Homeవినోదంఇండిపెండెన్స్ డే స్పెషల్- ‘మల్లేశం’ బ్యూటీ ‘పొట్టేల్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌!

ఇండిపెండెన్స్ డే స్పెషల్- ‘మల్లేశం’ బ్యూటీ ‘పొట్టేల్‌’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌!


Pottel Movie Release Date: అనన్య నాగళ్ల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘మల్లేశం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె, తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘వకీల్ సాబ్’ సినిమాతో మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే పలు సినిమాలు చేసినా, సోషల్ మీడియాలో అందాలు ఆరబోసినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు రావడం లేదు.

‘పొట్టేల్’ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్

ప్రస్తుతం అనన్య నాగళ్ల ‘పొట్టేల్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. యువ చంద్ర కృష్ణ హీరోగా కనిపించబోతున్నారు. సాహిత్ మోత్కూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పూర్తి తెలంగాణ గ్రామీణ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తెలంగాన సంస్కృతి సంప్రదాయాలను ఈ సినిమాలో అద్భుతంగా చూపించబోతున్నట్లు అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. గుర్రంగట్టు ప్రాథమిక పాఠశాల ముందు పొట్టేల్ తో కలిసి తన ఫ్యామిలీతో అనన్య దిగిన ఫోటోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అంతేకాదు, ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది? అనే విషయాన్ని కూడా వెల్లడించారు.

దసరా కానుకగా’ పొట్టేల్’ విడుదల    

‘పొట్టేల్’ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే డేట్ ఫిక్స్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని చూపించేలా ఆ పోస్టర్ ను రూపొందించారు. బోనాల పండుగను అద్భుతంగా చూపించే దృశ్యాలు.. వేడుకల్లో అమ్మవారి ముందు పొట్టేల్‌ను బలి ఇవ్వడం, రంగం ప్రదర్శించడం సహా పలు విషయాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అటు అనన్య బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో ‘మల్లేశం’ బ్యూటీ గ్రామీణ యువతిగా కనిపించింది.

ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి బుజ్జమ్మగా అనన్య కనిపించనుంది. ఈ మూవీలో తన క్యారెక్టర్ తన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనన్య వెల్లడించింది. ఈ పాత్రను తాను ఎంతో ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. పనిలో పనిగా తనకు హీరోయిన్ సమంత అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఆమె చక్కటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విధానం ఆకట్టుకుంటుందని వెల్లడించింది. ఆమె పాత్రల ఎంపిక కూడా చాలా బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఆమె లాగే తాను కూడా ముందుకు వెళ్లాలనని భావిస్తున్నట్లు చెప్పింది.   

ఇక ‘పొట్టేల్‘ సినిమాను ఎన్ఐఎస్ఏ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌, ప్రగ్యా సన్నిది క్రియేషన్స్ బ్యానర్‌ సమంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  మూవీలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరీ, నీల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Read Also: ఇదేం ఇండిపెండెన్స్ డే, కోల్‌కత్తా డాక్టర్‌ హత్యాచార ఘటనపై ఉపాసనా సెన్సేషనల్ పోస్ట్

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments