పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ (Allu Arjun) ఓవర్ నైట్లో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే. ఆయన మాత్రమే కాదు… ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ కూడా ఇదే రేంజ్ లో పాపులర్ అయ్యారు. ఇక సునీల్, అనసూయ లాంటి కీలక పాత్రలు పోషించిన నటీనటులు కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే ‘పుష్ప’ సినిమా హీరో హీరోయిన్ లుగా సుకుమార్ ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ కాదట. సుకుమార్ దృష్టిలో పెట్టుకొని ‘పుష్ప’ను రాసుకున్న హీరో హీరోయిన్లు ఈ మూవీని రిజెక్ట్ చేశారనే వార్త చక్కర్లు కొడుతోంది.
2021 లో రిలీజ్ అయిన ‘పుష్ప ది రైజ్’ మూవీ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా డిసెంబర్ 5న ‘పుష్ప 2 ది రూల్’ అనే మూవీ వచ్చేసింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో, ఆరు భాషల్లో ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ అయింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అల్లు అర్జున్ కంటే ముందు సుకుమార్ మరో ముగ్గురు స్టార్స్ ని దృష్టిలో పెట్టుకొని కథను రాసుకున్నారట. కానీ ఆ ముగ్గురూ సుకుమార్ ని రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్, రష్మిక దగ్గరకు వచ్చి పడింది ఈ స్టోరీ. మరి ఇలాంటి అద్భుతమైన సినిమాను వదులుకున్న స్టార్స్ ఎవరు అంటే..
Also Read: సుక్కూ… ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? ‘పుష్ప 3’లో చూసుకో అంటావా?
పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం ముందుగా సుకుమార్ మహేష్ బాబుని అనుకున్నారట. ఆయనను దృష్టిలో పెట్టుకుని కథను రాసుకున్నారట. స్టోరీతో ఆయన దగ్గరకు వెళ్ళగా, మహేష్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి సంకోచించాడట. దీంతో ఈ మూవీని రిజెక్ట్ చేశాడట. ఇంకేముంది సుకుమార్ అల్లు అర్జున్ కి కథను వినిపించడం, ఆయన ఓకే చెప్పడం… ఆ తర్వాత రికార్డులు తిరగ రాయడం తెలిసిందే. ఇక ‘పుష్ప’లో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలాగే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రకు ముందుగా సమంతను అనుకున్నారట. కానీ అప్పటికే ఆమె సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించింది. దీంతో మరోసారి అలాంటి క్యారెక్టర్ చేయలేను అంటూ సమంత రిజెక్ట్ చేసిందట.
కానీ ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రష్మిక మాత్రం నేషనల్ క్రష్ గా ఎదిగింది. అలాగే సినిమాలో ఎస్పి బన్వర్ సింగ్ షెకావత్ అనే విలన్ పాత్రకి ముందుగా సుకుమార్ అనుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్ కాదు. విజయ్ సేతుపతిని అనుకున్నారట. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన నో చెప్పడంతో ఈ అవకాశం ఫాహద్ చేతికి చెక్కింది. ఇక ఆయన ‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: పుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్లో అల్లు అర్జున్ మాస్ తాండవం… మరి సినిమా హిట్టా? ఫట్టా?
మరిన్ని చూడండి