Homeవినోదంఆనంద్‌ దేవరకొండ 'గం గం గణేశా' ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే - స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

ఆనంద్‌ దేవరకొండ ‘గం గం గణేశా’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే – స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!


Anand Devarakonda Gam Gam Ganesha OTT Partner and Streaming: టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘గం గం గణేశా’. ‘బేబీ’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్‌ షో నుంచి ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంటుంది. సోషల్‌ మీడియా రివ్యూస్ ప్రకారం.. సినిమా మొత్తం ఎంజాయ్‌ చేయొచ్చంటూ ప్రిమియర్‌ షోలు చూసిన నెటిజన్లు చెబుతున్నారు.

మూవీ కాన్పెప్ట్‌ సూపర్‌ అని, రెండున్నర గంటల పాటు ఎక్కడ లాగ్‌ లేకుండ ఎంటర్‌టైనర్‌గా మూవీ సాగిందంటున్నారు. ఇక సినిమా క్లైమాక్స్‌ అల్టిమేట్‌ అని, ఇది ఎవరూ ఊహించలేరంటున్నారు. దీంతో మూవీపై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం థియేటర్లో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీ డిటైయిల్స్‌పై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం థియేటర్లో రిలీజైన ఏ సినిమా అయినా ఓటీటీలో అలరిస్తున్నాయి. 

ఇక మూవీ రిజల్ట్‌ బట్టి ఓటీటీ ప్రీమియర్‌కు డిసైడ్‌ అవుతుంది. ‘గం గం గణేశా’కు పాజిటివ్‌ టాక్ రావడంతో ఇప్పుడు డిజిటల్‌ ప్రియులంతా మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ‘గం గం గణేశా’ అప్పుడే ఓటీటీ పార్ట్‌నర్‌ని లాక్‌ చేసుకుంది. అమెజాన్‌ ప్రైం ఈ మూవీని ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కులు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను థియేట్రికల్‌ రన్‌ అనంతరం ఓటీటీలోకి తీసుకురానుంది. అంటే ‘గం గం గణేశా’ జూన్ చివరి వారం లేదా జూలై నెలలో ఓటీటీకి తీసుకువచ్చేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తుందని టాక్. అయితే గం గం గణేశా ఓటీటీ పార్ట్ నర్, ఓటీటీ డిటైయిల్స్ కి సంబంధించి  త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం.  

ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంద్‌ దేవరకొండ సరసన నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాతో వంశీ కారుమంచి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. తన మిత్రుడు కేదార్ సెలగం శెట్టితో కలిసి  హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వంశీ ఈ మూవీని నిర్మించారు. దాదాపు ఈసినిమానే నేడు 400 థియేటర్లలో విడుదల చేశారు. ఇదిలా ఉంటే గతేడాది ఆనంద్‌ దేవరకొండ బేబీ సినిమాతో బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్నాడు. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచాలు నెలకొన్నాయి. అలా భారీ అంచాలా మధ్య థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫుల్‌ లెన్త్‌ కామెడీ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది. ఇక రివ్యూస్‌ చూస్తుంటే ఈ మూవీతో ఆనంద్‌ ఖాతా మరో పెద్ద హిట్‌ ఖాయం అంటున్నారు. 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments