలంటే ముందుగా ఆ మూవీ టీమ్ అంతా కలిసి ఒక రేంజ్‌లో ప్రమోషన్స్ చేయాలి. అంతలాగా ప్రమోషన్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ సినిమా ఆడియన్స్‌కు రీచ్ అవ్వకపోవచ్చు. అలాంటి సమయంలో ఆ మూవీని పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ కాపాడతాయి. ఇవన్నీ లేకపోయినా మూవీ హిట్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికోసమే ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది ‘సర్ఫిరా’ మూవీ టీమ్. ఈ సినిమా చూడడానికి వారు అందిస్తున్న ఆఫర్స్ చూస్తుంటే ఆడియన్స్ షాకవుతున్నారు. అక్షయ్ కుమార్ లాంటి స్టార్ సినిమాను సమోసాలు కాపాడతాయా అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.

రెండు చిత్రాలు పోటీ..

గత నెలలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డామినేషనే కనిపిస్తోంది. అయినా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు 2’ విడుదలకు సిద్ధమయ్యింది. మొదట్లో ఈ సినిమాకు అంతగా హైప్ లేకపోయినా కలెక్షన్స్ విషయంలో పర్వాలేదనిపిస్తోంది. అలా రెండు ప్యాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతుండగా అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇదెక్కడి ఆఫర్..

దేశంలో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్.. ఒక వినూత్న ఐడియాతో ‘సర్ఫిరా’ను ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చింది. ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి వెళ్లినవారు ఒక ఛాయ్, రెండు సమోసాలను ఫ్రీగా పొందవచ్చని ఆఫర్‌ను ప్రకటించింది. దాంతో పాటు ఒక స్పెషల్ గిఫ్ట్‌ను ఇస్తానంటోంది ఐనాక్స్. ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఇలాంటి ఒక ఆఫర్‌ను ప్రకటించలేదు. అలాంటిది అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో సినిమాకు కనీసం బుకింగ్స్ లేకపోవడం వల్లే ఇలా సమోసాలు ఆఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని బాలీవుడ్ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

నేషనల్ అవార్డ్..

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సురరాయ్ పొట్రు’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది ‘సర్ఫిరా’. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డ్ దక్కింది. దీంతో ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని సూర్య నిర్ణయించుకున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో ‘సర్ఫిరా’ను నిర్మించారు. సౌత్‌లో ఓ రేంజ్‌లో హిట్ అయిన ఈ మూవీ.. నార్త్‌లో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో అక్షయ్ కుమార్ సరసన రాధిక మదన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటివరకు ‘సర్ఫిరా’ కేవలం రూ.12 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.

Also Read: కన్నడ హీరో రక్షిత్ శెట్టిపై కేసు నమోదు – పర్మిషన్ లేకుండా ఆ పనిచేశాడంటూ ఆరోపణలు

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments